ఆ ఫోన్ మొదట వచ్చేది భారత్ కే!
ఆ ఫోన్ మొదట వచ్చేది భారత్ కే!
Published Tue, May 16 2017 10:59 AM | Last Updated on Tue, Sep 5 2017 11:18 AM
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్.. ఎంట్రీ లెవల్ లో జెడ్ 4 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఎవరైతే ఫీచర్ ఫోన్ నుంచి సోషల్ మీడియా, ఇంటర్నెట్, డేటా కనెక్షన్ ఎక్స్ పీరియన్స్ కోసం వేచిచూస్తున్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ ఫోన్ ను శాంసంగ్ తీసుకొస్తోంది. ఎంపిక చేసిన మార్కెట్లలో తొలుత ఈ ఫోన్ ను లాంచ్ చేయాలని భావిస్తున్న శాంసంగ్, మొదటగా భారత్ వినియోగదారులకే అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిసింది. బ్లాక్, సిల్వర్, గోల్డ్ రంగుల్లో ఇది వినియోగదారులను అలరించనుంది. అయితే కమర్షియల్ గా ఎప్పుడు భారత్ లో విడుదల చేస్తారు, ఎంత ధరకు భారత్ లో ఈ ఫోన్ విక్రయానికి వస్తోందో కంపెనీ ఇంకా పబ్లిక్ గా ప్రకటించలేదు.
శాంసంగ్ తీసుకురాబోతున్న ఈ ఎంట్రీ లెవల్ జెడ్4 స్మార్ట్ ఫోన్ ఫీచర్లెలా ఉండబోతున్నాయో ఓసారి చూద్దాం...
4 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్ ప్లే
1జీబీ ర్యామ్
8జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ ప్రొవిజన్
మైక్రో ఎస్డీకార్డు ద్వారా 128జీబీ వరకు విస్తరణ
400x800 పిక్సెల్స్ రెజుల్యూషన్
2.5డీ కర్వ్డ్ గ్లాస్
143 గ్రాముల బరువు
క్వాడ్ కోర్ ప్రాసెసర్
శాంసంగ్ టిజెన్ ఓఎస్ వెర్షన్ 3.0
4జీ ఎల్టీఈ
2050ఎంఏహెచ్ బ్యాటరీ
5ఎంపీ రియర్, ఫ్రంట్ కెమరా
డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్
Advertisement
Advertisement