స్మార్ట్ టీవీకి కూడా హ్యాకింగ్ ప్రమాదం!
స్మార్ట్ టీవీకి కూడా హ్యాకింగ్ ప్రమాదం!
Published Wed, Aug 7 2013 11:46 PM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
పీసీ, స్మార్ట్‌ఫోన్‌లే కాదు... సరైన ప్రొటెక్షన్ లేకపోతే స్మార్ట్ టీవీలను హ్యాక్ చేయడం హ్యాకర్లకు చాలా సులువుగా మారిందని అంటున్నారు నిపుణులు. స్మార్ట్ టీవీ విషయంలో ఈ పరిణామం గురించి వారు ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేసి ఆ టీవీని అధీనంలోకి తీసుకోవడమే గాక దాని ముందున్న వారి ఫోటోలను క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉందనడం మరింత ఆందోళనకరమైన విషయంగా మారింది.
ఇటీవలే లాస్‌వెగాస్‌లో జరిగిన ఒక సదస్సులో పరిశోధకులు స్మార్ట్ టీవీ వినియోగదారులకు హ్యాకింగ్ గురించిన హెచ్చరికలు జారీ చేశారు. థర్డ్ పార్టీ ఆప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేందుకు అవకాశం ఉన్న స్మార్ట్ టీవీకి ఫ్రంట్‌సైడ్ ఉండే కెమెరాకు ఎటువంటి డిటెక్టర్ ఉండదనీ, దీన్ని హ్యాకర్‌లు కంట్రోల్‌లోకి తీసుకోవచ్చన్నారు. ఇది వ్యక్తుల ప్రైవసీకి ఇబ్బంది కరంగా మారుతుందన్నారు. అయితే స్మార్ట్‌టీవీలను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు మాత్రం ఈ విషయంలో తాము తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని హ్యాకింగ్‌ను నిరోధించడానికి తగిన డిటెక్టర్‌లు ఏర్పాటు చేస్తున్నామని హామీ ఇస్తున్నారు.
Advertisement