సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమి ఇండియా తాజాగా కొత్త సిరీస్ స్మార్ట్‌టీవీలను లాంచ్ చేసింది. ఎక్స్ సిరీస్‌లో 43, 50, 55 అంగుళాల సైజుల్లో ఈ ప్రీమియం స్మార్ట్‌టీవీలు లభ్యం. డాల్బీ విజన్, డాల్బీ ఆడియోతో కూడిన ప్రీమియం బెజెల్-లెస్ డిజైన్‌తో 4కే రిజల్యూషన్ లాంటివి స్పెషల్ ఫీచర్లుగా షావోమీ ఎక్స్ స్మార్ట్‌టీవీలను తీసుకొచ్చింది.
43 అంగుళాల స్మార్ట్‌టీవీ ధర రూ. 28,999, 50 అంగుళాల టీవీ ధర రూ. 34,999, 55 అంగుళాల వేరియంట్ ధర రూ. 39,999 నుండి ప్రారంభం. ఎంఐ హోమ్ స్టోర్‌లు, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 14 నుంచి ఫ్లిప్‌కార్ట్ అండ్ ఎంఐ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది ప్యాచ్‌వాల్ తాజా వెర్షన్‌తో రూపొందించిన కొత్త సిరీస్ టీవీల ద్వారానేరుగా యూట్యూబ్ మ్యూజిక్‌ను నిరంతరాయంగా ఎంజాయ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.
అధిక రిజల్యూషన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, 4 కే విప్లవంలో తామే టాప్‌లో ఉన్నామనీ షావోమి ఇండియా సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ సుదీప్ సాహు తెలిపారు. వినియోగదారుల కోసం సరైన అప్‌గ్రేడ్‌గా ఉండే సిరీస్‌ని తీసుకు రావాలని భావిస్తున్నామన్నారు.
భారతీయ వినియోగదారులకోసం హోమ్ స్క్రీన్‌పై IMDb ఇంటిగ్రేషన్, 300+ లైవ్ ఛానెల్‌లు, యూనివర్సల్ సెర్చ్ , కిడ్స్ మోడ్‌తో సహా ప్యాచ్‌వాల్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇంటరాక్టివ్ ప్యాచ్‌వాల్, Android TV 10 ప్లాట్‌ఫారమ్, 2 జీబీ ర్యామ్‌చ, 8 జీబీ స్టోరేజీ, ప్రముఖ 64-బిట్ క్వాడ్ కోర్ A55 చిప్‌తో ఆధారితంగా పనిచేస్తాయి. డ్యూయల్-బ్యాండ్ వైఫై,,బ్లూటూత్ 5.0 కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. 3 HDMI పోర్ట్ (eARC x 1) తో పాటు, ఇది 2 యూఎస్‌బీ పోర్ట్‌లు రాజీపడని కనెక్టివిటీ, సంపూర్ణ వీక్షణ అనుభవం కోసం ఏవీ యర్‌ఫోన్ పోర్ట్‌తో కూడా ఈ టీవీలను తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment