Adiparvam Movie: నాగలాపురం నాగమ్మ’గా మంచులక్ష్మి | manchu lakshmi new movie adiparvam will have extraordinary graphic work | Sakshi
Sakshi News home page

Adiparvam Movie: నాగలాపురం నాగమ్మ’గా మంచులక్ష్మి

Published Sun, Feb 4 2024 12:44 AM | Last Updated on Sun, Feb 4 2024 7:53 AM

manchu lakshmi new movie adiparvam will have extraordinary graphic work - Sakshi

మంచు లక్ష్మి లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. ఈ చిత్రానికి సంజీవ్‌ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఏ వన్‌ ఎంటర్టైన్మెంట్స్‌ నిర్మించిన ఈ చిత్రం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్‌ డ్రామాగా సాగుతుంది. ఈ చిత్రం ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌ ఘంటా శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ– ‘‘దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలతోపాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.

‘‘నాగలాపురం నాగమ్మగా మంచు లక్ష్మి నట విశ్వరూపం చూపించే సినిమా ఇది. ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్‌ ఉంటాయి’’ అన్నారు సంజీవ్‌ మేగోటి. ‘గ్రాఫిక్స్, మంచు లక్ష్మి ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌’’ అన్నారు చిత్ర సమర్పకులు రావుల వేంకటేశ్వర రావు. ‘‘పోస్ట్‌ ప్రోడక్షన్‌ దశలోనే ఈ సినిమాని చూసి హ్యాపీ ఫీల్‌ అయ్యాం’’ అన్నారు సహనిర్మాతల్లో ఒకరైన గోరెంట శ్రావణి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement