సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన మరో మొబైల్ తయారీ సంస్థ ఐటెల్ గురువారం బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.6990 ధరకే సెల్ఫీప్రొ ఎస్42 పేరుతో ఓ మొబైల్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నలుపు, బూడిద రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్‌లో ఆధునిక ఫీచర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంది. ఇది వొల్టీ(వీవొఎల్‌టీఈ) 4జీ స్మార్ట్‌ఫోన్ అని, వినియోగదాలను అమితంగా ఆకట్టుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తింది.
సెల్ఫీప్రొ ఎస్42 ఫీచర్లు:
5 అంగుళాల డిస్‌ప్లే
3 జీబీ రామ్
16 జీబీ ఇంటర్నల్ మెమరీ
32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ
1.25 గిగా హెర్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్
ముందు వెనక 8 మెగా పిక్సెల్ కెమెరా
2700 ఎంఏహెచ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ నౌగట్ ఓఎస్
తక్కువ ధరలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్
Published Thu, Sep 21 2017 7:19 PM | Last Updated on Fri, Sep 22 2017 11:07 AM
Advertisement
Advertisement