మంచు లక్ష్మి కాళ్ల మీద పడి ఏడ్చేసిన అభిమాని.. వీడియో వైరల్ | Manchu Lakshmi Fan Crying Video At Adiparvam Trailer Launch | Sakshi
Sakshi News home page

Manchu Lakshmi: కాళ్లమీద పడ్డాడు.. తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు

Published Tue, Mar 19 2024 12:15 PM | Last Updated on Tue, Mar 19 2024 8:00 PM

Manchu Lakshmi Fan Crying Video At Adiparvam Trailer Launch - Sakshi

మంచు లక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ.. లుత పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది. 'అనగఅనగా ఓ ధీరుడు' చిత్రంతో నటిగా మారింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈమె.. ఇప్పుడు కాస్త నెమ్మదించింది. 'ఆదిపర్వం' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేసింది. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ చిత్రం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది. సోమవారం ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. 

ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే తిరుపతికి చెందిన ఓ అభిమాని.. నేరుగా స్టేజీపైకి వచ్చే మంచు లక్ష్మి కాళ్లపై పడిపోయాడు. కలిసినందుకో ఏమో గానీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే ఈ ఈవెంట్ పూర్తయిపోయిన తర్వాత సదరు అభిమానితో మంచు లక్ష్మి ఫొటో దిగి, అతడిని ఓదార్చింది.  ఆ తర్వాత పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు మంచు లక్ష్మిని గజమాలతో సత్కరించారు.

(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ డబుల్ చేసిన సమంత.. వామ్మో అన్ని కోట్లా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement