పాన్ ఇండియా హీరో అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే పేరు ప్రభాస్. 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా గురించి ప్రపంచానికి తెలిసేలా రాజమౌళి చేస్తే.. హీరోగా చేసిన ప్రభాస్ అంతకు మించిన పాపులారిటీ సంపాదించాడు. మొన్నీమధ్యే 'సలార్'తో సక్సెస్ అందుకున్న డార్లింగ్.. త్వరలో 'కల్కి' మూవీతో రాబోతున్నాడు. ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా మాట్లాడుకుంటున్న టైంలో ప్రభాస్ డూప్‌కి ఇచ్చే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.
ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరికీ బాడీ డబుల్ లేదా డూప్ ఉంటారు. అంటే ఫైట్ సీన్స్‌లో కొన్నిచోట్ల హీరోల కనిపిస్తే.. వెనక నుంచి, సైడ్ నుంచి కనిపించే కొన్ని షాట్స్‌లో హీరోల పోలిన వ్యక్తులని పెట్టి మేనేజ్ చేస్తారు. అలా ప్రభాస్‌కి కిరణ్ రాజ్ అనే వ్యక్తి డూప్‌గా చేస్తుంటాడు. 'బాహుబలి' సినిమా తర్వాత కిరణ్ రాజ్ కాస్తంత పాపులరాటీ తెచ్చుకున్నాడు. కొన్ని ఇంటర్వ్యూల్లోనూ కనిపించాడు.
(ఇదీ చదవండి: Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ)
అయితే మిగతా హీరోల డూప్స్‌కి సదరు సినిమాల నిర్మాతలే రెమ్యునరేషన్ ఇస్తుంటారు. కానీ ప్రభాస్ మాత్రం తన సిబ్బందితో సహా ప్రతి ఒక్కరికి తానే జీతాలు చెల్లిస్తాడు. రీసెంట్‌గానే ఈ విషయం బయటకొచ్చింది. అలానే డూప్‌గా నటించే కిరణ్ రాజ్‌కి ఒక్కో చిత్రానికి గానూ దాదాపు రూ.30 లక్షలు పైనే ప్రభాస్ చెల్లిస్తాడట. కొన్నిసార్లు దీనకంటే ఎక్కువే ఇవ్వొచ్చని కూడా అంటున్నారు.
అయితే డూప్‌కి రూ.30 లక్షలు ఇస్తున్నారనే రూమర్ అనేది ఒకవేళ నిజమైతే మాత్రం షాకింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది చోటామోటా హీరోలకు కూడా ఇంత రెమ్యునరేషన్ ఇవ్వకపోవచ్చు. అలా ఇప్పుడు ప్రభాస్ డూప్‌కి ఇస్తున్న రెమ్యునరేషన్ ఇదేనంటూ వైరల్ అవుతున్న ఓ విషయం.. ఇప్పుడు నెటిజన్స్ షాకయ్యేలా చేస్తోంది.
(ఇదీ చదవండి: Anupama Remuneration: టిల్లు కోసం రెమ్యునరేషన్ పెంచేసిన అనుపమ..)
Comments
Please login to add a commentAdd a comment