ఈ వేడుకలో పాల్గొనడం నా అదృష్టం: యంగ్ హీరో | Young Hero Vishwak Sen Attended RP Patnayak Bhagavad Gita Launch, His Comments Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Vishwak Sen: చాలా అద్భుతంగా చేశారు.. సంగీత దర్శకుడిపై విశ్వక్ ప్రశంసలు!

Published Mon, Mar 11 2024 9:09 PM | Last Updated on Tue, Mar 12 2024 10:57 AM

Young Hero Vishwak Sen Attended RP Patnayak Bhagavad Gita Launch - Sakshi

ఇటీవలే గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన యంగ్ హీరో విశ్వక్‌ సేన్. ఈనెల 8న రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.15 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో విశ్వక్ అఘోరా పాత్రలో కనిపించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అయితే తాజాగా విశ్వక్ సేన్ ఓ ప్రతిష్ఠాత్మక వేడుకలో పాల్గొన్నారు.  ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ రికార్డ్ చేసిన సంపూర్ణ భగవద్గీత తాత్పర్యంలోని విశ్వరూప దర్శనం అధ్యాయాన్ని లాంచ్ చేశారు. నేటి యువతతో పాటు అందరికీ అర్థమయ్యేలా రికార్డ్ చేసిన ఆర్పీ పట్నాయక్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. 'ఈ వేడుకలో భాగం కావడం గర్వంగా వుంది. భగవద్గీత విశ్వరూప దర్శనం అధ్యాయం లాంఛ్ చేయడం నా అదృష్టం.  కేవలం పాడ్ కాస్ట్‌లా వినొచ్చేమో అనుకున్నా. కానీ విజువల్ కూడా చాలా కేర్ తీసుకొని అద్భుతంగా చేశారు. నేటి యువతతో పాటు అందరికీ అర్థమయ్యేలా సంపూర్ణ భగవద్గీత తాత్పర్యంను చాలా చక్కగా రికార్డ్ చేసిన ఆర్పీ పట్నాయక్ గారికి ధన్యవాదాలు. ఇది చాలా గొప్ప కార్యం. ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది' అని అన్నారు. 

ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ..'ఈ కార్యాన్ని భగవంతుడే నా చేత చేయించాడు. నేను కేవలం నిమిత్తమాత్రుడినే. స్వామి ముకుందనంద రాసిన భగవద్గీత అందరికీ సులువుగా అర్ధమైయ్యేలా ఉంటుంది. వారి అనుమతితోనే రికార్డ్ చేశాను. ఈ ప్రయాణంలో ఎంతగానో తోడ్పడిన దివాకర్ గారికి ధన్యవాదాలు. జానకీరామ్ అద్భుతమైన విజువల్స్ చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేశారు. మొత్తం మన పురాణాలన్నింటిని తన బొమ్మలతో ప్రపంచానికి చెప్పే మెగా ప్రాజెక్ట్ చేయబోతున్నారాయన. నా వంతుగా సపోర్ట్‌ చేస్తూ లక్ష రూపాయిలు ఇస్తున్నా. ఈ ప్రాజెక్ట్ కోసం మౌళి చాలా కష్టపడ్డాడు. ఈ ప్రాజెక్ట్ కోసం పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. యూత్‌ని దృష్టిలో పెట్టుకొని చేసిన భగవద్గీత ఇది. అందుకే అతిథిగా యంగ్ హీరో విశ్వక్‌ను పిలిచాం. దేవుడు కల్పించిన ఈ అవకాశాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నా' అని అన్నారు. 

దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ...'భగవద్గీత ఆర్పీ పట్నాయక్ తాత్పర్యంతో రికార్డ్ చేస్తున్నారని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది. ఇది చాలా బాగుంది. చిరకాలం నిలిచిపోయే ప్రాజెక్ట్' అని అన్నారు. ఈ వేడుకలో జేకే భార్గవి, రఘు కుంచె, సింగర్ కౌశల్య, జెమిని సురేష్ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement