Smart television
-
ఫెస్టివ్ సీజన్: రూ. 29వేలకే 4కే షావోమీ స్మార్ట్ టీవీ
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమి ఇండియా తాజాగా కొత్త సిరీస్ స్మార్ట్‌టీవీలను లాంచ్ చేసింది. ఎక్స్ సిరీస్‌లో 43, 50, 55 అంగుళాల సైజుల్లో ఈ ప్రీమియం స్మార్ట్‌టీవీలు లభ్యం. డాల్బీ విజన్, డాల్బీ ఆడియోతో కూడిన ప్రీమియం బెజెల్-లెస్ డిజైన్‌తో 4కే రిజల్యూషన్ లాంటివి స్పెషల్ ఫీచర్లుగా షావోమీ ఎక్స్ స్మార్ట్‌టీవీలను తీసుకొచ్చింది. 43 అంగుళాల స్మార్ట్‌టీవీ ధర రూ. 28,999, 50 అంగుళాల టీవీ ధర రూ. 34,999, 55 అంగుళాల వేరియంట్ ధర రూ. 39,999 నుండి ప్రారంభం. ఎంఐ హోమ్ స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్ల ద్వారా అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 14 నుంచి ఫ్లిప్‌కార్ట్ అండ్ ఎంఐ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది ప్యాచ్‌వాల్ తాజా వెర్షన్‌తో రూపొందించిన కొత్త సిరీస్ టీవీల ద్వారానేరుగా యూట్యూబ్ మ్యూజిక్‌ను నిరంతరాయంగా ఎంజాయ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. అధిక రిజల్యూషన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, 4 కే విప్లవంలో తామే టాప్‌లో ఉన్నామనీ షావోమి ఇండియా సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ సుదీప్ సాహు తెలిపారు. వినియోగదారుల కోసం సరైన అప్‌గ్రేడ్‌గా ఉండే సిరీస్‌ని తీసుకు రావాలని భావిస్తున్నామన్నారు. భారతీయ వినియోగదారులకోసం హోమ్ స్క్రీన్‌పై IMDb ఇంటిగ్రేషన్, 300+ లైవ్ ఛానెల్‌లు, యూనివర్సల్ సెర్చ్ , కిడ్స్ మోడ్‌తో సహా ప్యాచ్‌వాల్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇంటరాక్టివ్ ప్యాచ్‌వాల్, Android TV 10 ప్లాట్‌ఫారమ్, 2 జీబీ ర్యామ్చ, 8 జీబీ స్టోరేజీ, ప్రముఖ 64-బిట్ క్వాడ్ కోర్ A55 చిప్‌తో ఆధారితంగా పనిచేస్తాయి. డ్యూయల్-బ్యాండ్ వైఫై,,బ్లూటూత్ 5.0 కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. 3 HDMI పోర్ట్ (eARC x 1) తో పాటు, ఇది 2 యూఎస్బీ పోర్ట్‌లు రాజీపడని కనెక్టివిటీ, సంపూర్ణ వీక్షణ అనుభవం కోసం ఏవీ యర్‌ఫోన్ పోర్ట్‌తో కూడా ఈ టీవీలను తీసుకొచ్చింది. -
ఐటెల్ ఆండ్రాయిడ్ టీవీలు వచ్చేశాయ్!
సాక్షి, న్యూఢిల్లీ: జీ సిరీస్ ఆండ్రాయిడ్ టీవీలను ఐటెల్ సంస్థ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని భారత్‌లోనే తయారు చేసినట్టు కంపెనీ ప్రకటించింది. 400 నిట్స్‌తో కూడిన 4కే అల్ట్రా బ్రైట్ డిస్ప్లే, 24 వాట్ స్టీరియో సౌండ్ డాల్బీ ఆడియో, ఫ్రేమ్ పెద్దగా కనిపించని ప్రీమియం డిజైన్, గూగుల్ ప్లేస్టోర్, గూగుల్ అసిస్టెంట్ సాయంతో మాట్లాడుతూ టీవీకి కమాండ్స్ ఇచ్చే సదుపాయాలు ఈ టీవీల్లో ఉన్నాయి. 1జీబీ/8జీబీ, 2జీబీ/8జీబీ సామర్థ్యంతో కూడిన ఈ టీవీలు 60 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటాయి. జీ సిరీస్ కింద కంపెనీ నాలుగు సరికొత్త ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసింది. ఈ టీవీల ధరలు రూ.16,999 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. భారతదేశంలో వీటి ధర, లభ్యత: ఇటెల్ ఇప్పటివరకు అన్ని మోడళ్ల ధరలను ప్రకటించలేదు. 32 అంగుళాల నుంచి 55 అంగుళాల పరిమాణంలో నాలుగు టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటెల్ జీ 3230 ఐఈ ధర రూ. 16,999 ఉండగా, ఇటెల్ జీ 4330 ఐఇ ధర రూ. 28,499. అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. -
వీడియోకాలింగ్ ఫీచర్‌తో సరికొత్త టీవీలు: ధర ఎంతో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ టీసీఎల్ ఇండియాలో తొలి ఆండ్రాయిడ్ 11 టెలివిజన్ (టీవీ)ను విడుదల చేసింది. పీ725 హైఎండ్ టీవీ మోడల్లో వీడియో కాలింగ్ కెమెరా ఉండటం దీని ప్రత్యేకత. 43/50//55/65 ఇంచుల టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.41,990–89,990 మధ్య ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో టీసీఎల్ టీవీలు, ఏసీ ఉత్పత్తులు మాత్రమే లభ్యమవుతున్నాయి. వేసవికాలం నేపథ్యంలో సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్తగా బీ.ఐ.జీ కేర్ అండ్ యూవీసీ స్టెరిలైజేషన్ ప్రొ ఏసీ ‘ఒకారినా’ను కూడా విడుదల చేసింది. 1/1.5/2 టన్ల అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.33,990గా ఉంది. పీ725 టీవీని ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా ఇండియాలోనే విడుదల చేశామని, ఇందులో 65 ఇంచుల టీవీని కేవలం అమెజాన్‌లో విక్రయించనున్నట్లు టీసీఎల్ ఇండియా జీఎం మైక్ చెన్ తెలిపారు. అమెజాన్ఇండియా టెలివిజన్, కేటగిరీ లీడర్ గారిమా గుప్తా మాట్లాడుతూ తమ కస్టమర్ల కోసం వీడియో కాల్ కెమెరాతో టీసీఎల్ తొలి 4 కేహెచ్‌డీఆర్ టివిని తీసుకురావడం సంతోసంగాఉందన్నారు. కస్టమర్లకు ఉత్తమమైన నాణ్యమైన ఉత్పత్తులను నిరంతరం అందిస్తున్న టీసీఎల్‌తో భాగస్వామ్యంతో టెలివిజన్ విభాగంలో బలమైన పోర్ట్‌ఫోలియో తమసొంతమన్నారు. ఆండ్రాయిడ్ టీవీలు కొత్త శ్రేణి అధునాతన లక్షణాలతో కొత్త, టీవీ అనుభవాన్ని అందిస్తాయన్నారు. టీవీల ధరలు 43 అంగుళాలు టీవీ రూ. 41,990 50 అంగుళాల టీవీ ధర రూ. 56,990 55 అంగుళాల టీవీ రూ. 62,990 65 అంగుళాల టీవీ రూ. 89,990 -
షావోమి కొత్త స్మార్ట్ టీవీ: హారిజన్ ఎడిషన్
సాక్షి, ముంబై : షావోమి ఎంఐ టీవీ సిరీస్‌లో రెండు నూతన స్మార్ట్ టీవీలను భారత మార్కెట్లో సోమవారం విడుదల చేసింది. ఎంఐ టీవీ 4ఏ హారిజన్ ఎడిషన్ సిరీస్‌లో ఈ టీవీలు లాంచ్ అయ్యాయి.32 అంగుళాల హెచ్డీ ,43 అంగుళాల ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ తో రెండు స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ ఓఎస్, ఎంఐ క్విక్ వేవ్ ఫీచర్‌ను, ఇన్‌బిల్ట్ క్రోమ్‌క్యాస్ట్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ డేటా సేవర్ ఫీచర్లను జోడించింది. 3 హెచ్డిఎమ్ఐ పోర్ట్‌లు, 2 యుఎస్బి-ఎ పోర్ట్‌లు, ఈథర్నెట్ పోర్ట్ , స్పీకర్లను ఆక్స్ వైర్‌తో కనెక్ట్ చేయడానికి 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. పిక్చర్ క్వాలిటీ కోసం వివిడ్ పిక్చర్ ఇంజిన్ (వీపీఈ) తోపాటు ప్యాచ్ వాల్‌ను ఈ టీవీలలోఅందిస్తోంది. 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ అప్షన్ తో లభ్యం. ధరలు ఎంఐ టీవీ 4ఎ హారిజన్ ఎడిషన్ 32 ఇంచుల టీవీ ధర 13,499 రూపాయలు ఎంఐ టీవీ 4ఎ 43 ఇంచుల టీవీ ధర 22,999 రూపాయలు ఎంఐ ఆన్లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఎంఐ హోం స్టోర్లలో 32అంగుళాల టీవీని ఈ నెల 11వ తేదీ నుంచి, అలాగే 43 ఇంచుల టీవీని ఈ నెల 15వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు Mi TV #HorizonEdition Series is here. - Bezel-less Design* - #PatchWall: 20+ Entertainment Apps - Immersive Horizon Display - Vivid Picture Engine - 20W Stereo 🔊 - Mi QuickWake - https://t.co/PLwrieRGw0#MiTV4A32 - ₹13,499 | Sale: Sep 11#MiTV4A43 - ₹22,999 | Sale: Sep 15 pic.twitter.com/ekGNBC9KKH — Mi India (@XiaomiIndia) September 7, 2020 -
షావోమి : కొత్త ఎంఐ టీవీ త్వరలో
సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి మరో ఎంఐ టీవీని ఇండియాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 7న ఎంఐ టీవీ హారిజన్ ఎడిషన్‌ను లాంచ్ చేస్తున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించింది. కానీ కొత్త ఎంఐ ఆండ్రాయిడ్ ఎంఐ స్మార్ట్ టీవీ ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్ల వివరాలను మాత్రం గోప్యంగా ఉంచింది. అయితే టెలివిజన్ విభాగంలో అత్యధిక ప్రీమియం ధరలో దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా. కొన్ని నెలల విరామం తరువాత, రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో దీన్ని తీసుకు రానుంది. ఎంఐ టీవీ హారిజన్ ఎడిషన్ టీజర్ ప్రకారం ప్రీమియం స్క్రీన్ కలిగి ఉండవచ్చని సూచించే ‘క్వింటెన్షియల్ డిస్ప్లే టెక్’ తోపాటు, ప్యాచ్‌వాల్ లాంచర్, 5వేలకు పైగా యాప్ లకు యాక్సెస్ లభించనుంది. ఎంఐ టీవీ స్విచ్ ఆన్ చేసిన ప్రతిసారీ పూర్తిగా రీబూట్ కావడానికి 45 సెకన్ల సమయం పడుతుందన్న విమర్శల నేపథ్యంలో ‘క్విక్ వేక్’ ఫీచర్ కూడా జోడించినట్టు తెలుస్తోంది. 👀 What have we got in store for you next? 😉 Immersive. Work Of Art. #HorizonEdition coming on 07.09.2020. Drop your guess in comments. Know more - https://t.co/czbzkkZzJB pic.twitter.com/12zjDMqg3X — Mi India (@XiaomiIndia) August 24, 2020 -
టీసీఎల్ సూపర్ స్మార్ట్ టీవీలు : ధర
సాక్షి, ముంబై : చైనాకు చెందిన టెలివిజన్ తయారీదారు టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. 8 కే క్యూఎల్ఈడీ టీవీ 4 కే క్యూఎల్ఈడీ టీవీలను భారతదేశంలో ప్రవేశపెట్టింది. 8 కే క్యూఎల్ఈడీ 75 అంగుళాల ప్యానల్‌ను కలిగి ఉండగా, 4 కె క్యూఎల్ఈడీ టివి శ్రేణి ప్రీమియం, ఎంట్రీ లెవల్ కేటగిరీలో పలు స్క్రీన్ పరిమాణాలలోతీసుకొచ్చింది. వీటి ధరలు రూ .45,990 నుండి మొదలై 2,99,990 రూపాయల వరకు ఉన్నాయి. కొత్త టీవీలు హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ ఫీచర్ తో రావడం విశేషం. ఈ తాజా చేర్పులతో, ప్రీమియం స్మార్ట్ టీవీ విభాగంలో కొత్త మైలురాళ్లను సృష్టించనున్నామని టీసీఎల్ ఇండియా జనరల్ మేనేజర్ మైక్ చెన్ తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటి 8 కె క్యూఎల్ఈడీ టీవీని తొలిసారిగా తామే లాంచ్ చేస్తున్నామన్నారు. 75 అంగుళాల ఎక్స్915 8 కె క్యూఎల్డి ఆండ్రాయిడ్ టీవీలో ఐమాక్స్ పాప్-అప్ కెమెరా, డాల్బీ విజన్ అల్ట్రా-వివిడ్ ఇమేజింగ్, డాల్బీ అట్మోస్ ఆడియో, ఏఐ ఆధారిత 8కే ప్రాసెసర్ లాంటి మెరుగైన ఫీచర్లను ఈ టీవీలలో అందిస్తామని తెలిపారు. 8 కె క్యూఎల్ఈడీ 75 ఎక్స్ 915 ధర 2,99,990 రూపాయలు. 4 కె క్యూఎల్ఈడీ టీవీ : సీ 815, సీ 715 క్వాంటం డాట్ డిస్ ప్లే టెక్నాలజీ ప్రధాన ఆకర్షణ. సీ 815 4 కె క్యూఎల్టీవీ ప్రారంభ ధర 69,990 రూపాయలు. ఇవి 55, 65, 75 అంగుళాలల్లో లభ్యం సీ 715 ఎంట్రీ లెవల్ 4 కె క్యూఎల్ఈడీ టీవీ ధర 45,990 రూపాయలు. 50, 55 65 అంగుళాలలో లభిస్తుంది. 'మేక్ ఇన్ ఇండియా' చొరవలో భాగంగా ఎలక్ట్రానిక్స్ తిరుపతిలో 2,400 కోట్ల రూపాయల విలువైన తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ సంవత్సరానికి 8 మిలియన్ల 22-55 అంగుళాల టీవీ స్క్రీన్లను, 30 మిలియన్ల 3.5-8 అంగుళాల మొబైల్ స్క్రీన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉందనీ, ఇదే అతిపెద్ద ఉత్పాదక యూనిట్ అని పేర్కొంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 8వేల మందికి పైగా ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారని టీసీఎల్ వెల్లడించింది. -
నోకియా సూపర్ స్మార్ట్ టీవీలు : ఫ్లిప్‌కార్ట్‌తో జత
సాక్షి, న్యూఢిల్లీ: హెచ్ఎండీ గ్లోబల్ ద్వారా స్మార్ట్‌ఫోన్ రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ను అందుకున్న నోకియా తాజాగా టీవీ సెగ్మెంట్‌పై కూడా కన్నేసింది. త్వరలోనే స్మార్ట్‌టీవీలను లాంచ్ చేయనుంది. ఇందులోభాగంగా ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారతదేశంలో నోకియా స్మార్ట్ టీవీలను లాంచ్ చేయడానికి ఫ్లిప్‌కార్ట్ బుధవారం నోకియాతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుందని ఫ్లిప్‌కార్ట్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయ వినియోగదారుల అవసరార్థం దేశీయంగా నోకియా-బ్రాండెడ్ స్మార్ట్ టీవీల అభివృద్ధి, పంపిణీని సులభతరం చేయడానికి, ఎండ్-టు-ఎండ్, గో-టు-మార్కెట్ వ్యూహాన్ని నిర్వహించేందుకు ఫ్లిప్‌కార్ట్ పనిచేయనుందని తెలిపింది. నోకియా బ్రాండ్‌తో భాగస్వామ్యం ద్వారా ఉత్తేజకరమైన కొత్త అధ్యాయానికి నాంది పలికామని చెప్పింది. తద్వారా కొన్ని వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అత్యాధునిక సౌండ్ నాణ్యత కోసం ఇందులో జేబీఎల్ సౌండ్ సిస్టంని ఉపయోగించనున్నారు. దీంతో భారతదేశ టీవీ రంగంలో జేబీఎల్ కూడా మొదటిసారి అడుగు పెడుతున్నట్లు అవుతుంది. వినియోగదారులకు సౌండ్ సిస్టమ్‌నుఅందించేందుకు జేబీఎల్ తో ఒప్పందం కుదుర్చుకున్నామనీ, ఫ్లిప్‌కార్ట్ ప్రైవేట్ బ్రాండ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్- ఆదర్ష్ మీనన్ తెలిపారు. ఈ టీవీలను ఎప్పుడు మార్కెట్లోకి తీసుకువచ్చేదీ, ధర, ఫీచర్లు సంబంధిత వివరాలను మాత్రం వెల్లడించలేదు. -
హువావే దూకుడు : 8కే 5జీ స్మార్ట్ టీవీలు
చైనాకు చెందిన దిగ్గజ స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ హువావే స్మార్ట్ టీవీ వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అమెరికా దిగ్గజం యాపిల్ కంపెనీని వెనక్కు నెట్టి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీగా అవతరించిన హువావే ప్రపంచంలోనే తొలి 5జీ సపోర్ట్ టీవీని ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. హువావే అదిరిపోయే స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి తీసుకు రానుందని నికాయ్ ఏషియన్ రివ్యూ నివేదించింది. 5జీ సపోర్ట్ ఫీచర్‌తో 8కే స్మార్ట్ టీవీని త్వరలోనే ఆవిష్కరించనుంది. దీని ప్రకారం కంపెనీ తన మేట్ 20ఎక్స్ 5జీ, ఫోల్డబుల్ మేట్ ఎక్స్ 5జీ స్మార్ట్ఫోన్ల మాదిరే ఈ టీవీల్లోనూ 5జీ మాడ్యూల్స్‌ను అమర్చనుంది. ఈ అంచనాలు నిజమైతే 5జీ, హైఎండ్ రిజల్యూషన్ డిస్ప్లే, గిగాబిట్ సామర్థ్యంతో వైర్లెస్ స్టాండర్ట్ కేపబుల్ టీవీని ఆవిష్కరించిన కంపెనీగా హువావే చర్రిత సృష్టించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో శాంసంగ్ కంపెనీకి గట్టి పోటీ ఎదురు కానుంది. కాగా ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీల్లో ఒకటైన హువావే అమ్మకాలు 2019 తొలి త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 50 శాతం వృద్దిని సాధించి యాపిల్‌ను సైతం వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే. -
స్మార్ట్ టీవీకి కూడా హ్యాకింగ్ ప్రమాదం!
పీసీ, స్మార్ట్ఫోన్లే కాదు... సరైన ప్రొటెక్షన్ లేకపోతే స్మార్ట్ టీవీలను హ్యాక్ చేయడం హ్యాకర్లకు చాలా సులువుగా మారిందని అంటున్నారు నిపుణులు. స్మార్ట్ టీవీ విషయంలో ఈ పరిణామం గురించి వారు ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేసి ఆ టీవీని అధీనంలోకి తీసుకోవడమే గాక దాని ముందున్న వారి ఫోటోలను క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉందనడం మరింత ఆందోళనకరమైన విషయంగా మారింది. ఇటీవలే లాస్‌వెగాస్‌లో జరిగిన ఒక సదస్సులో పరిశోధకులు స్మార్ట్ టీవీ వినియోగదారులకు హ్యాకింగ్ గురించిన హెచ్చరికలు జారీ చేశారు. థర్డ్ పార్టీ ఆప్స్‌ను ఇన్స్టాల్ చేసుకునేందుకు అవకాశం ఉన్న స్మార్ట్ టీవీకి ఫ్రంట్‌సైడ్ ఉండే కెమెరాకు ఎటువంటి డిటెక్టర్ ఉండదనీ, దీన్ని హ్యాకర్లు కంట్రోల్లోకి తీసుకోవచ్చన్నారు. ఇది వ్యక్తుల ప్రైవసీకి ఇబ్బంది కరంగా మారుతుందన్నారు. అయితే స్మార్ట్‌టీవీలను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు మాత్రం ఈ విషయంలో తాము తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని హ్యాకింగ్‌ను నిరోధించడానికి తగిన డిటెక్టర్లు ఏర్పాటు చేస్తున్నామని హామీ ఇస్తున్నారు.