
మంచు లక్ష్మీప్రసన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రావుల వెంకటేశ్వర్రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ - అమెరికా ఇండియా (ఎ.ఐ) ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. 1974-1990 మధ్యకాలంలో జరిగిన యధార్థ సంఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది.
నేడు(అక్టోబర్ 8) మంచు లక్ష్మీ బర్త్‌డే. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శకనిర్మాతలు. చిత్ర దర్శకుడు సంజీవ్ మెగోటి మాట్లాడుతూ... ‘మంచు లక్ష్మీప్రసన్న ఇదివరకు చెయ్యని పాత్రలో కొత్తగా కనిపిస్తారు. తను చేసిన రెండు ఫైట్స్ సినిమాకి హైలెట్స్ గా నిలుస్తాయి’ అన్నారు.
‘రెట్రో ఫీల్ తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మొదలై కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆద్యంతం అలరించే చిత్రమిది’అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాసరావ్ అన్నారు. ఈ చిత్రంలో ఆదిత్యఓం, ఎస్తేర్, సుహాసిని ,శ్రీజిత ఘోష్, శివ కంఠంనేని, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment