సాక్షి, ముంబై : షావోమి ఎంఐ టీవీ సిరీస్‌లో రెండు నూతన స్మార్ట్ టీవీలను భారత మార్కెట్‌లో సోమవారం విడుదల చేసింది. ఎంఐ టీవీ 4ఏ హారిజన్ ఎడిషన్ సిరీస్‌లో ఈ టీవీలు లాంచ్ అయ్యాయి.32 అంగుళాల హెచ్‌డీ ,43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ తో రెండు స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆండ్రాయిడ్ ఓఎస్, ఎంఐ క్విక్ వేవ్ ఫీచర్‌ను, ఇన్‌బిల్ట్ క్రోమ్‌క్యాస్ట్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ డేటా సేవర్ ఫీచర్లను జోడించింది. 3 హెచ్‌డిఎమ్‌ఐ పోర్ట్‌లు, 2 యుఎస్‌బి-ఎ పోర్ట్‌లు, ఈథర్నెట్ పోర్ట్ , స్పీకర్లను ఆక్స్ వైర్‌తో కనెక్ట్ చేయడానికి 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. పిక్చర్ క్వాలిటీ కోసం వివిడ్ పిక్చర్ ఇంజిన్ (వీపీఈ) తోపాటు ప్యాచ్ వాల్‌ను ఈ టీవీలలోఅందిస్తోంది. 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ అప్షన్ తో లభ్యం.
ధరలు
ఎంఐ టీవీ 4ఎ హారిజన్ ఎడిషన్ 32 ఇంచుల టీవీ ధర 13,499 రూపాయలు
ఎంఐ టీవీ 4ఎ 43 ఇంచుల టీవీ ధర 22,999 రూపాయలు
ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఎంఐ హోం స్టోర్‌లలో 32అంగుళాల టీవీని ఈ నెల 11వ తేదీ నుంచి, అలాగే 43 ఇంచుల టీవీని ఈ నెల 15వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు
Mi TV #HorizonEdition Series is here.
— Mi India (@XiaomiIndia) September 7, 2020
- Bezel-less Design*
- #PatchWall: 20+ Entertainment Apps
- Immersive Horizon Display
- Vivid Picture Engine
- 20W Stereo 🔊
- Mi QuickWake
- https://t.co/PLwrieRGw0#MiTV4A32 - ₹13,499 | Sale: Sep 11#MiTV4A43 - ₹22,999 | Sale: Sep 15 pic.twitter.com/ekGNBC9KKH
Comments
Please login to add a commentAdd a comment