
టెక్ దిగ్గజం యాపిల్ నిర్వహించే టెక్ ఫెస్టివల్ వచ్చేసింది. వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ)- 2022ను జూన్ 6నుంచి జూన్ 10వరకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. అయితే ఈ డెవలర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా యాపిల్ సంస్థ తాను విడుదల చేయబోయే గాడ్జెట్స్ గురించి ప్రకటన చేస్తుంది. అందుకే వచ్చే నెలలో జరగనున్న కాన్ఫరెన్స్ లో యాపిల్ ఏం ప్రకటన చేస్తుందోనని టెక్ లవర్స్‌కు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థ ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్‌ల గురించి డబ్ల్యూడబ్ల్యూడీసీలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఐఓఎస్ 16, ఐపాడ్ ఐఓఎస్ 16, వాచెస్ ఓస్ 9 లలో అదనంగా కొన్ని ఫీచర్లను యాడ్ చేయనుంది.
నోటిఫికేషన్‌ల అప్‌డేట్‌తో పాటు కార్ క్రాష్ డిటెక్షన్, ఐపాడ్‌లలో కొత్త మల్టీ టాస్కింగ్ ఇంటర్ ఫేస్ తో పాటు మిగిలిన గాడ్జెట్ అప్‌డేట్‌ల గురించి ప్రకటన చేయనున్నట్లు వెలుగులోకి వచ్చిన పలు నివేదికలు పేర్కొన్నాయి.