Realme C30 Entry Level Device India Launch Today: Check Price And Specifications - Sakshi
Sakshi News home page

Realme C30 India Launch: అతి తక్కువ ధరలో రియల్‌మీ కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది!

Published Mon, Jun 20 2022 11:10 AM | Last Updated on Mon, Jun 20 2022 11:42 AM

Realme C30 Entry level device Launch Today - Sakshi

సాక్షి, ముంబై:  చైనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం రియల్‌మీ  మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఈరోజు భారత మార్కెట్లో లాంచ్‌ చేయనుంది. సీ-సిరీస్‌లో రియల్‌మీ సీ30 పేరుతో ఎంట్రీ లెవల్‌ ఫోన్‌ను ఈ రోజు (జూన్ 20) మధ్యాహ్నం తీసుకొస్తోంది. రియల్‌మీ వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్  ద్వారా ఈ సార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. మరికొద్ది  గంటల్లో  లాంచ్‌  కానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌  ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి. 

రియల్‌మీ సీ 30 ఫీచర్లు
6.6-అంగుళాల  ఫుల్‌ హెచ్‌ + డిస్‌ప్లే
వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్‌ప్లే
ఆక్టా-కోర్ Unisoc T612 SoC 
13 ఎంపీ ప్రైమరీ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ  కెమెరా 
5,000ఎంఏహెచ్‌ బ్యాటరీని

2 జీబీ రామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 3జీబీ ర్యామ్‌+32 జీబీ స్టోరేజ్‌ అనే రెండు వేరియంట్లలో బ్యాంబూ గ్రీన్, డెనిమ్ బ్లాక్, లేక్ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది.  ఖచ్చితమైన ధర ఇంకా వెల్లడి కాలేదు.  అయితే ప్రారంభ ధర రూ. 7వేలుగా ఉంటుందని అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement