బిగ్ కెమెరా, 5జీ : ఎంఐ 10టీ ప్రొ | Xiaomi Mi 10T, Mi 10T Pro launched  | Sakshi
Sakshi News home page

బిగ్ కెమెరా, 5జీ : ఎంఐ 10టీ ప్రొ

Published Fri, Oct 16 2020 2:29 PM | Last Updated on Fri, Oct 16 2020 2:41 PM

Xiaomi Mi 10T, Mi 10T Pro launched  - Sakshi

సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి ఎంఐ బ్రాండ్ లో కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. ఎంఐ10టీ, ఎంఐ 10టీ ప్రో పేర్లతో రెండు కొత్త ఫోన్లను భారత్‌లో ఆవిష్కరించింది. 5జీ కనెక్టివిటీ, ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్, 144 హెర్ట్జ్ ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.

ధరలు, లభ్యత
ఎంఐ 10టీ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యం కానుంది. 
6 జీబీ ర్యామ్ ,128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999
8 జీబీ ర్యామ్ , 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999
కాస్మిక్ బ్లాక్, లూనార్ సిల్వర్ రంగుల్లో లభ్యం కానుంది. 
ఎంఐ 10టీ ప్రో ఒక్క  వేరియంట్‌లో మాత్రమే లభ్యం.
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ.39,999
అరోరా బ్లూ, కాస్మిక్ బ్లాక్, లూనార్ సిల్వర్ రంగుల్లో లభ్యం కానుంది. 

అక్టోబర్ 16 నుండి ప్రీ-ఆర్డర్‌ల కోసం అందుబాటులో ఉంటుంది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా ఈ ఫోన్ కొనుగోలు చేసేవారికి రూ.3,000 బ్యాంక్ క్యాష్ బ్యాక్, ఎక్స్ చేంజ్‌ ద్వారా  రూ.2000 అదనపు తగ్గింపు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

ఎంఐ 10టీ ప్రో ఫీచర్లు
6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే
ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 10
108+13+5 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 
20 ఎంపీ సెల్ఫీ కెమెరా 
5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ఎంఐ 10టీ ఫీచర్లు
6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 10 
ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్
64+13+5ఎంపీ ట్రిపుల్ రియర్  కెమెరా 
20 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement