ఎడమ వైపు టైగర్ ష్రాఫ్, కుడి వైపు డేవిడ్ సహరియా
సినిమాల్లో హీరోలకు డూప్‌లు ఉండటం సర్వ సాధారణం. వారిని కాస్తా దూరం నుంచి చూస్తే నిజంగా హీరోలేమో అనుకుంటాం. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే వ్యక్తి మాత్రం ఎవరికి డూప్ కాదు. కానీ ఒక బాలీవుడ్ హీరోకి జిరాక్స్ కాపీలా ఉన్నాడు. బాఘీ హీరో టైగర్ ష్రాఫ్‌కు అచ్చు గుద్దినట్లు ఉండే ఓ వ్యక్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.
ప్రస్తుతం నెట్టింట్లో అతడి గురించే చర్చ. నెటిజన్లు టైగర్ ష్రాఫ్ - 2 గా పిలుచుకుంటున్న ఈ వ్యక్తి అస్సాంకు చెందిన డేవిడ్ సహరియా. ఫిట్‌నెస్ ఔత్సాహికుడు మాత్రమే కాక మోడల్ కూడా కావడంతో తన ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటాడు. దాంతో ఆ ఫోటోలు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment