యాపిల్ 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్ రేపు (సెప్టెంబర్ 9) ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్‌లో కంపెనీ తన ఐఫోన్ 16 సిరీస్, వాచ్ సిరీస్ 10ను కూడా లాంచ్ చేయనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం కాలిఫోర్నియాలోని యాపిల్ కుపెర్టినో పార్క్‌లో జరుగుతుంది. యాపిల్ అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్, యాపిల్ టీవీ యాప్ ద్వారా ఈ ఈవెంట్ లైవ్ చూడవచ్చు.
గ్లోటైమ్ ఈవెంట్‌లో.. యాపిల్ చీఫ్ టిమ్ కుక్ కొత్త ఐఫోన్ పరికరాలను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉండనున్నాయి. వీటికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడికానప్పటికీ కొన్ని పుకార్లు లేదా లీక్స్ ద్వారా కొన్ని విషయాలు వెల్లడయ్యాయి.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లను భారతదేశంలోనే తయారు చేయనున్నట్లు సమాచారం. కాబట్టి మనదేశంలో ఈ పరికరాల రిటైల్ ధర కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంది.
యాపిల్ ఐఫోన్ 16 సిరీస్
యాపిల్ ఐఫోన్ 16 సిరీస్.. 6.1 ఇంచెస్ నుంచి 6.7 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే పొందనున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌లు బ్లూ, గ్రీన్, రోస్, వైట్, బ్లాక్ అనే కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఐఫోన్ 16 ప్రో బ్రౌన్ కలర్ పొందనున్నట్లు సమాచారం. దీనిని డెసర్ట్ టైటానియం అని పిలుస్తారు. దీంతితో పాటు గోల్డ్ కలర్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఇదే మార్గం: నితిన్ గడ్కరీ
యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ మైక్రో-లెన్స్ టెక్నాలజీని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.89,900 వరకు ఉండొచ్చని అంచనా. ఐఫోన్ 16 సిరీస్ 2x ఆప్టికల్ 48MP ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వంటి వాటిని పొందే అవకాశం ఉంది. ఈ 16 సిరీస్ మోడల్స్ ఏ18 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఇది ఏఐకు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment