సాక్షి, ముంబై : చైనాకు చెందిన టెలివిజన్ తయారీదారు టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. 8 కే క్యూఎల్‌ఈడీ టీవీ 4 కే క్యూఎల్‌ఈడీ టీవీలను భారతదేశంలో ప్రవేశపెట్టింది. 8 కే క్యూఎల్‌ఈడీ 75 అంగుళాల ప్యానల్‌ను కలిగి ఉండగా, 4 కె క్యూఎల్‌ఈడీ టివి శ్రేణి ప్రీమియం, ఎంట్రీ లెవల్ కేటగిరీలో పలు స్క్రీన్ పరిమాణాలలోతీసుకొచ్చింది. వీటి ధరలు రూ .45,990 నుండి మొదలై 2,99,990 రూపాయల వరకు ఉన్నాయి. కొత్త టీవీలు హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ ఫీచర్ తో రావడం విశేషం.
ఈ తాజా చేర్పులతో, ప్రీమియం స్మార్ట్ టీవీ విభాగంలో కొత్త మైలురాళ్లను సృష్టించనున్నామని టీసీఎల్ ఇండియా జనరల్ మేనేజర్ మైక్ చెన్ తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటి 8 కె క్యూఎల్‌ఈడీ టీవీని తొలిసారిగా తామే లాంచ్ చేస్తున్నామన్నారు. 75 అంగుళాల ఎక్స్915 8 కె క్యూఎల్‌డి ఆండ్రాయిడ్ టీవీలో ఐమాక్స్ పాప్-అప్ కెమెరా, డాల్బీ విజన్ అల్ట్రా-వివిడ్ ఇమేజింగ్, డాల్బీ అట్మోస్ ఆడియో, ఏఐ ఆధారిత 8కే ప్రాసెసర్ లాంటి మెరుగైన ఫీచర్లను ఈ టీవీలలో అందిస్తామని తెలిపారు.
8 కె క్యూఎల్‌ఈడీ 75 ఎక్స్ 915 ధర 2,99,990 రూపాయలు.
4 కె క్యూఎల్‌ఈడీ టీవీ : సీ 815, సీ 715 క్వాంటం డాట్ డిస్ ప్లే టెక్నాలజీ ప్రధాన ఆకర్షణ.
సీ 815 4 కె క్యూఎల్‌టీవీ ప్రారంభ ధర 69,990 రూపాయలు. ఇవి 55, 65, 75 అంగుళాలల్లో లభ్యం
సీ 715 ఎంట్రీ లెవల్ 4 కె క్యూఎల్‌ఈడీ టీవీ ధర 45,990 రూపాయలు. 50, 55 65 అంగుళాలలో లభిస్తుంది.
'మేక్ ఇన్ ఇండియా' చొరవలో భాగంగా ఎలక్ట్రానిక్స్ తిరుపతిలో 2,400 కోట్ల రూపాయల విలువైన తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ సంవత్సరానికి 8 మిలియన్ల 22-55 అంగుళాల టీవీ స్క్రీన్‌లను, 30 మిలియన్ల 3.5-8 అంగుళాల మొబైల్ స్క్రీన్‌ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉందనీ, ఇదే అతిపెద్ద ఉత్పాదక యూనిట్ అని పేర్కొంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 8వేల మందికి పైగా ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారని టీసీఎల్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment