
మంచు లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. ఎస్తేర్, శివ కంఠమనేని కీలక పాత్రలు పోషించారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథతో గ్రాఫిక్స్ ప్రధానంగా "ఆదిపర్వం" చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. "ఆదిపర్వం" సినిమా ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 500కు పైగా థియేటర్స్ లో "ఆదిపర్వం" సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది.
1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల సమాహారంగా "ఆదిపర్వం" సినిమాను రూపొందించారు దర్శకుడు సంజీవ్ మేగోటి. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో దుష్టశక్తికి, దైవశక్తికి మధ్య జరిగే యుద్ధాన్ని ఆసక్తికరంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, టెక్నికల్ హంగులతో ఈ సినిమాలో చూపించబోతున్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా "ఆదిపర్వం" థియేటర్స్ లోకి వస్తుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment