Dolby Atmos sound
-
ఫెస్టివ్ సీజన్: రూ. 29వేలకే 4కే షావోమీ స్మార్ట్ టీవీ
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమి ఇండియా తాజాగా కొత్త సిరీస్ స్మార్ట్‌టీవీలను లాంచ్ చేసింది. ఎక్స్ సిరీస్‌లో 43, 50, 55 అంగుళాల సైజుల్లో ఈ ప్రీమియం స్మార్ట్‌టీవీలు లభ్యం. డాల్బీ విజన్, డాల్బీ ఆడియోతో కూడిన ప్రీమియం బెజెల్-లెస్ డిజైన్‌తో 4కే రిజల్యూషన్ లాంటివి స్పెషల్ ఫీచర్లుగా షావోమీ ఎక్స్ స్మార్ట్‌టీవీలను తీసుకొచ్చింది. 43 అంగుళాల స్మార్ట్‌టీవీ ధర రూ. 28,999, 50 అంగుళాల టీవీ ధర రూ. 34,999, 55 అంగుళాల వేరియంట్ ధర రూ. 39,999 నుండి ప్రారంభం. ఎంఐ హోమ్ స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్ల ద్వారా అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 14 నుంచి ఫ్లిప్‌కార్ట్ అండ్ ఎంఐ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది ప్యాచ్‌వాల్ తాజా వెర్షన్‌తో రూపొందించిన కొత్త సిరీస్ టీవీల ద్వారానేరుగా యూట్యూబ్ మ్యూజిక్‌ను నిరంతరాయంగా ఎంజాయ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. అధిక రిజల్యూషన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, 4 కే విప్లవంలో తామే టాప్‌లో ఉన్నామనీ షావోమి ఇండియా సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ సుదీప్ సాహు తెలిపారు. వినియోగదారుల కోసం సరైన అప్‌గ్రేడ్‌గా ఉండే సిరీస్‌ని తీసుకు రావాలని భావిస్తున్నామన్నారు. భారతీయ వినియోగదారులకోసం హోమ్ స్క్రీన్‌పై IMDb ఇంటిగ్రేషన్, 300+ లైవ్ ఛానెల్‌లు, యూనివర్సల్ సెర్చ్ , కిడ్స్ మోడ్‌తో సహా ప్యాచ్‌వాల్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇంటరాక్టివ్ ప్యాచ్‌వాల్, Android TV 10 ప్లాట్‌ఫారమ్, 2 జీబీ ర్యామ్చ, 8 జీబీ స్టోరేజీ, ప్రముఖ 64-బిట్ క్వాడ్ కోర్ A55 చిప్‌తో ఆధారితంగా పనిచేస్తాయి. డ్యూయల్-బ్యాండ్ వైఫై,,బ్లూటూత్ 5.0 కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. 3 HDMI పోర్ట్ (eARC x 1) తో పాటు, ఇది 2 యూఎస్బీ పోర్ట్‌లు రాజీపడని కనెక్టివిటీ, సంపూర్ణ వీక్షణ అనుభవం కోసం ఏవీ యర్‌ఫోన్ పోర్ట్‌తో కూడా ఈ టీవీలను తీసుకొచ్చింది. -
ఆర్పీ వినూత్న ప్రయోగం `అలిషా`!
సంగీత దర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. తన వైవిధ్యమైన సంగీతంతో ఎన్నో సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక దర్శకుడిగా కూడా రెగ్యులర్ జానర్‌కు భిన్నంగా డిఫరెంట్ ఫార్మాట్‌ను ఎంచుకుని చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు ఆర్పీ తెరకెక్కించిన చిత్రాలే ఇందుకు నిదర్శనం. తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు ఆర్పీ పట్నాయక్. ‘అలిషా’ పేరుతో హర్రర్ థ్రిల్లర్‌గా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. న్యూఇయర్ సందర్భంగా ‘అలిషా’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఐఎస్ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డాక్టర్ సోనాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రచనతో, దర్శకత్వంతో పాటు సంగీత దర్శకత్వం బాధ్యతలు కూడా ఆర్పీనే చూస్తున్నాడు. అనుష్ గోరక్ సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా పనిచేస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య సాల్వి, వేదాంత్ సలూజా, రిచా కల్రా, అక్షయ్ బక్చు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ అంతా విదేశాల్లోనే జరుగుతోంది. ‘స్టార్ హీరోలు నటించిన చాలా సినిమాలు డాల్డీ ఎట్మాస్ సౌండ్‌తో రిలీజ్ అయినా.. ఆ సాంకేతికత కోసం తయారు చేసిన కథలు మాత్రం ఇంతవరకు మన దేశంలో రాలేదు. ఆలోటు భర్తి చేస్తూ షూటింగ్ చేస్తున్నప్పుడే డాల్బీ ఎట్మాస్ సౌండ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆర్పీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఓ పర్ఫెక్ట్ థ్రిల్లర్‌కు అత్యున్నత ప్రమాణాలు కలిగిన సౌండ్ ఎఫెక్ట్స్ తోడైతే అవుట్‌పుట్ ఏ స్థాయిలో ఉంటుందో ఈ సినిమాతో చూపించనున్నారు’అని చిత్ర బృందం ఓ ప్రకటనలో పేర్కొంది. -
డాల్బీ ఎట్మాస్ సౌండ్ తో 'బాహుబలి' ట్రైలర్
ముంబై: రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా హిందీ ట్రైలర్ ను బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ జూన్ 1న విడుదల చేయనున్నారు. కటింగ్ ఎడ్జ్ డాల్బీ ఎట్మాస్ మిక్సింగ్‌తో రూపొందించిన ట్రైలర్ ప్రేక్షకులకు హై క్వాలిటీ సౌండ్ ఎక్స్పీరియన్స్ అందించనుంది. తెలుగులో తొలిసారిగా 'బాహుబలి' కోసం ఈ టెక్నాలజీ వాడారు. ప్రసిద్ధ ఇంజనీర్ పి.ఎం. సతీష్ ఈ సినిమా సౌండ్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్ బాధ్యతలు చూస్తున్నారు. రెండు నిమిషాల 5 సెకన్ల ఈ ఫస్ట్ థియేటరికల్ ట్రైలర్ అత్యద్భుతంగా ఉందని ఇప్పటికే చూసినవారు చెబుతున్నారు. 'బాహుబలి' హిందీ వెర్షన్‌ను కరణ్ జోహార్ సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 31న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగే భారీ వేడుకలో 'బాహుబలి' ఫస్ట్‌పార్ట్ తెలుగు, తమిళ పాటలు విడుదల చేయనున్నారు. జూలై 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.