![Itel Announces A46 Dual Camera Smartphone at Rs 4999 - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/17/itel%20A46Smartphone.jpg.webp?itok=vJZlPI_N)
సాక్షి, న్యూఢిల్లీ: ఆధునిక ఫీచర్లు, సరసమైన ధరలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లకు పెట్టింది పేరైన ఐటెల్ కంపెనీ దీన్ని ఆవిష్కరించింది. ఐ టెల్ ఏ 46 పేరుతో దీన్ని ఆవిష్కరించింది. ప్రముఖ మొబైల్ సంస్థ రెడ్‌మికి చెందిన రెడ్ మి 6ఏ కు పోటీగా నిలుస్తుందని మార్కెట్‌వర్గాలు భావిస్తున్నాయి.
భారీ స్క్రీన్, డ్యూయెల్ రియర్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఐటెల్ ఏ46 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతగా కంపెనీ చెబుతోంది. దీని ధరను రూ.4,999గా వెల్లడించింది. ఫోన్‌తోపాటు స్క్రీన్ గార్డ్, బ్యాక్ కేస్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. 1జీబీర్యామ్, 2 జీబీ ర్యామ్ రెండు వేరియంట్లలో నాలుగు రంగుల్లో లభ్యం. అలాగే జియో రూ. 198, 299 ( 24 నెలలపాటు) రీచార్జ్ ప్యాక్‌లపై రూ.1200 ఇన్‌స్టెంట్ క్యాష్‌బ్యాక్‌ను కూడా ఆఫర్ చేస్తోంది.
ఐటెల్ ఏ46 ఫీచర్లు
5.45 అంగుళాల డిస్‌ప్లే
1.6 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
1440 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్
2 జీబీ ర్యామ్+ 16 జీబీ మెమరీ
128జీబీ వరకు విస్తరించుకనే అవకాశం
8 ఎంపీ+వీజీఏ సెన్సర్ డ్యూయెల్ రియర్ కెమెరా
2400 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment