సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి మరో ఎంఐ టీవీని ఇండియాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 7న ఎంఐ టీవీ హారిజన్ ఎడిషన్‌ను లాంచ్ చేస్తున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించింది. కానీ కొత్త ఎంఐ ఆండ్రాయిడ్ ఎంఐ స్మార్ట్ టీవీ ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్ల వివరాలను మాత్రం గోప్యంగా ఉంచింది. అయితే టెలివిజన్ విభాగంలో అత్యధిక ప్రీమియం ధరలో దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా. కొన్ని నెలల విరామం తరువాత, రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో దీన్ని తీసుకు రానుంది.
ఎంఐ టీవీ హారిజన్ ఎడిషన్ టీజర్ ప్రకారం ప్రీమియం స్క్రీన్ కలిగి ఉండవచ్చని సూచించే ‘క్వింటెన్షియల్ డిస్‌ప్లే టెక్’ తోపాటు, ప్యాచ్‌వాల్ లాంచర్, 5వేలకు పైగా యాప్ లకు యాక్సెస్ లభించనుంది. ఎంఐ టీవీ స్విచ్ ఆన్ చేసిన ప్రతిసారీ పూర్తిగా రీబూట్ కావడానికి 45 సెకన్ల సమయం పడుతుందన్న విమర్శల నేపథ్యంలో ‘క్విక్ వేక్’ ఫీచర్ కూడా జోడించినట్టు తెలుస్తోంది.
👀
— Mi India (@XiaomiIndia) August 24, 2020
What have we got in store for you next? 😉
Immersive. Work Of Art. #HorizonEdition coming on 07.09.2020.
Drop your guess in comments.
Know more - https://t.co/czbzkkZzJB pic.twitter.com/12zjDMqg3X
Comments
Please login to add a commentAdd a comment