ప్రతీ ఏడాది లాగానే సెప్టెంబరులో నిర్వహించే ఆపిల్ ఈవెంట్ 2020ని కూడా కాలిఫోర్నియాలో నిర్వహించింది. అయితే కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది సంస్థ ప్రధాన కార్యాలయం ఆపిల్ పార్క్ లో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అందరూ ఊహించినట్టుగానే ఆపిల్ వాచ్ సిరీస్ 6, ఆపిల్ వాచ్ ఎస్ఈ ఐప్యాడ్ 8వ జెన్, ఐప్యాడ్ ఎయిర్ (2020)ను లాంచ్ చేశారు. అలాగే ఈ ఏడాది చివర్లో ఐఫోన్ 12 సిరీస్ తీసుకొస్తున్నట్టు కుక్ ప్రకటించారు. ముఖ్యంగా ఐప్యాడ్ ఆపరేటింగ్ సిస్టం 14, వాచ్‌ఓఎస్ 7 నేడు (సెప్టెంబర్ 16 న) విడుదల చేయనున్నట్లు ఆపిల్ ప్రకటించింది. "టైమ్ ఫ్లైస్" ఈవెంట్ గా పేర్కొన్న వర్చువల్ షోలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 2020ను ఆవిష్కరించలేదు.
ఐప్యాడ్ ఎయిర్ 4
టచ్ ఐడి, ఎ14 బయోనిక్ ప్రాసెసర్ యుఎస్‌బి-సి కనెక్టివిటీని కలిగి ఉన్నడిజైన్‌తో కంపెనీ విడుదల చేసింది.నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్ న్యూరల్ ఇంజిన్‌తో సరికొత్త చిప్‌ను పొందడం దాదాపు తొమ్మిది సంవత్సరాలలో ఇదే మొదటిసారి
ఐప్యాడ్ ఎయిర్ 4 స్పెసిఫికేషన్స్
10.9 అంగుళాల ఎడ్జ్-టు-ఎడ్జ్ రెటీనా డిస్‌ప్లే
12 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా
7 మెగాపిక్సెల్ సెల్ఫీ హెచ్‌డి కెమెరా
ఇది అక్టోబరునుంచి ఆపిల్ స్టోర్లలో లభ్యం కానుంది. ఐప్యాడ్ ఎయిర్ వై-ఫై మోడల్స్ ప్రారంభ ధర 54,900 రూపాయలు. వై-ఫై + సెల్యులార్ మోడల్స్ 66,900 రూపాయల నుండి ప్రారంభం.
64 జీబీ, 256 జీబీ కాన్ఫిగరేషన్లలో సిల్వర్, స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్, గ్రీన్ స్కై బ్లూ ఐదు కలర్స్ లో లభ్యం.
ఐప్యాడ్ 8
ఇన్ బిల్ట్ టచ్ ఐడి, హోమ్ బటన్ ఫీచర్లతో కొత్త ఐప్యాడ్ 7వ తరం మాదిరిగానే ఉంది. ఏ10 ఫ్యూజన్ చిప్ షాట్ కొత్త అప్‌గ్రేడ్.10 గంటల బ్యాటరీ లైఫ్ మరో ప్రత్యేకత. ఆపిల్ పెన్సిల్, ఐప్యాడ్ ఓస్14, 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, ఫేస్‌టైమ్ హెచ్‌డీ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉ న్నాయి. ఏ12 బయోనిక్ చిప్, టచ్ ఐడీ, స్మార్ట్ కీబోర్డ్ కవర్ ఆపిల్ పెన్సిల్ లాంటి వాటితో తీసుకొచ్చింది. వై-ఫై మోడల్ 29,900 ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. వై-ఫై + సెల్యులార్ 41,900 రూపాయలు. 32 జీబీ, 128 జీబీ కాన్ఫిగరేషన్లలో సిల్వర్, స్పేస్ గ్రే, గోల్డ్ ఫినిష్ రంగుల్లో లభ్యం.
ఆపిల్ వాచ్ సిరీస్ 6
మిగిలిన అన్ని అద్భుతమైన ఫీచర్లతోపాటు, పల్స్ ఆక్సీమీటర్ అవసరం లేకుండానే పల్స్ తెలుసుకునే ఫీచర్ లో ఇందులో జోడించింది. 40ఎంఎం, 44ఎంఎం సైజుల్లో తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో ప్రాసెసర్ గతంకంటే 20 శాతం వేగంగా పనిచేస్తుంది. రెడ్ బ్యాండ్ ఎడిషన్‌తో తీసుకొచ్చిన తొలి ఆపిల్ వాచ్ ఇది. ఈ అమ్మకాల నుండి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఆపిల్ చారిటీలకు అందిస్తుంది. ఏడు రంగులలో లభ్యం. ఆపిల్ వాచ్ సిరీస్ 6 ధర భారతదేశంలో 40,900 రూపాయల నుంచి ప్రారంభం.
ఆపిల్ వాచ్ ఎస్ఈ
ఆటోమేటిక్ లొకేషన్ నోటిఫికేషన్లు, స్కూల్ టైం మోడ్ లాంటి కొత్త ఫీచర్లతో ఎక్కువగా పిల్లలకు ఆకర్షించనుంది. ఆపిల్ వాచ్ ఫ్యామిలీ సెటప్ తో దీన్ని తీసుకొచ్చింది. ఒకే ఐఫోన్‌కు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆపిల్ వాచెస్‌ను పెయిర్ చేసుకోవచ్చు. అయితే ఈ స్మార్ట్ వాచెస్ భారతదేశంలో ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ స్పష్టం చేయలేదు. త్వరలోనే అని ప్రకటించింది.
ఆపిల్ వాచ్ ఎస్‌ఇ జీపీఎస్ మోడల్ ధర రూ. 29,900 నుంచి ప్రారంభం
సెల్యులార్ మోడల్ 33,900 రూపాయలు.
Comments
Please login to add a commentAdd a comment