డూప్ అంటేనే ఒళ్లు మండుతుంది అంటోంది మంచు లక్ష్మి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది చిత్రబృందం. మంచు లక్ష్మి వరుస ఇంటర్వ్యూలతో బీజీ అయిపోయింది.
(చదవండి: తెలుగు వెర్షన్ ఇన్నాళ్లకు తీసుకొచ్చారు.. ఏ ఓటీటీలో ఉంది?)
తాజాగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సినిమాల్లో పెట్టే డూప్‌పై తన అభిప్రాయం వెల్లడించింది. ‘నా వరకు అయితే ఒక ఆర్టిస్ట్ అనేవాడు డైరెక్టర్ ఏం చెబితే అది చేయాల్సిందే. కానీ కొంతమంది సింపుల్ జంప్‌కి కూడా డూప్‌ని పెట్టుకోమని చెబుతారు. అసలు డూప్ అంటేనే నాకు ఒళ్లు మండుతుంది. ప్రతి చిన్న విషయానికి డూప్ ని పెట్టుకోమని చెప్పడం కరెక్ట్ కాదు.
(చదవండి: ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. మళ్లీ ఏమైంది?)
ఏదైనా క్రిటికల్ సీన్ అనిపిస్తే డూప్ పెట్టుకున్నా పర్లేదు కానీ.. వీలైనంత వరకు మనం నటిస్తేనే సీన్ బాగొస్తుంది. అంతేకాదు డూప్‌ని సెట్ చేయడం కూడా చాలా కష్టమైన పని. నా వల్ల చేయగలిగే ప్రతిది నేనే చేయాలనుకుంటాను. ఈ సినిమాలో ఓ సీన్‌లో 50 ఫీట్ల హైట్ నుంచి జంప్ చేశాను. దానికి డూప్‌ని పెట్టుకోమని చెప్పారు కానీ.. నేను వద్దని చెప్పాను. అలాంటి సీన్స్ షూట్ చేసినప్పుడు పెద్దగా ఏమి అనిపించదు .కానీ ఇలాంటి ఇంటర్య్వూల్లో చెబితేనే ‘ఇంత చేశానా’ అనిపిస్తుంది(నవ్వుతూ..)’ అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment