Adiparvam Movie
-
మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ మూవీ రివ్యూ
టైటిల్: ఆదిపర్వంనటీనటులు: మంచు లక్ష్మి, ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్ తదితరులురచన, దర్శకత్వం - సంజీవ్ మేగోటినిర్మాణ సంస్థలు: అన్వికా ఆర్ట్స్, ఏఐ(అమెరికా ఇండియా) ఎంటర్ టైన్ మెంట్స్సంగీతం: మాధవి సైబ, ఓపెన్ బనాన ప్రవీణ్, సంజీవ్, బి.సుల్తాన్ వలి, లుబెక్ లీ, రామ్ సుధీ(సుధీంద్ర)సినిమాటోగ్రఫీ - ఎస్ ఎన్ హరీశ్ఎడిటింగ్ - పవన్ శేఖర్ పసుపులేటివిడుదల తేది: నవంబర్ 8, 2024కథేంటంటే..ఈ సినిమా కథ 1974-90 మధ్యకాలంలో జరుగుతుంది.రాయలసీమ కడప దగ్గరలోని ఎర్రగుడిలో గుప్త నిధులు ఉన్నాయని అందరూ నమ్ముతారు. ఆ గుప్త నిధుల కోసం ఎమ్మెల్యే నాగమ్మ(మంచు లక్ష్మి) ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం క్షుద్ర శక్తులను ఆశ్రయిస్తుంది. మరోవైపు ఆ ఊరి పెద్ద రాయప్ప కూడా ఆ గుప్త నిధులను దక్కించుకోవాలనుకుంటాడు. గుప్త నిధుల కోసం వీరిద్దరు చేసిన అరాచకాలు ఏంటి? రాయప్ప తన కూతురుని ఎందుకు చంపాలనుకున్నాడు? నాగమ్మ కూడా ఆమెనే ఎందుకు చంపాలనుకుంది? బుజ్జమ్మ-శ్రీనుల ప్రేమ కథ ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..అమ్మవారి గుడిలో గుప్త నిధులు.. వాటిని సొంతం చేసుకునేందుకు కొంతమంది ప్రయత్నించడం.. దైవ శక్తి-దుష్ట శక్తుల మధ్య పోరాటం..ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘ఆదిపర్వం’సినిమా కూడా ఆ కోవలోకి చెందిన చిత్రమే. అప్పట్లో ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేసి నిధులు దొంగిలించే ఘటనలకు కొంత ఫిక్షన్‌ను మిక్స్ చేసి తెరకెక్కించారు. ఈ పీరియాడిక్ డ్రామా సినిమాలో అమ్మవారి ఆధ్యాత్మికతకు, స్థానిక రాయలసీమ సంస్కృతికి, యాసకు ప్రాధాన్యత ఇచ్చారు.ఒక పీరియాడిక్ కథని ఫాంటసీతో మేళవించి రాయలసీమ నేపథ్యంలో చక్కగా చూపించారు. ఆలయాల పట్ల ఉన్న గౌరవాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని గుర్తుచేస్తూ, ఈ చిత్రం ఆధ్యాత్మికతను, ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. కథలొని ట్విస్ట్ లు బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ బాగా కుదిరింది. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌తో పాటు కథనం కూడా రొటీన్గాన సాగడంతో పాత మూవీ చూసిన ఫీలింగే కలుగుతుంది.ఎవరెలా చేశారంటే..మంచు లక్ష్మి తన నటనతో సినిమా స్థాయిని పెంచారు. కొన్ని సీన్లలో పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అదిత్య ఓం కీలక పాత్రలో కనిపించగా, ఎస్తేర్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లో ఆకట్టుకున్నారు. అలాగే, బెంగాలి నటి శ్రీజిత ఘోష్, సుహాసినీ ("చంటిగాడు" ఫేం) కూడా కథలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారు. ఈవెనింగ్ సినిమాలో హీరో, హీరోయిన్ అనే ప్రత్యేక పాత్రలు లేకుండా, ప్రతి పాత్ర కూడా కథలో భాగంగా ఉంటుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. తక్కువ బడ్జెట్ మూవీయే అయినా గ్రాఫిక్స్ బాగా కుదిరింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘ఆదిపర్వం’ మూవీ ప్రీ రిలీజ్ ఫోటోలు
-
అందుకే మంచు లక్ష్మిని తీసుకున్నా: ‘ఆదిపర్వం’ డైరెక్టర్
1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల నేపథ్యంలో ‘ఆదిపర్వం’ చిత్రాన్ని తెరకెక్కించాం. అప్పట్లో నిధి నిక్షేపాల కోసం గుడులలో విగ్రహాలు ధ్వంసం చేసేవారు. ఆ ఘటనలకు ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రంలో చూపిస్తున్నా. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో ‘ఆదిపర్వం’ ఉంటుంది’అని అన్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. ఈ సినిమాలో మంచు లక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో కీలక పాత్రను ఆదిత్య ఓం పోషిస్తున్నారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు సంజీవ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. చిన్నప్పుడు పద్య నాటకాలు చూసేవాడిని. ఇంట్లో ఉన్న పెడల్ హార్మోనియం వాయించేవాడిని. అలా మ్యూజిక్ పట్ల చిన్నప్పుడే అవగాహన ఏర్పడింది. రచన, సంగీత జ్ఞానం చిత్ర పరిశ్రమలో నా కెరీర్ కు ఉపయోగపడ్డాయి.⇢ 1994 లో మధు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో స్టూడెంట్స్ చేరడం ద్వారా చిత్ర పరిశ్రమలో నా జర్నీ మొదలైంది. 1995లో ప్రొడ్యూసర్ గా ఒక సినిమా చేశాను. నాకు అప్పుడు 21 ఏళ్లు. 97లో సింధూరం సినిమా చూసి రవితేజను కలిసి నువ్వు పెద్ద హీరో అవుతావు అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి కథ చెప్పాను. ఆ మూవీ పలు కారణాలతో పట్టాలెక్కలేదు. 14 సినిమాలకు మ్యూజిక్ చేశాను, తమిళ, తెలుగు, కన్నడ కలిపి 10 సినిమాలకు డైరెక్షన్ చేశాను. 42 సీరియల్స్ కు స్క్రిప్ట్ రాశాను. కొన్ని సినిమాలకు మ్యూజిక్ చేశాను. సీరియల్స్, సినిమాల్లో నటించాను. ఇలా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, లిరిసిస్ట్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా నా జర్నీ కొనసాగుతోంది.⇢ "ఆదిపర్వం" సినిమా నా రీఎంట్రీ మూవీ అనుకోవచ్చు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో ఈ నెల 8వ తేదీన రిలీజ్ చేస్తున్నాం. రాయలసీమ కడప దగ్గరలోని ఎర్రగుడి నేపథ్యంగా అమ్మవారి సినిమాగా "ఆదిపర్వం" రూపొందించాను. గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూసి గ్రాఫిక్స్ తో చేసినవి అని గుర్తుపట్టరు. మాకున్న బడ్జెట్ లో క్వాలిటీ గ్రాఫిక్స్ చేయించాం. 11 నెలలు సీజీ కోసమే వర్క్ చేశాం. మొత్తం మూవీ చేయడానికి ఏడాదిన్నర టైమ్ పట్టింది.⇢ ఆదిపర్వం సినిమాలో మంచు లక్ష్మి కీ రోల్ చేస్తున్నారు. ఆమె నెగిటివ్ గా, పాజిటివ్ గా రెండు షేడ్స్ లో మెప్పించగలరు. యాక్షన్ చేయగలరు. అందుకే ఈ సినిమాలో ఆమెను తీసుకున్నాం. మంచు లక్ష్మి షూటింగ్ టైమ్ లో మాకు ఎంతో కోపరేట్ చేశారు. ఆదిత్య ఓం మరో ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ఎస్తేర్ ఒక మంచి పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో నటించారు. అలాగే మలయాళ నటి శ్రీజిత ఘోష్, చంటిగాడు ఫేం సుహాసినీ కథలో ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేశారు. ఈ మూవీలో హీరో హీరోయిన్స్ అంటూ ప్రత్యేకంగా ఉండరు. అందరూ కథలో భాగంగా ఉంటారు.⇢ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా "ఆదిపర్వం" థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మంచు లక్ష్మి గారితో సహా ప్రతి పాత్రను కొత్తగా స్క్రీన్ మీద చూస్తారు. కన్నడలో మంచి రిలీజ్ దొరికింది. అక్కడ మేము పబ్లిసిటీ చేయలేదు అయితే దర్శకుడిగా నాకు కన్నడలో మంచి పేరుంది. అక్కడ సక్సెస్ పుల్ సినిమాలు తీశాను. దాంతో "ఆదిపర్వం" సినిమా కన్నడలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.⇢ ప్రస్తుతం సర్పయాగం అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. మరో వెబ్ సిరీస్ కు సంప్రదింపులు జరుగుతున్నాయి. -
మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ వచ్చేస్తోంది
