ఆర్పీ వినూత్న ప్రయోగం `అలిషా`! | RP Patnaik Next Horror Thriller Movie Alisha | Sakshi
Sakshi News home page

భయపెట్టించనున్న ఆర్పీ పట్నాయక్‌

Published Wed, Jan 1 2020 7:51 PM | Last Updated on Wed, Jan 1 2020 7:51 PM

RP Patnaik Next Horror Thriller Movie Alisha - Sakshi

సంగీత దర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్‌ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. తన వైవిధ్యమైన సంగీతంతో ఎన్నో సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక దర్శకుడిగా కూడా రెగ్యులర్‌ జానర్‌కు భిన్నంగా డిఫరెంట్ ఫార్మాట్‌ను ఎంచుకుని చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు ఆర్పీ తెరకెక్కించిన చిత్రాలే ఇందుకు నిదర్శనం. తాజాగా మరో ఇంట్రస్టింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు ఆర్పీ పట్నాయక్‌. ‘అలిషా’ పేరుతో హర్రర్‌ థ్రిల్లర్‌గా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

న్యూఇయర్‌ సందర్భంగా ‘అలిషా’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఐఎస్ఎం ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై డాక్టర్‌ సోనాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రచనతో, దర్శకత్వంతో పాటు సంగీత దర్శకత్వం బాధ్యతలు కూడా ఆర్పీనే చూస్తున్నాడు. అనుష్‌ గోరక్‌ సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా పనిచేస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య సాల్వి, వేదాంత్ సలూజా, రిచా కల్రా, అక్షయ్ బక్చు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ అంతా విదేశాల్లోనే జరుగుతోంది.

‘స్టార్ హీరోలు నటించిన చాలా సినిమాలు డాల్డీ ఎట్మాస్‌ సౌండ్‌తో రిలీజ్‌ అయినా.. ఆ సాంకేతికత కోసం తయారు చేసిన కథలు మాత్రం ఇంతవరకు మన దేశంలో రాలేదు. ఆలోటు భర్తి చేస్తూ షూటింగ్ చేస్తున్నప్పుడే డాల్బీ ఎట్మాస్‌ సౌండ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆర్పీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఓ పర్ఫెక్ట్ థ్రిల్లర్‌కు అత్యున్నత ప్రమాణాలు కలిగిన సౌండ్‌ ఎఫెక్ట్స్‌ తోడైతే అవుట్‌పుట్‌ ఏ స్థాయిలో ఉంటుందో ఈ సినిమాతో చూపించనున్నారు’అని చిత్ర బృందం ఓ ప్రకటనలో పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement