dupe
-
డూప్ అంటేనే ఒళ్లు మండుతుంది: మంచు లక్ష్మి
డూప్ అంటేనే ఒళ్లు మండుతుంది అంటోంది మంచు లక్ష్మి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది చిత్రబృందం. మంచు లక్ష్మి వరుస ఇంటర్వ్యూలతో బీజీ అయిపోయింది. (చదవండి: తెలుగు వెర్షన్ ఇన్నాళ్లకు తీసుకొచ్చారు.. ఏ ఓటీటీలో ఉంది?)తాజాగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సినిమాల్లో పెట్టే డూప్‌పై తన అభిప్రాయం వెల్లడించింది. ‘నా వరకు అయితే ఒక ఆర్టిస్ట్ అనేవాడు డైరెక్టర్ ఏం చెబితే అది చేయాల్సిందే. కానీ కొంతమంది సింపుల్ జంప్‌కి కూడా డూప్‌ని పెట్టుకోమని చెబుతారు. అసలు డూప్ అంటేనే నాకు ఒళ్లు మండుతుంది. ప్రతి చిన్న విషయానికి డూప్ ని పెట్టుకోమని చెప్పడం కరెక్ట్ కాదు. (చదవండి: ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. మళ్లీ ఏమైంది?)ఏదైనా క్రిటికల్ సీన్ అనిపిస్తే డూప్ పెట్టుకున్నా పర్లేదు కానీ.. వీలైనంత వరకు మనం నటిస్తేనే సీన్ బాగొస్తుంది. అంతేకాదు డూప్‌ని సెట్ చేయడం కూడా చాలా కష్టమైన పని. నా వల్ల చేయగలిగే ప్రతిది నేనే చేయాలనుకుంటాను. ఈ సినిమాలో ఓ సీన్లో 50 ఫీట్ల హైట్ నుంచి జంప్ చేశాను. దానికి డూప్‌ని పెట్టుకోమని చెప్పారు కానీ.. నేను వద్దని చెప్పాను. అలాంటి సీన్స్ షూట్ చేసినప్పుడు పెద్దగా ఏమి అనిపించదు .కానీ ఇలాంటి ఇంటర్య్వూల్లో చెబితేనే ‘ఇంత చేశానా’ అనిపిస్తుంది(నవ్వుతూ..)’ అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. -
ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?
పాన్ ఇండియా హీరో అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే పేరు ప్రభాస్. 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా గురించి ప్రపంచానికి తెలిసేలా రాజమౌళి చేస్తే.. హీరోగా చేసిన ప్రభాస్ అంతకు మించిన పాపులారిటీ సంపాదించాడు. మొన్నీమధ్యే 'సలార్'తో సక్సెస్ అందుకున్న డార్లింగ్.. త్వరలో 'కల్కి' మూవీతో రాబోతున్నాడు. ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా మాట్లాడుకుంటున్న టైంలో ప్రభాస్ డూప్‌కి ఇచ్చే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరికీ బాడీ డబుల్ లేదా డూప్ ఉంటారు. అంటే ఫైట్ సీన్స్‌లో కొన్నిచోట్ల హీరోల కనిపిస్తే.. వెనక నుంచి, సైడ్ నుంచి కనిపించే కొన్ని షాట్స్‌లో హీరోల పోలిన వ్యక్తులని పెట్టి మేనేజ్ చేస్తారు. అలా ప్రభాస్‌కి కిరణ్ రాజ్ అనే వ్యక్తి డూప్‌గా చేస్తుంటాడు. 'బాహుబలి' సినిమా తర్వాత కిరణ్ రాజ్ కాస్తంత పాపులరాటీ తెచ్చుకున్నాడు. కొన్ని ఇంటర్వ్యూల్లోనూ కనిపించాడు. (ఇదీ చదవండి: Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ) అయితే మిగతా హీరోల డూప్స్‌కి సదరు సినిమాల నిర్మాతలే రెమ్యునరేషన్ ఇస్తుంటారు. కానీ ప్రభాస్ మాత్రం తన సిబ్బందితో సహా ప్రతి ఒక్కరికి తానే జీతాలు చెల్లిస్తాడు. రీసెంట్‌గానే ఈ విషయం బయటకొచ్చింది. అలానే డూప్‌గా నటించే కిరణ్ రాజ్‌కి ఒక్కో చిత్రానికి గానూ దాదాపు రూ.30 లక్షలు పైనే ప్రభాస్ చెల్లిస్తాడట. కొన్నిసార్లు దీనకంటే ఎక్కువే ఇవ్వొచ్చని కూడా అంటున్నారు. అయితే డూప్‌కి రూ.30 లక్షలు ఇస్తున్నారనే రూమర్ అనేది ఒకవేళ నిజమైతే మాత్రం షాకింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది చోటామోటా హీరోలకు కూడా ఇంత రెమ్యునరేషన్ ఇవ్వకపోవచ్చు. అలా ఇప్పుడు ప్రభాస్ డూప్‌కి ఇస్తున్న రెమ్యునరేషన్ ఇదేనంటూ వైరల్ అవుతున్న ఓ విషయం.. ఇప్పుడు నెటిజన్స్ షాకయ్యేలా చేస్తోంది. (ఇదీ చదవండి: Anupama Remuneration: టిల్లు కోసం రెమ్యునరేషన్ పెంచేసిన అనుపమ..) -
30 ఏళ్లుగా చిరంజీవికి డూప్‌గా నటించిన ఈ వ్యక్తి గురించి తెలుసా?
టాలీవుడ్‌తో పాటు అన్ని చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోలకు డూపులను వాడే సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. స్టార్ హీరోకి సంబంధించిన రిస్కీ ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ ఈ డూపులతోనే చేయిస్తారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో అచ్చం రియల్ హీరో చేసినట్లే ఆ సన్నివేశాలను చూపిస్తారు దర్శకుడు. అయితే ఈ డూపుల గురించి ఒకప్పుడు ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని డూప్‌గా నటించిన వారికి కూడా గుర్తింపు లభిస్తోంది. తనదైన డ్యాన్స్, ఫైట్లలో తెలుగు చిత్ర సీమలో రారాజుగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని చిత్రాల్లో డూప్‌ని వాడారు. తనలాగే ఉన్న ఓ వ్యక్తిని పలు చిత్రాల్లో నటించజేసి విజయాలు అందుకున్నారు. ఆ డూప్ పేరు ప్రేమ్ కుమార్. అతనిది పశ్చిమ గోదావారి జిల్లా పాలకొల్లు. రికార్డింగ్ డ్యాన్సర్‌గా ఉన్న ఆయన గత 30 ఏళ్లుగా చిరంజీకి సినిమాలకు డూప్‌గా నటిస్తున్నారు. ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డ్యాన్స్ పేరిట ఆయనకు ఒక కంపెనీ ఉంది. అక్కినేని అభిమాని కానీ.. ప్రేమ్ కుమార్ నాన్న స్టేజ్ షోలు నిర్వహించేవాడు. ప్రేమ్ కుమార్ సినీ ప్రస్థానం కూడా స్టేజ్ షో నుంచే ప్రారంభమైంది. తొలుత అక్కినేని నాగేశ్వరరావు పాటలకు డ్యాన్స్ చేసేవాడు. అంతేకాదు అక్కినేనికి ప్రేమ్ కుమార్ పెద్ద అభిమాని. అయితే స్నేహితుల ప్రొత్సాహంతో అతను చిరంజీవి పాటకు డ్యాన్స్ చేసి..మెగాస్టార్ అభిమానిగా మారారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రేమ్ కుమారే చెప్పారు. ‘నా పదోతరగతి 1985లో పూర్తయింది. ఆరేళ్ల వయసు నుంచే నేను స్టేజ్ షోలో పాల్గొన్నారు. ప్రతిసారి అక్కినేని హిట్ పాటలకు స్టెప్పులేసి అలరించేవాడిని. కాలేజీ సమయంలో స్నేహితులు చిరంజీవి పాటలకు ట్రై చేయమని చెప్పారు. మొదటగా చిరు ‘ఇందువదనా..’పాటకు డ్యాన్స్ చేశా. అది బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత వరుసగా చిరంజీవి పాటలకు డ్యాన్స్ చేస్తూ వచ్చాను. ఇక 1990లో డిగ్రీ పాసయ్యాక.. సినిమాల్లో ఓ ఆఫర్ వచ్చింది. అది చిరంజీవి ఛాలెంజ్ సినిమా. ఎగిరి గంతేసి నటించేశాను. ఆ తర్వాత రాక్షసుడు, మరణ మృదంగం సినిమాల్లో చిరు డూప్‌గా నటించిన తర్వాత బ్రేక్ వచ్చింది. కొన్నాళ్ల వరకు సినిమా అవకాశాలు రాలేదు. స్టేజ్ షోలు చేస్తూనే జీవనం సాగించాను. టీచర్ ఉద్యోగం రిజెక్ట్ చేస్తే.. స్టేజ్ షోలు చేస్తున్న సమయంలోనే నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది. అప్పటికే నా సంపాదన వేలల్లో ఉండేది. దీంతో ఆ ఉద్యోగం వదిలేద్దామనుకున్నాను. కానీ మా నాన్నగారు వద్దన్నారు. ‘ఇప్పుడు ఏజ్ ఉన్నావు. డ్యాన్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నావు. కొన్నాళ్లకు ముసలోడివి అవుతావు. అప్పుడు ఎలా బతకుతావు? ఉద్యోగం నీ జీవితానికి భద్రత అని చెప్పడంతో టీచర్ జాబ్‌లో చేరాను. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఖాలీ సమయంలో స్టేజ్ షోలో నిర్వహించేవాడిని. ఈ మధ్య పెళ్లి కాని ప్రసాద్లో చిరంజీవిలా నటించాను. అలాగే సైరా చిత్రంలోనూ చిరు డూప్‌గా నటించాను. చిరు నా దేవుడు నేను ఎప్పుడూ చిరంజీవిని ఫాలో కాలేదు. కానీ ఆ దేవుడే నన్ను చిరంజీవి వైపు పంపించాడు. ఆయన పాటలకు డ్యాన్స్ చేస్తూ.. ఆయనలా నటించడం వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది. ఆయన డబ్బులే నేను తింటున్నాను. నాకు కనబడే ఒకే ఒక దేవుడు చిరంజీవి. చనిపోయేలోపు ఆయనను ఒక్కసారి కలవాలనుకుంటున్నాను. చిరంజీవిని చూసి చనిపోవాలనేదే నా కోరిక’అని ప్రేమ్ కుమార్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. (చదవండి: రీఎంట్రీలో చిరంజీవి ఆ తప్పులు చేస్తున్నారా?) -
మోదీలా అసెంబ్లీకి వచ్చాడు..ఇది ఎలా సాధ్యం ?
-
డిస్కౌంట్లో వాహనాలిప్పిస్తామని నమ్మించి రూ.10 కోట్లకు టోకరా!
VSVP Projects కామారెడ్డి క్రైం: తక్కువ ధరకే వాహనాలు ఇప్పిస్తామన్నారు.. భారీ డిస్కౌంట్ పేరిట ఎర వేశారు.. అమాయకుల ఆశను ఆసరాగా చేసుకుని జేబులు గుల్ల చేశారు. వందల మంది కస్టమర్లకు డిపాజిట్ల పేరిట కట్టించుకుని రూ. కోట్లల్లో టోకరా వేసి ఉడా యించిన వీఎస్‌వీపీ ప్రాజెక్ట్స్ కంపెనీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. డిపాజిట్‌గా కంపెనీలో జమ చేసిన డబ్బులు పోవడమే కాకుండా తీసుకున్న వాహనాలకు ప్రతినెలా చెల్లించాల్సిన ఫైనాన్స్ వాయిదాలు కస్టమర్ల నెత్తినపడ్డాయి. వాటిని చెల్లించలేక ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఆరు నెలల క్రితమే సదరు కంపెనీ దాదాపు రూ.10 కోట్లకు పైగా కస్టమర్లకు టోకరా వేసి బిచానా ఎత్తేసింది. అప్పటి నుంచి బాధితులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్ధితిలో పడ్డారు. తీసుకున్న వాహనాలకు ప్రతినెలా వాయిదాలు చెల్లించాలని ఫైనాన్స్ కంపెనీల ఒత్తిళ్లు పెరిగాయని వాపోతున్నారు. అసలేం జరిగిందంటే.. ఏడాదిన్నర క్రితం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో కొందరు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వీఎస్‌వీపీ ప్రాజెక్ట్స్ పేరిట కంపెనీ బ్రాంచ్‌ను ప్రారంభించారు. కస్టమర్లను రాబట్టేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఏజెంట్లను నియమించుకున్నారు. 25శాతం డిస్కౌంట్ మీద వాహనాలను ఇప్పిస్తామని నమ్మించారు. కస్టమర్ల వాటాను ముందుగా ఒకేసారి చెల్లించాలి. వాటిలో నుంచి కొంత మొత్తాన్ని షోరూంలో డౌన్ పేమెంట్ కింద చెల్లిస్తాం.. మిగతా మొత్తానికి ఫైనాన్స్ చేయిస్తామన్నారు. వీఎస్‌వీపీ కంపెనీ వద్ద మిగిలి ఉన్న కస్టమర్ డబ్బుకు ప్రతినెలా వడ్డీ కింద ఫైనాన్స్ వాయిదాలను మేమే చెల్లిస్తామని చెప్పారు. ఇక్కడే అసలు కిటుకు దాగి ఉంటుంది. ఫైనాన్స్ కస్లమర్ పేరుమీదే చేయించారు. ప్రతినెలా వీఎస్‌వీపీ కంపెనీ నుంచి కస్టమర్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఆ తర్వాత ఫైనాన్స్ వాయిదాలకు కట్ అవుతాయని నమ్మించారు. ఫైనాన్స్ వాయిదాలకు ప్రతినెలా వీఎస్‌వీపీ నుంచి డబ్బులు మన అకౌంట్లోకి