Xiaomi 11i Hypercharge Launch Date In India: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ భారత్‌లో ఫాస్టెస్ట్ హైపర్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో షావోమీ 11ఐ హైపర్ ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాది జనవరి 6 లాంచ్ చేయనుంది. ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో లాంచ్‌ఐనా రెడ్‌మీ నోట్ 11 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌కు రీబ్రాండెడ్‌గా Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌గా రానున్నుట్లు తెలుస్తోంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తోందని కంపెనీ ప్రకటించింది. అంతేకాకండా భారత ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తోందని కంపెనీ వెల్లడించింది. Xiaomi 11i హైపర్‌ఛార్జ్ 5G కనెక్టివిటీతో రానుంది.
15 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్..!
Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ కేవలం 15 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతోందని కంపెనీ వెల్లడించింది. Xiaomi 11i హైపర్‌ఛార్జ్ ఒకే 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుందని తెలుస్తోంది . కామో గ్రీన్, స్టెల్త్ బ్లాక్ కలర్స్ వేరియంట్స్‌లో రానుంది.
ధర ఎంతంటే..!
చైనా మార్కెట్‌లో Redmi 11 ప్రో + స్మార్ట్‌ఫోన్ భారత్‌లో రీబ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌గా రానుంది. అయితే చైనాలో 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. దీని ధర సుమారు సుమారు రూ. 22,500 గా ఉంది. 8GB + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర భారత్‌లో దాదాపు రూ. 24,900 గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్పెసిఫికేషన్‌లు (అంచనా)
- 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్
- 8GB ర్యామ్+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్
- ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 920 SoC
- 108-ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా డ్యూయల్ జేబీఎల్-ట్యూన్డ్ స్టీరియో స్పీకర్స్,
- 4,500mAh బ్యాటరీ
- 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- 5G కనెక్టివిటీ
Comments
Please login to add a commentAdd a comment