ఆమ్నా ఇమ్రాన్, ఐశ్వర్యారాయ్
ఈ సువిశాల ప్రపంచంలో ఒక మనిషిని పోలిన వారు ఏడుగురు ఉంటారు అని చాలామంది నమ్ముతారు. ఏడుగురికి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ చూడటానికి ఒకేలా ఉండేవారు అక్కడక్కడా కనిపిస్తుండడం విశేషం. అయితే బాగా పాపులర్ అయిన సెలబ్రెటీలను పోలిన వారు ఎందరో మనకు సోషల్ మీడియాలో తారసపడుతుంటారు. తాజాగా ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను పోలిన ఓ పాకిస్థాన్ అమ్మాయి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
బ్యూటీ బ్లాగర్ అయిన ఆమ్నా ఇమ్రాన్ మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్‌లాగా పోలికలు ఉండడంతో.. అందరూ ఆమెను డూప్లికేట్ ఐశ్వర్య అంటున్నారు. బూడిదరంగులో ఉన్న పెద్ద కళ్లు, గులాబీ రేకుల్లాంటి పెదాలుతో వైట్ షర్ట్ వేసుకుని అచ్చం ఐశ్వర్య రాయ్ చూసినట్లుగా కెమెరాకు పోజు ఇచ్చిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో ఆమె వైరల్‌గా మారింది. ఈ ఫోటో కింద ‘‘అల్లాముదల్లా ఎక్స్ ఏ మిలియన్, థ్యాంక్‌పుల్ ఫర్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ సర్‌ప్రైజ్. థ్యాంక్యూ అల్లా’’ అని రాసింది. అంతేగాకుండా ఐశ్వర్య నటించిన సినిమాల్లోని క్యారెక్టర్ల హావభావాలతో ఆమ్నా కొన్ని వీడియోలు కూడా పోస్టు చేయడంతో నెటిజన్‌లు అంతా ఐశ్వర్య డూప్ అని తెగ వైరల్ చేస్తున్నారు.
ఆమ్నా అందానికి సంబంధించిన బ్లాగ్ నడుపుతున్నారు. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 30 వేలమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయిలు రావడం ఇదేమీ తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా కొంతమంది అచ్చం ఐశ్వర్యలా కనిపించి వైరల్ అయ్యారు. ఇప్పుడు ఐశ్వర్య డూప్ వైరల్ అయినట్లే గతంలో షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మల డూప్‌లు వైరల్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment