కొన్ని రోజులకు ముందు తీవ్ర చర్చకు దారితీసిన జియో హాట్‌స్టార్ డొమైన్ వ్యవహారం.. మళ్ళీ మరో కీలక మలుపు తిరిగింది. తాజాగా దుబాయ్‌కి చెందిన ఇద్దరు చిన్నారులు తాము కొనుగోలు చేసిన జియో హాట్‌స్టార్ డొమైన్‌ను రిలయన్స్ సంస్థకు ఉచితంగా ఇచ్చేస్తాం అంటూ ఆఫర్ ఇచ్చారు.
నిజానికి జియో హాట్‌స్టార్ విలీనం వేళ.. ఈ పేరుతో ఉన్న డొమైన్‌ను ఢిల్లీకి చెందిన యాప్ డెవలపర్ ముందుగానే తన పేరుతో రిజిస్టర్ చేసుకున్నాడు. తాను కొనుగోలు చేసిన డొమైన్‌ను ఇవ్వాలంటే రూ. కోటి రూపాయలు ఇవ్వాలంటూ.. అంబానీకి ఆఫర్ ఇచ్చాడు. ఆ తరువాత డొమైన్‌ను దుబాయ్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు కొనుగోలు చేశారు.
జియో హాట్‌స్టార్ కొనుగోలు చేసిన చిన్నారులు.. దీనికి సంబంధించిన ఓ కీలక ప్రకటన చేశారు. ఈ డొమైన్‌ను రిలయన్స్ కంపెనీ కోరుకుంటే ఉచితంగానే ఇచ్చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక రిలయన్స్ సంస్థ నుంచి గానీ.. సంబంధిత అధికారుల నుంచి గానీ ఎలాంటి ఒత్తిడి లేదు. మనస్ఫూర్తిగానే మేము ఈ ప్రకటన చేస్తున్నామని ఆ చిన్నారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మాస్క్‌డ్ ఆధార్ కార్డు గురించి తెలుసా?: ఇది చాలా సేఫ్..
చిన్నారులు ఇచ్చిన ఆఫర్‌కు కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అంతకంటే ముందు యాప్ డెవలపర్ నుంచి చిన్నారులు కొనుగోలు చేసిన తరువాత.. చాలామంది ఆ డొమైన్‌ను విక్రయించండి, అంటూ ఆఫర్ చేసినట్లు వెల్లడించారు. కానీ ఎవరికీ డొమైన్‌ను విక్రయించలేదని వారు స్పష్టం చేశారు. కేవలం యాప్ డెవలపర్‌కు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో జియో హాట్‌స్టార్ డొమైన్ కొనుగోలు చేసినట్లు చిన్నారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment