![Itel launches 4 new Android TVs in India: here isdetails - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/20/itel%20tv.jpg.webp?itok=LjM1kFpk)
సాక్షి, న్యూఢిల్లీ: జీ సిరీస్ ఆండ్రాయిడ్ టీవీలను ఐటెల్ సంస్థ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని భారత్‌లోనే తయారు చేసినట్టు కంపెనీ ప్రకటించింది. 400 నిట్స్‌తో కూడిన 4కే అల్ట్రా బ్రైట్ డిస్‌ప్లే, 24 వాట్ స్టీరియో సౌండ్ డాల్బీ ఆడియో, ఫ్రేమ్ పెద్దగా కనిపించని ప్రీమియం డిజైన్, గూగుల్ ప్లేస్టోర్, గూగుల్ అసిస్టెంట్ సాయంతో మాట్లాడుతూ టీవీకి కమాండ్స్ ఇచ్చే సదుపాయాలు ఈ టీవీల్లో ఉన్నాయి. 1జీబీ/8జీబీ, 2జీబీ/8జీబీ సామర్థ్యంతో కూడిన ఈ టీవీలు 60 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటాయి. జీ సిరీస్ కింద కంపెనీ నాలుగు సరికొత్త ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసింది. ఈ టీవీల ధరలు రూ.16,999 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది.
భారతదేశంలో వీటి ధర, లభ్యత: ఇటెల్ ఇప్పటివరకు అన్ని మోడళ్ల ధరలను ప్రకటించలేదు. 32 అంగుళాల నుంచి 55 అంగుళాల పరిమాణంలో నాలుగు టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటెల్ జీ 3230 ఐఈ ధర రూ. 16,999 ఉండగా, ఇటెల్ జీ 4330 ఐఇ ధర రూ. 28,499. అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment