యాపిల్ కంపెనీ ప్రతి ఏటా కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తుంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 2024లో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెనీ మ్యాక్ బుక్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే కంపెనీ దీనిని లాంచ్ చేయడానికి ప్రత్యేకంగా ఈవెంట్ నిర్వహించే అవకాశం లేదని సమాచారం. కాబట్టి దీనికి సంబంధించిన ప్రకటనలు ఉండవచ్చని తెలుస్తోంది.
యాపిల్ మ్యాక్ ప్రకటనలు నవంబర్ 28న రానున్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ 'గ్రెగ్ జోస్వియాక్' తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
గ్రెగ్ జోస్వియాక్ ప్రకటనకు ముందే మ్యాక్ బుక్ లేటెస్ట్ వెర్షన్‌కు సంబంధించి కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది యాపిల్ ఎమ్4 చిప్ పొందనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో ఐమ్యాక్, మ్యాక్ బుక్ ప్రో, మ్యాక్ మినీ వంటి కొత్త అప్‌డేట్‌లకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: జియో దీపావళి ఆఫర్స్: రూ.3,350 విలువైన బెనిఫిట్స్
యాపిల్ మ్యాక్ బుక్ రిఫ్రెష్ డిజైన్ కలిగి, అప్డేటెడ్ ఫీచర్స్ కూడా పొందనున్నట్లు సమాచారం. ఇందులో 10 కోర్ సీపీయూ ఉండే అవకాశం ఉంది. అయితే కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కొత్త యాపిల్ మ్యాక్ బుక్‌కు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
Mac (😉) your calendars! We have an exciting week of announcements ahead, starting on Monday morning. Stay tuned… pic.twitter.com/YnoCYkZq6c
— Greg Joswiak (@gregjoz) October 24, 2024
Comments
Please login to add a commentAdd a comment