వస్తాయని కస్టమర్లు భావించారు. ముందుగా చెల్లించే తక్కువ ధరకే కొత్త వాహనం వస్తుంది కదా అని చాలామంది సభ్యులుగా చేరారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, జేసీబీలు, ఇలా అన్ని వాహనాలను డిస్కౌంట్ కింద ఇప్పిస్తామని నమ్మించి వందల సంఖ్యలో సభ్యులను చేర్చుకున్నారు. ప్రతి ఒక్కరి నుంచి వారు ఎంచుకున్న వాహనం ఖరీదులో నుంచి 75 శాతం మొత్తాన్ని ముందుగానే కట్టించుకుని వాహనాలు ఇప్పించారు. అందులో నుంచి కేవలం 10శాతం మాత్రమే డౌన్ పేమెంట్ కింద షోరూంలకు చెల్లించి మిగితావి ఫైనాన్స్ చేయించినట్లు తెలుస్తుంది. మొదటి మూడు నుంచి నాలుగు నెలలు అంతా బాగానే నడిచింది. ఆ తర్వాత కస్టమర్ల డిపాజిట్ డబ్బులను మాయం చేసి బోర్డు తిప్పేశారు. ఫైనాన్స్ కంపెనీల వేధింపులు వీఎస్‌వీపీ బోర్డు తిప్పేయడంతో కస్టమర్లు నిండా మునిగారు. ఇప్పుడిక తమ వాహనాలకు సంబంధించిన నెలవారీ ఫైనాన్స్ వాయిదాలు తామే చెల్లించుకోవాల్సిన పరిస్థితి కస్టమర్లకు ఎదురైంది. వాయిదాల డబ్బులు కట్టాలని ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారు, లేదంటే వాహనాలను లాక్కెళ్తున్నారని వాపోతున్నారు. ఫైనాన్స్ కంపెనీల వేధింపులు పెరగడంతో ఇప్పుడిప్పుడే మోసపోయామంటూ బాధితులు బయటకు వస్తున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎవరైనా బాధితులు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. రూ. కోట్లలో టోకరా.. స్కీంలను, లాటరీలను, భారీ డిస్కౌంట్లను, మోసపూరిత కంపెనీలను నమ్మవద్దని ఎంత మొత్తుకున్నా కొందరు అత్యాశకు పోయి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వీఎస్‌వీపీ మోసాలు కూడా ఇదే కోవలోకి వస్తాయి. కంపెనీలో సభ్యులుగా చేరి, ద్విచక్ర వాహనాలు తీసుకుని మోసపోయిన వారు ఒక్క దేవునిపల్లి పరిధిలోనే దాదాపు 60 నుంచి 70 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. మొత్తం మీద వందల సంఖ్యలో బాధితులు ఉన్నారు. దాదాపు రూ. 10 కోట్లకు పైగా దండుకుని కంపెనీ నిర్వాహకులు ఉడాయించినట్లు తెలుస్తోంది. కంపెనీలో ఏజెంట్లుగా పనిచేసిన వారికి కష్టాలు తప్పడం లేదు. కొందరు ఏజెంట్లు, బాధితులు 5 నెలల క్రితం పట్టణ పోలీస్ స్టేషణ్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. దేవీవిహార్‌లో నివాసం ఉండే కంపెనీ నిర్వాహకుడు హైదరాబాద్‌కు పరారీ కాగా పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఆ వెంటనే బెయిల్ తెచ్చుకుని కేసు పెట్టిన వారికి డబ్బులు మాట్లాడుకుని సెటిల్మెంట్ చేసుకుట్లు తెలిసింది. రూ. 56 వేలు చెల్లించా రూ. 56 వేలకే ఫ్యాషన్‌ప్రో బైక్ ఇస్తామన్నారు. దాంట్లో నుంచి రూ. 10 వేలు డౌన్‌పేమెంట్ కట్టి రూ. 71 వేలు నా పేరు మీద ఫైనాన్స్ చేయించారు. మిగతా డబ్బు కంపెనీ వద్ద డిపాజిట్‌గా ఉంటుందన్నారు. డిపాజిట్‌పై వడ్డీ కింద ఫైనాన్స్ వాయిదాల కోసం ప్రతినెలా నా అకౌంట్లో డబ్బులు జమచేస్తామన్నారు. రెండు నెలలు డబ్బులు వేశారు. ఆ తర్వాత కంపెనీ ఎత్తేశారు. అప్పటి నుంచి ప్రతినెలా ఫైనాన్స్ వాళ్లు వచ్చి వాయిదాలు కట్టాలని వేధిస్తున్నారు. నాలాంటి బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు. – వెంకన్న, భవానీపేట్, లింగంపేట మండలం -
పోర్న్ వీడియోలు చూశావ్.. ఫైన్ కట్టమంటూ రూ.30 లక్షలకు టోకరా
న్యూఢిల్లీ: మీరు ఇంటర్నెట్లో పోర్న్ వీడియోలు చూస్తున్నారు.. జరిమానా చెల్లించండి అంటూ బోగస్ నోటీసులు పంపుతూ.. డబ్బు వసూలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు. నిందితులను గ్రాబ్రియేల్ జేమ్స్, రామ్ కుమార్ సెల్వం, బి.ధీనుశాంత్‌గా గుర్తించారు. వీరిని పట్టుకునేందుకు ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులు ఈ ప్రాంతంలో ఒక వారం పాటు క్యాంప్ చేసి, చెన్నై, త్రిచి, కోయంబత్తూర్, ఉధగామండలం(ఊటీ) మధ్య 2 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. చివరికి ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ తమ సూత్రధారి బి చందర్‌కాంత్ ఆదేశాల మేరకు ఈ పనిచేశామని.. అతడు కంబోడియాలో ఉంటాడని తెలిపారు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే చందర్‌కాంత్.. ధీనుశాంత్ సోదరుడు. ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు చూస్తున్నారు.. జరిమానా కట్టండి అంటూ తమకు నోటీసులు వచ్చాయని పలువురు బాధితులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమకు వచ్చిన బోగస్ పాప్ అప్ నోటీసులను కూడా షేర్ చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ సైబర్ క్రైం బ్రాంచ్ ఈ కేసును సుమోటోగా తీసుకుని.. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బాధితులకు వచ్చిన బోగస్ పాప్ అప్ నోటీసులను టెక్నిలక్ టీం పరిశీలించి.. ఇవన్ని చెన్నై నుంచి వచ్చినట్లు తెలిపింది. దాంతో ఓ టీం చెన్నైలో వారం రోజుల పాటు మకాం వేసి.. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. విచారణలో ధీనుశాంత్ బోగస్ పోలీసు నోటీసులు, ఇంటర్నెట్ వినియోగదారులకు వాటిని పంపించడం వంటి మొత్తం ఆపరేషన్‌కు సంబంధించిన సాంకేతిక భాగాన్ని అతని సోదరుడు బి. చందర్‌కాంత్ నిర్వహిస్తున్నారని తెలిపాడు. అతడు కంబోడియా రాజధాని నమ్ పెన్ సమీపంలో ఉన్న వీల్ పోన్ నుంచి వీటన్నింటిని ఆపరేట్ చేసేవాడని తెలిపాడు. "ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తులో, మోసం చేసిన డబ్బును తరలించడానికి 20 కి పైగా బ్యాంకు ఖాతాలు ఉపయోగించినట్లు కనుగొన్నాం’’ అన్నారు పోలీసులు. ‘‘నిందితులు ముగ్గురు ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి జూన్ వరకు గుర్తించబడిన యూపీఐ ఐడీలు, బోగస్ నోటీసులలో ఉపయోగించిన క్యూఆర్ సంకేతాల ద్వారా 30 లక్షల రూపాయలకు పైగా వసూలు చేశారు. ఇలా వచ్చిన డబ్బును సోదరుడు చందర్‌కాంత్ క్రిప్టోకరెన్సీల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి తరలిస్తున్నట్లు ధీనుశాంత్ వెల్లడించాడు. డబ్బును దాచడానికి మరిన్ని ఖాతాలను ఉపయోగించినట్లు అనుమానిస్తున్నందున ఈ విషయంపై మరింత దర్యాప్తు చేయాలి’’ అని పోలీసులు తెలిపారు. -
వైరల్: తలైవా స్టైల్లో తన్నాడు.. అంతే..
వెబ్‌డెస్క్: రజినీకాంత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన స్టైల్‌కి సినీ ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే. ఆయన నడక, నటన, డ్యాన్స్, ఫైట్, డైలాగ్ ఇలా సీన్ ఏదైనా సగటు ప్రేక్షకుడు సీటీ కొట్టాల్సిందే. అయితే తాజాగా రజినీ కాంత్ లాగా కనిపించే ఓ వ్యక్తి డయాస్ మీద నిలబడి తన చేష్టలతో ప్రజలను అలరిస్తున్నాడు. రజినీ స్టైల్లో కుర్చీ తన్నడానికి ప్రయత్నించాడు. అయితే కుర్చీతో స్టంట్ చేయటానికి ప్రయత్నించినప్పుడు ఆ కుర్చీ పగిలి అందులో కాలు ఇరుక్కుపోయింది. దీంతో ఆ వ్యక్తి కింద పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నిరంజన్ మహాపాత్ర అనే నెటిజన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. 7.66 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోను వేల మంది లైక్ కొట్టగా.. వందల మంది కామెంట్ చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ రజినీకాంత్ లాగా దుస్తులు ధరించవచ్చు. ఆయనలా కనిపించడానికి వేషధారణ చేసుకోవచ్చు. కానీ ఆయన స్టైల్‌ని భర్తీ చేయడం సాధ్యం కాదు.’’ అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87) -
మరో ఐశ్వర్య దొరికిందోచ్!
ఈ సువిశాల ప్రపంచంలో ఒక మనిషిని పోలిన వారు ఏడుగురు ఉంటారు అని చాలామంది నమ్ముతారు. ఏడుగురికి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ చూడటానికి ఒకేలా ఉండేవారు అక్కడక్కడా కనిపిస్తుండడం విశేషం. అయితే బాగా పాపులర్ అయిన సెలబ్రెటీలను పోలిన వారు ఎందరో మనకు సోషల్ మీడియాలో తారసపడుతుంటారు. తాజాగా ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను పోలిన ఓ పాకిస్థాన్ అమ్మాయి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బ్యూటీ బ్లాగర్ అయిన ఆమ్నా ఇమ్రాన్ మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్లాగా పోలికలు ఉండడంతో.. అందరూ ఆమెను డూప్లికేట్ ఐశ్వర్య అంటున్నారు. బూడిదరంగులో ఉన్న పెద్ద కళ్లు, గులాబీ రేకుల్లాంటి పెదాలుతో వైట్ షర్ట్ వేసుకుని అచ్చం ఐశ్వర్య రాయ్ చూసినట్లుగా కెమెరాకు పోజు ఇచ్చిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో ఆమె వైరల్‌గా మారింది. ఈ ఫోటో కింద ‘‘అల్లాముదల్లా ఎక్స్ ఏ మిలియన్, థ్యాంక్పుల్ ఫర్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ సర్ప్రైజ్. థ్యాంక్యూ అల్లా’’ అని రాసింది. అంతేగాకుండా ఐశ్వర్య నటించిన సినిమాల్లోని క్యారెక్టర్ల హావభావాలతో ఆమ్నా కొన్ని వీడియోలు కూడా పోస్టు చేయడంతో నెటిజన్లు అంతా ఐశ్వర్య డూప్ అని తెగ వైరల్ చేస్తున్నారు. ఆమ్నా అందానికి సంబంధించిన బ్లాగ్ నడుపుతున్నారు. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 30 వేలమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయిలు రావడం ఇదేమీ తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా కొంతమంది అచ్చం ఐశ్వర్యలా కనిపించి వైరల్ అయ్యారు. ఇప్పుడు ఐశ్వర్య డూప్ వైరల్ అయినట్లే గతంలో షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మల డూప్‌లు వైరల్ అయ్యాయి. View this post on Instagram A post shared by Aamna Imran 🌹 (@aamna_imrann) -
డూప్‌తో కానిచ్చేశారని, నటుడు ఫిర్యాదు
చెన్నై : అగ్నిదేవి చిత్రంలో తనకు బదులు డూప్‌ను నటింపజేశారని నటుడు బాబీసింహా ఆ చిత్ర దర్శక నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్లితే తిగర్ తండా, నేరం, కరుప్పన్, పేట వంటి చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించిన నటుడు బాబీసింహా. ఆయన తాజాగా అగ్నిదేవి అనే చిత్రంలో నటించారు. దీన్ని జాన్‌పాల్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర హీరో బాబీసింహా అగ్నిదేవి చిత్ర దర్శక నిర్మాతపై సెయింట్ థామస్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. అగ్నిదేవి చిత్రంలో తాను ఐదు రోజులే నటించానని, ఆ తరువాత తనకు చెప్పిన కథ కాకుండా వేరే కథను రూపొందిస్తుండటం, తాను నటించిన సన్నివేశాలను చూపించమని అడగ్గా అందుకు నిరాకరించడం, చిత్రం పేరును అగ్నిదేవి అని మా ర్చడం వంటి సమస్యలతో తానా చిత్రం నుంచి వైదొలగినట్లు పేర్కొన్నారు. చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించారని, పోస్టర్లలో తన ఫొటోలను వాడుతున్నారని తెలిపారు. తాను నటించని చిత్రంలో తనకు బదులు డూప్‌ను నటింపజేశారని పేర్కొన్నారు. అదే విధంగా దీనికి సంబంధించిన కేసు కోవై సివిల్ కోర్టులో విచారణలో ఉందని, అగ్నిదేవి చిత్ర దర్శక నిర్మాత జాన్‌పాల్‌రాజ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాబీసింహా ఫిర్యాదుతో అగ్నిదేవి చిత్ర దర్శక నిర్మాతపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కమిషనర్ నందంబాక్కం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
బాలీవుడ్ హీరోకి జిరాక్స్ కాపీ...!
సినిమాల్లో హీరోలకు డూప్‌లు ఉండటం సర్వ సాధారణం. వారిని కాస్తా దూరం నుంచి చూస్తే నిజంగా హీరోలేమో అనుకుంటాం. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే వ్యక్తి మాత్రం ఎవరికి డూప్ కాదు. కానీ ఒక బాలీవుడ్ హీరోకి జిరాక్స్ కాపీలా ఉన్నాడు. బాఘీ హీరో టైగర్ ష్రాఫ్‌కు అచ్చు గుద్దినట్లు ఉండే ఓ వ్యక్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. ప్రస్తుతం నెట్టింట్లో అతడి గురించే చర్చ. నెటిజన్లు టైగర్ ష్రాఫ్ - 2 గా పిలుచుకుంటున్న ఈ వ్యక్తి అస్సాంకు చెందిన డేవిడ్ సహరియా. ఫిట్నెస్ ఔత్సాహికుడు మాత్రమే కాక మోడల్ కూడా కావడంతో తన ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటాడు. దాంతో ఆ ఫోటోలు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. Old post Being Inspiration# Shredded # Way to go A post shared by David Messi (@davidmessi_official) on May 5, 2018 at 10:16am PDT -
మరణ రహస్యం.. భార్యను, పోలీస్ శాఖను మోసం చేశాడు
ముంబై: ఎక్కడికెళ్లినా అధికార దర్పం, గౌరవానికి కొదవలేదు. ఇన్స్పెక్టర్గారికి కింది స్థాయి సిబ్బంది నమస్కారం చేసి వెళ్తుంటారు. భార్య, పోలీస్ శాఖ అందరూ ఆయన ఇన్స్పెక్టరేనని నమ్మారు. చివరి రోజు కూడా పోలీసు మర్యాదలు అందుకున్నాడు. అయితే ఆయన మరణించిన తర్వాతే ఇన్స్పెక్టర్ కాదనే నిజం బయటపడింది. అందర్నీ నివ్వెరపరిచిన ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. పుణె సమీపంలో మంగళవారం బ్రహ్మ వడ్గాన్కర్ (37) అనే వ్యక్తి భార్యతో కలసి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతను పుణెలో ఏసీబీ ఇన్స్పెక్టర్గా అందరికీ గుర్తింపు. ఈ వార్త తెలియగానే వచ్చిన పోలీసులు వడ్గాన్కర్ జేబులోని గుర్తింపు కార్డు, అధికార పత్రాలు, బదిలీ ఉత్తర్వులు చూసి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు ఫోన్ చేశారు. డీజీపీ ప్రవీణ్ దీక్షిత్ వెంటనే స్పందించి ఆయనకు సాయం చేయాల్సిందిగా పుణె ఏసీబీ ఆఫీసుకు సమాచారం చేరవేశారు. ఏసీబీ అధికారులు వెంటనే రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. వడ్గాన్కర్ ఇన్స్పెక్టర్ కాదని ఒకప్పుడు పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేసేవాడని తేలింది. కాగా ప్రమాదంలో వడ్గాన్కర్ మరణించగా, ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. గుర్తింపు కార్డు, అధికార పత్రాలు, బదిలీ ఉత్తర్వులు నకిలీవని కనుగొన్నారు. ఈ విషయం ఆయన భార్యకు చెప్పగా తొలుత ఆమె నమ్మలేదు. పోలీసులు వివరాలు చెప్పడంతో ఆమె కలల ప్రపంచం కూలిపోయినట్టు అనిపించింది. పెళ్లికి ముందు ఇంగ్లండ్‌లో ఉన్న ఆమెకు ఓ వివాహ ప్రకటన ద్వారా వడ్గాన్కర్ పరిచయమయ్యాడు. ఆమె కుటుంబ సభ్యులు కట్నంగా బంగారు, నగదు ఇచ్చి పెళ్లి చేశారు. కాగా పెళ్లికి అతని కుటుంబ సభ్యులు హాజరుకాలేదు. వారికి ఇష్టం లేకపోవడంతో రాలేదని పెళ్లికూతురు వారిని నమ్మించారు. పెళ్లియిన తర్వాత వడ్గాన్కర్ లాకర్లో పెడతానంటూ నగలు తీసుకెళ్లాడు. భార్యను, పోలీసులను మోసగించిన వడ్గాన్కర్ చివరకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతను మరెవరినైనా మోసం చేశాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
పెళ్లి చేసుకుంటానని టెకీని దోచేసిన వివాహిత
హైదరాబాద్: పెళ్లి పేరుతో ఓ టెకీని మోసం చేసి 4 లక్షల రూపాయిలు టోకరా వేసిన ఓ వివాహితను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిందితురాలు వివాహప్రకటనల సైట్లో తన పేరును రాజ్యలక్ష్మిగా పేర్కొంటూ తప్పుడు ప్రొఫైల్ పోస్ట్ చేసింది. వృత్తి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని, చెన్నైలోని ఓ పెద్ద ఐటీ కంపెనీలో పనిచేస్తున్నానని, తగిన వరుడు సంప్రదించవచ్చని ప్రకటన ఇచ్చింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసే అశోక్ రెడ్డి ఆమెను సంప్రదించాడు. ఫోన్, మెయిల్స్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. నిందితురాలు ఇద్దరు వ్యక్తులను తన తల్లిదండ్రులుగా నమ్మించి, పెళ్లికి అంగీకరిస్తున్నట్టుగా వారితో అశోక్ రెడ్డికి చెప్పించింది. ఆ తర్వాత తన ఉద్యోగవసరార్థం నాలుగు లక్షల రూపాయిలు కావాలని అశోక్ రెడ్డిని అడిగింది. అతను రెండు విడతలుగా 4.2 లక్షలు బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేశాడు. నిందితురాలి ప్రవర్తన తేడాగా ఉండటంతో తాను మోసపోయానని అశోక్ రెడ్డి గ్రహించాడు. ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నెల్లూరు జిల్లా కావలికి చెందిన నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరపరిచారు. ఆమె ఇంతకుముందు కూడా పెళ్లి పేరుతో మరో ఇద్దరిని మోసగించినట్టు వెలుగుచూసింది. నిందితురాలు భర్త అండతో మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.