మంచు లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. ఎస్తేర్, శివ కంఠమనేని కీలక పాత్రలు పోషించారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథతో గ్రాఫిక్స్ ప్రధానంగా "ఆదిపర్వం" చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. "ఆదిపర్వం" సినిమా ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 500కు పైగా థియేటర్స్ లో "ఆదిపర్వం" సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది.1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల సమాహారంగా "ఆదిపర్వం" సినిమాను రూపొందించారు దర్శకుడు సంజీవ్ మేగోటి. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో దుష్టశక్తికి, దైవశక్తికి మధ్య జరిగే యుద్ధాన్ని ఆసక్తికరంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, టెక్నికల్ హంగులతో ఈ సినిమాలో చూపించబోతున్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా "ఆదిపర్వం" థియేటర్స్ లోకి వస్తుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు. -
షూటింగ్ లో మంచు లక్ష్మి ఎంత కష్టపడ్డారంటే ?
-
నువ్వు చేస్తే సంసారం.. నేను చేస్తే.. అనే వాళ్ళు నాకు...
-
లైవ్ లో మంచు లక్ష్మి వాళ్ళ అత్త కి ఫోన్ చేసి ఏం మాట్లాడిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు
-
నాకు ప్రాబ్లెమ్ వస్తే ఫస్ట్ రానా కి ఫోన్ చేస్తా
-
నా ఫేవరెట్ హీరో, హీరోయిన్ ఎవరంటే..
-
అది మన నేల గొప్పదనం: మంచు లక్ష్మి
‘‘ఆదిపర్వం’ వంటి సోషియో ఫ్యాంటసీ కథల్ని ప్రేక్షకులకు చూపిస్తున్నామంటే అది మన నేల గొప్పదనం. ఈ శక్తివంతమైన గడ్డ మీద ఉన్నాం కాబట్టే ఇలాంటి నేపథ్యాలతో సినిమాలు చేయగలుగుతున్నాం’’ అని నటి మంచు లక్ష్మి అన్నారు. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో మంచు లక్ష్మి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. శివ కంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తేర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాశ్, సుహాసిని ఇతర పాత్రల్లో నటించారు.రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఏఐ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో త్వరలో విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం పాట ఆవిష్కరణ కార్యక్రమంలో మంచు లక్ష్మి మాట్లాడుతూ– ‘‘ఇటీవల ‘యక్షిణి’ వెబ్ సిరీస్ చేశాను... చాలా మంచి స్పందన వచ్చింది.ఇప్పుడు ‘ఆదిపర్వం’ చేశాను. దేవత అయినా దెయ్యం పాత్ర అయినా నన్నే సంప్రదిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఆదిపర్వం’లో నాగులాపురం నాగమ్మ పాత్ర చేశారు లక్ష్మి. ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అవుతాయి’’ అన్నారు సంజీవ్ మేగోటి. ‘‘ఈ చిత్రంలో నేను క్షేత్రపాలకుడి పాత్ర చేశాను’’ అన్నారు శివ కంఠంనేని. -
డూప్ అంటేనే ఒళ్లు మండుతుంది: మంచు లక్ష్మి
డూప్ అంటేనే ఒళ్లు మండుతుంది అంటోంది మంచు లక్ష్మి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది చిత్రబృందం. మంచు లక్ష్మి వరుస ఇంటర్వ్యూలతో బీజీ అయిపోయింది. (చదవండి: తెలుగు వెర్షన్ ఇన్నాళ్లకు తీసుకొచ్చారు.. ఏ ఓటీటీలో ఉంది?)తాజాగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సినిమాల్లో పెట్టే డూప్‌పై తన అభిప్రాయం వెల్లడించింది. ‘నా వరకు అయితే ఒక ఆర్టిస్ట్ అనేవాడు డైరెక్టర్ ఏం చెబితే అది చేయాల్సిందే. కానీ కొంతమంది సింపుల్ జంప్‌కి కూడా డూప్‌ని పెట్టుకోమని చెబుతారు. అసలు డూప్ అంటేనే నాకు ఒళ్లు మండుతుంది. ప్రతి చిన్న విషయానికి డూప్ ని పెట్టుకోమని చెప్పడం కరెక్ట్ కాదు. (చదవండి: ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. మళ్లీ ఏమైంది?)ఏదైనా క్రిటికల్ సీన్ అనిపిస్తే డూప్ పెట్టుకున్నా పర్లేదు కానీ.. వీలైనంత వరకు మనం నటిస్తేనే సీన్ బాగొస్తుంది. అంతేకాదు డూప్‌ని సెట్ చేయడం కూడా చాలా కష్టమైన పని. నా వల్ల చేయగలిగే ప్రతిది నేనే చేయాలనుకుంటాను. ఈ సినిమాలో ఓ సీన్లో 50 ఫీట్ల హైట్ నుంచి జంప్ చేశాను. దానికి డూప్‌ని పెట్టుకోమని చెప్పారు కానీ.. నేను వద్దని చెప్పాను. అలాంటి సీన్స్ షూట్ చేసినప్పుడు పెద్దగా ఏమి అనిపించదు .కానీ ఇలాంటి ఇంటర్య్వూల్లో చెబితేనే ‘ఇంత చేశానా’ అనిపిస్తుంది(నవ్వుతూ..)’ అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. -
‘ఆదిపర్వం’ పై సెన్సార్ సభ్యులు ప్రశంసలు
ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ - ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మిస్తున్నాయి. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ (U/A) సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. ఇటీవల ఐదు భాషల్లో విడుదలైన ట్రైలర్ కు అసాధారణ స్పందన లభిస్తోంది. ఈ చిత్రం పాటలు "అన్విక ఆడియో" ద్వారా విడుదలయ్యాయి. దాదాపు రెండు వందలమందికి పైగా నటీనటులు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమవుతుండడం చెప్పుకోదగ్గ విశేషం.దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ..."బహు భాషల్లో రూపొందిన "ఆదిపర్వం" అద్భుతంగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ట్రైలర్ కి వస్తున్న అసాధారణ స్పందనకు తోడు సెన్సార్ సభ్యుల ప్రశంసలు ఈ చిత్రంపై మా నమ్మకాన్ని రెట్టింపు చేశాయి. త్వరలో విడుదల తేది ప్రకటిస్తాం" అన్నారు! -
మంచు లక్ష్మి 'ఆదిపర్వం' పాటలపై సంగీత దర్శకుల ప్రశంసలు
'ఆదిపర్వం' ఇది అమ్మవారి కథ, అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ, ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంజీవ్ కుమార్ మేగోటి దర్శకుడు. (ఇదీ చదవండి: సమంత గ్లామర్ ట్రీట్.. 'టాప్' లేపేసిందిగా!) ఐదు భాషల్లో త్వరలో రిలీజ్ కానుంది. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా పాటల్ని అన్విక ఆడియో ద్వారా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్, ఎమ్.ఎమ్. శ్రీలేఖ, రఘు కుంచె తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆడియో వేడుకలో గీత రచయితలు, గాయనీగాయకులు, సంగీత దర్శకులకు సముచిత స్థానం కల్పించడమనే సత్సంప్రదయాన్ని పునః ప్రారంభించిన దర్శకనిర్మాతలు అభినందనీయులని వారు పేర్కొన్నారు. పాటలు చాలా బాగున్నాయని, ఈ చిత్రం సాధించే విజయంలో ఇవి తప్పకుండా ముఖ్యపాత్ర పోషిస్తాయని చెప్పుకొచ్చారు. ఇకపోతే దాదాపు రెండు వందలమందికి పైగా నటీనటులు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?) -
ఐదు భాషల్లో మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’
మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన సోషియో ఫాంటసీ ఫిలీం 'ఆదిపర్వం'. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో... రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్-ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కి... ఇటీవల ఐదు భాషల్లోనూ విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ... ‘ఆదిపర్వం’ ప్రచార చిత్రానికి లభిస్తున్న అనూహ్య స్పందన... ఈ చిత్రం కోసం మేము పడిన కఠోర శ్రమ మర్చిపోయేలా చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. త్వరలో సెన్సార్ కు వెళ్లనున్నాం. బహు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఇంత బాగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి గారికి స్పెషల్ థాంక్స్" అన్నారు. ఈ చిత్రంలో మంచులక్ష్మీతో పాటు శివకంఠంనేని , ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెట గాంధీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
మంచు లక్ష్మి కాళ్ల మీద పడి ఏడ్చేసిన అభిమాని.. వీడియో వైరల్
మంచు లక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ.. లుత పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది. 'అనగఅనగా ఓ ధీరుడు' చిత్రంతో నటిగా మారింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈమె.. ఇప్పుడు కాస్త నెమ్మదించింది. 'ఆదిపర్వం' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేసింది. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ చిత్రం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది. సోమవారం ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే తిరుపతికి చెందిన ఓ అభిమాని.. నేరుగా స్టేజీపైకి వచ్చే మంచు లక్ష్మి కాళ్లపై పడిపోయాడు. కలిసినందుకో ఏమో గానీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే ఈ ఈవెంట్ పూర్తయిపోయిన తర్వాత సదరు అభిమానితో మంచు లక్ష్మి ఫొటో దిగి, అతడిని ఓదార్చింది. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు మంచు లక్ష్మిని గజమాలతో సత్కరించారు. (ఇదీ చదవండి: రెమ్యునరేషన్ డబుల్ చేసిన సమంత.. వామ్మో అన్ని కోట్లా?) View this post on Instagram A post shared by NBUR (@naku_bhutulu_urike_ravuu) -
Adiparvam Movie: నాగలాపురం నాగమ్మ’గా మంచులక్ష్మి
మంచు లక్ష్మి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఏ వన్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా సాగుతుంది. ఈ చిత్రం ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ ఘంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ– ‘‘దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలతోపాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘నాగలాపురం నాగమ్మగా మంచు లక్ష్మి నట విశ్వరూపం చూపించే సినిమా ఇది. ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్ ఉంటాయి’’ అన్నారు సంజీవ్ మేగోటి. ‘గ్రాఫిక్స్, మంచు లక్ష్మి ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్’’ అన్నారు చిత్ర సమర్పకులు రావుల వేంకటేశ్వర రావు. ‘‘పోస్ట్ ప్రోడక్షన్ దశలోనే ఈ సినిమాని చూసి హ్యాపీ ఫీల్ అయ్యాం’’ అన్నారు సహనిర్మాతల్లో ఒకరైన గోరెంట శ్రావణి. -
Adiparvam: మంచు లక్ష్మి లుక్ అదిరిందిగా!
మంచు లక్ష్మీప్రసన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రావుల వెంకటేశ్వర్రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ - అమెరికా ఇండియా (ఎ.ఐ) ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. 1974-1990 మధ్యకాలంలో జరిగిన యధార్థ సంఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. నేడు(అక్టోబర్ 8) మంచు లక్ష్మీ బర్త్‌డే. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శకనిర్మాతలు. చిత్ర దర్శకుడు సంజీవ్ మెగోటి మాట్లాడుతూ... ‘మంచు లక్ష్మీప్రసన్న ఇదివరకు చెయ్యని పాత్రలో కొత్తగా కనిపిస్తారు. తను చేసిన రెండు ఫైట్స్ సినిమాకి హైలెట్స్ గా నిలుస్తాయి’ అన్నారు. ‘రెట్రో ఫీల్ తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మొదలై కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆద్యంతం అలరించే చిత్రమిది’అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాసరావ్ అన్నారు. ఈ చిత్రంలో ఆదిత్యఓం, ఎస్తేర్, సుహాసిని ,శ్రీజిత ఘోష్, శివ కంఠంనేని, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.