ఐదు భాషల్లో మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ | Manchu Lakshmi Adiparvam Movie Latest Updates | Sakshi
Sakshi News home page

ఐదు భాషల్లో మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’

Published Sat, Mar 30 2024 3:27 PM | Last Updated on Sat, Mar 30 2024 4:07 PM

Manchu Lakshmi Adiparvam Movie Latest Updates - Sakshi

ట్రైలర్ కు విశేష స్పందన

మంచు లక్ష్మీ  ప్రధాన పాత్రలో నటించిన సోషియో ఫాంటసీ ఫిలీం 'ఆదిపర్వం'. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో... రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్-ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కి... ఇటీవల ఐదు భాషల్లోనూ విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకులు సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ... ‘ఆదిపర్వం’ ప్రచార చిత్రానికి లభిస్తున్న అనూహ్య స్పందన... ఈ చిత్రం కోసం మేము పడిన కఠోర శ్రమ మర్చిపోయేలా చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. త్వరలో సెన్సార్ కు వెళ్లనున్నాం. బహు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఇంత బాగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి గారికి స్పెషల్ థాంక్స్" అన్నారు. ఈ చిత్రంలో మంచులక్ష్మీతో పాటు శివకంఠంనేని , ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెట గాంధీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement