'ఆదిపర్వం' ఇది అమ్మవారి కథ, అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ, ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంజీవ్ కుమార్ మేగోటి దర్శకుడు.
(ఇదీ చదవండి: సమంత గ్లామర్ ట్రీట్.. 'టాప్' లేపేసిందిగా!)
ఐదు భాషల్లో త్వరలో రిలీజ్ కానుంది. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా పాటల్ని అన్విక ఆడియో ద్వారా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్, ఎమ్.ఎమ్. శ్రీలేఖ, రఘు కుంచె తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఆడియో వేడుకలో గీత రచయితలు, గాయనీగాయకులు, సంగీత దర్శకులకు సముచిత స్థానం కల్పించడమనే సత్సంప్రదయాన్ని పునః ప్రారంభించిన దర్శకనిర్మాతలు అభినందనీయులని వారు పేర్కొన్నారు. పాటలు చాలా బాగున్నాయని, ఈ చిత్రం సాధించే విజయంలో ఇవి తప్పకుండా ముఖ్యపాత్ర పోషిస్తాయని చెప్పుకొచ్చారు. ఇకపోతే దాదాపు రెండు వందలమందికి పైగా నటీనటులు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషం.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?)
Comments
Please login to add a commentAdd a comment