ఆ హీరో సిస్టర్‌ ఫొటోలు హల్‌చల్‌! | Tiger Shroff's sister Krishna chilling photos | Sakshi
Sakshi News home page

ఆ హీరో సిస్టర్‌ ఫొటోలు హల్‌చల్‌!

Published Thu, Apr 6 2017 4:41 PM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM

ఆ హీరో సిస్టర్‌ ఫొటోలు హల్‌చల్‌!

ఆ హీరో సిస్టర్‌ ఫొటోలు హల్‌చల్‌!

కండలు తిరిగిన దేహంతో, హై యాక్షన్‌ సినిమాలతో బాలీవుడ్‌లో తనదైనరీతిలో దూసుకుపోతున్నాడు టైగర్‌ ష్రాఫ్‌.. సీనియర్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని.. తండ్రికి తగ్గ తనయుడిగా టైగర్‌ సత్తా చాటుతుండగా.. అతని సోదరి కృష్ణ ష్రాఫ్‌ కూడా తనదైన స్టైల్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతం యాక్టింగ్‌ కోర్సును చేస్తున్న కృష్ణ తాను కూడా తండ్రి, సోదరుడి బాటలో సినిమాల్లో నటించేది లేనిది స్పష్టం చేయలేదు. కానీ, సోషల్‌ మీడియాలో ఆమె తనదైన ఫొటోలు, పోస్టులతో.. అభిమానులను అలరిస్తున్నది.

ఇన్‌స్టాగ్రామ్‌ సెన్సేషన్‌గా మారిన ఈ బ్యూటికి ఇప్పటికే రెండు లక్షలకుపైగా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు హాట్‌ హాట్‌ ఫొటోలు, అప్‌డేట్స్‌తో ఈ బ్యూటీ నిత్యం తన ఫాలోవర్లకు టచ్‌లో ఉంటోంది. తాజాగా బికినీలో దిగిన మరో ఫొటోను ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ సుందరాంగి జోరు చూస్తుంటే త్వరలోనే సినిమాల్లో అడుగుపెట్టవచ్చునేమో అని సినీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement