TCL
-
రాష్ట్రంలో టీసీఎల్ యూనిట్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ టీసీఎల్.. తెలంగాణలో కంపెనీని ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీ రాష్ట్రానికి చెందిన రిసోజెట్ సంస్థతో కలసి కన్జ్యూమర్ ఎల్రక్టానిక్ గూడ్స్ తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఈ మేరకు బుధవారం పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సమక్షంలో రిసోజెట్‌తో టీసీఎల్ ప్రతినిధులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. టీసీఎల్ ఎల్రక్టానిక్స్ తన ప్రధాన కేంద్రం అయిన చైనాలోని హెఫెయి నగరం తర్వాత ఇతర దేశాల్లో ఏర్పాటు చేస్తున్న తొలి తయారీ యూనిట్ ఇదే కావడం గమనార్హం. ఈ కంపెనీలో తొలుత వాషింగ్ మెషిన్లను తయారు చేస్తారు. అనంతరం రిఫ్రిజిరేటర్లు, డిష్ వాషర్ల వంటి ఇతర ఉపకరణాలనుకూడా తయారు చేస్తారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని ’ఈ– సిటీ’లో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్ కోసం టీసీఎల్ రూ.225 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఈ యూనిట్‌తో తొలిదశలోనే సుమారు 500 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెపుతున్నారు. రాష్ట్రంలో టీసీఎల్ కంపెనీ పెట్టుబడులు పెట్టడాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ రంగానికి తెలంగాణ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, ఇక్కడ హైటెక్నాలజీ ఉత్పత్తుల తయారీకి మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం హైదరాబాద్‌ను షెన్జెన్ ఆఫ్ ఇండియాగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలను, టీసీ ఎల్ సంస్థ చైర్పర్సన్ జువాన్ డూకి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీకి ఉన్న అనుకూల పరిస్థితులు, మౌలిక వసతులు, తమ ప్రభుత్వ విధానాలను పరిశీలించేందుకు రాష్ట్రంలో పర్యటించాలని కేటీఆర్ ఆమెను ఆహా్వనించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కంపెనీ రెజల్యూట్ గ్రూప్ చైర్మన్ రమీందర్ సింగ్ సొయిన్, రాష్ట్ర ఎల్రక్టానిక్స్ విభాగం డైరెక్టర్ సుజాయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు. -
బెస్ట్ గేమింగ్ టీవీ కోసం చూస్తున్నారా, ఇదిగో కళ్లు చెదిరే టీవీల లిస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈ ఫెస్టివ్ సీజన్లో మంచి గేమింగ్ టెలివిజన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. ఇటీవలి కాలంలో మొబైల్స్, టీవీల్లో గేమింగ్ బాగా పాపులర్ అవుతోంది. తమ స్నేహితులతో కలిసి వర్చువల్‌గా మల్టీప్లేయర్ గేమ్స్‌తో కొత్త ప్రపంచాలని అన్వేషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన మానిటర్ లేదా టీవీ చాలా ముఖ్యం. గేమింగ్ టీవీలు అధిక రిఫ్రెష్ రేట్ 4K డిస్ప్లేలు గేమ్‌లలో అద్భుతమైన విజువల్స్‌ను ఫిక్స్డ్ ఫ్రేమ్ రేట్‌తో అందిస్తాయి. ఈ టీవీలు శక్తివంతమైన ప్రాసెసర్లతో పాటు, VRR, G-Sync, FreeSync కి సపోర్ట్‌తో కస్టమర్లకు మంచి గేమింగ్ అనుభవాన్నిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నదిగ్గజ కంపెనీలుఎల్జీ, సోనీ, శాంసంగ్ , టీసీఎల్ తదితర ది బెస్ట్ టీవీలను ఒకసారి చూద్దాం ఎల్జీ సీ 2 ఎల్జీ సీ 2 OLED 4K స్మార్ట్ టీవీ C1కి సక్సెసర్ ఇది. α9 Gen5 AI ప్రాసెసర్‌తో వస్తుంది, 42, 48, 55 ,65,77 , 83 అంగుళాల సైజుల్లో లభ్యం. ఇది పిక్సెల్ డిమ్మింగ్‌కు మద్దతు ఇస్తుంది . 100 శాతం కలర్ ఫిడెలిటీతో మంచి గేమింగ్ అనుభవాన్నిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో Nvidia G-Sync, AMD ఫ్రీసింక్ , VRRలకు సపోర్ట్ దీని స్పెషాలిటీ. ఇది పీసీగానూ కన్సోల్ గేమింగ్‌కు పనికొస్తుంది. ఇండియాలో ఈ టీవీ ధర రూ. 1,39,990 నుండి ప్రారంభం. LG అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సోనీ X90J కంపెనీ ఫ్లాగ్షిప్ 4K LED స్మార్ట్ టీవీఇది. సోనీ X90J అనేది బ్యాక్‌లైటింగ్ లోకల్ డిమ్మింగ్‌తో గేమింగ్‌కోసం బెస్ట్ ఆప్షన్ ఇది. ఇమేజ్ క్వాలిటీని పెంపొందించే Bravia XR ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ VRRకి సపోర్టు చేస్తుంది. ఇందులోని ఫార్-ఫీల్డ్ మైక్స్‌తో మీ వాయిస్‌ని ఉపయోగించి ఆపరేట్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. 55, 65 అంగుళాల స్క్రీన్ సైజులలో లభిస్తుంది భారతదేశంలో రూ. 1,18,740 నుండి ప్రారంభం. ఈ టీవీని క్రోమా ద్వారా కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ Q90B QLED TV అద్భుతమైన 4K చిత్రాలను అందించడానికి నియో క్వాంటం ప్రాసెసర్‌ని కలిగి ఉంది. క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ లైట్‌ని ఎడ్జస్ట్ చేసుకుని, 4K గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ఈ టీవీకి VRR మద్దతు లేదు. 50, 55, 65, 75, 85 అంగుళాలలో అందుబాటులో ఉంది. ధర రూ. 1,09,990 నుండి ప్రారంభం Samsung అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. TCL C835 4K TV క్వాడ్-కోర్ 4K ప్రాసెసర్, లోకల్ డిమ్మింగ్ , 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో ఈ టీవీ వస్తుంది. మినీ LED ప్యానెల్ అద్భుతమైన కాంట్రాస్ట్, VRR మద్దతును దీని స్పెషల్. TCL C835 TV 55,65 ,75 అంగుళాలలో అందుబాటులో ఉంది. ధర భారతదేశంలో రూ. 1,19,990 నుండి ప్రారంభం. TCL స్టోర్, క్రోమా, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ ది ఫ్రేమ్ 2022 శాంసంగ్ నుంచి మరో సూపర్ గేమింగ్ టీవీ శాంసంగ్ ది ఫ్రేమ్ 2022అద్భుతమైన డిజైన్‌తో అధునాతన ఫోటో ఫ్రేమ్‌గా కనిపిస్తుందీ టీవీ.120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో ఫ్రేమ్ 100 శాతం కలర్ వాల్యూమ్‌ను అందించే క్వాంటం డాట్ టెక్, క్వాంటం ప్రాసెసర్ కలిగి ఉంది. భారతదేశంలో రూ. 53,990 నుండి ప్రారంభం, దీన్ని Samsung స్టోర్, అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు -
తుప్పల్లో టెంకాయ్.. మా బాబే!
సాక్షి, అమరావతి: పొరుగు భూమిలో.. తుప్పల్లో ఆదరబాదరగా కొబ్బరికాయ కొట్టేసి ప్రారంభోత్సవం జరిగినంత హడావుడి చేయడం సిగ్గు లేని జన్మకు నిదర్శనం కాదా? కనీసం భూ కేటాయింపులే చేయకుండా ప్రముఖ సంస్థలను రప్పించిన ఘనత తమదేననడం సిగ్గు పడాల్సిన విషయం కాదా? తిరుపతి సమీపంలోని ఈఎంసీలో ఏర్పాటైన టీసీఎల్ కంపెనీ విషయంలో టీడీపీ, దాని అనుకూల మీడియా వ్యవహార శైలి ఇలానే ఉంది మరి! టీసీఎల్ లోకేష్ కష్టార్జితం.. బాబు చెమటార్జితం.. అంటూ గుండెలు బాదుకోవడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. మాజీ సీఎం చంద్రబాబు గత ఎన్నికల సమయంలో 2018 డిసెంబర్లో ఎలాంటి అనుమతులు, భూ కేటాయింపులు లేకుండా హడావుడిగా పక్క స్థలంలో భూమి పూజ కానిచ్చేసి చేతులు దులుపేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం టీసీఎల్ లాంటి వందల కంపెనీలు తెచ్చాం.. లక్షల ఉద్యోగాలిచ్చేశాం.. అంటూ నమ్మబలికారు. ఈ గాలి కబుర్లను నమ్మని ప్రజలు ఓటుతో టీడీపీకి గుణపాఠం నేర్పారు. భూమి కేటాయించింది ఎవరు? టీసీఎల్‌కు గత ప్రభుత్వమే నిజంగా భూమి కేటాయిస్తే ఆ కంపెనీ ప్రతినిధులు 2019 జూన్ 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలసి భూ కేటాయింపులు, నీటి సమస్యను పరిష్కరించమని ఎందుకు అడిగారు? టీసీఎల్ ఇండస్ట్రియల్ హోల్డింగ్ సీఈఓ కెవిన్ వాంగ్ ముఖ్యమంత్రిని కలిసి భూమి కేటాయించాలని కోరడం వాస్తవం కాదా? ఆ వెంటనే 2019 ఆగస్టు 8న టీసీఎల్‌కు 149 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 774 జారీ చేసింది. నీటి సమస్యతో పాటు కంపెనీకి అవసరమైన అన్ని మౌలిక వసతులను సమకూర్చింది. తదనంతరం నాటి ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా టీసీఎల్ నిర్మాణ పనులకు 2019 సెప్టెంబర్ 27న భూమి పూజ నిర్వహించారు. ఇప్పుడు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించింది. సీఎం హోదాలో పిలిస్తే తప్పా..? టీసీఎల్ ప్రతినిధుల వినతి మేరకు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 2022 జూన్ 23న ప్రారంభించారు. కంపెనీ ఏపీలో ఏర్పాటైనందున రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడి, కల్పించిన ఉద్యోగాలను వెల్లడిస్తూ ప్రకటన ఇచ్చారు. వాస్తవాలు ఇలా ఉంటే భూమి ఇవ్వకుండా, నీటి వసతి కల్పించకుండా, ఇతర అనుమతులు మంజూరు చేయకుండా ఎన్నికల ప్రచారం కోసం ఊరి బయట తుప్పల మధ్య టెంకాయ కొట్టి నేను కంపెనీలు తెచ్చా.. నేనే కంపెనీలు తెచ్చా.. నేను ఉద్యోగాలిచ్చా.. నేనే ఉద్యోగాలు ఇచ్చా..? అంటూ టీడీపీ ప్రచారం చేసుకోవడంపై అంతా విస్తుపోతున్నారు. -
టీసీఎల్ ద్వారా 2వేల మందికి ఉపాధి లభిస్తోంది: సీఎం వైఎస్ జగన్
-
ఏ సమస్య వచ్చినా.. ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నాం: సీఎం జగన్
తిరుపతి: సన్నీ ఆప్కోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. మొబైల్ ఫోన్ కెమెరా లెన్స్‌ను సన్నీ ఆప్కోటెక్ తయారు చేస్తోంది. వివిధ రకాల మొబైల్ కంపెనీలకు కెమెరాలను ఆ సంస్థ సరఫరా చేయనుంది. రూ.254 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయగా, 3వేల మందికి ఉద్యోగ అవకాశం కలగనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ►ఈ క్లస్టర్లో మూడు ప్రాజెక్టులను ప్రారంభించాం ►మరో రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం ►టీసీఎల్ యూనిట్‌ను ప్రారంభించాం ►టీవీ ప్యానెళ్లు, మొబైల్ డిస్ప్లే ప్యానెళ్లు ఇక్కడ తయారుచేస్తారు ►3200 మందికి ఉపాధినిస్తున్నారు ►ట్రయల్‌రన్స్‌కూడా జరుగుతున్నాయి ►ఫాక్స్‌లింక్స్ అనే సంస్థ యూఎస్బీ కేబుళ్లు, సర్క్యూట్ బోర్డులను తయారు చేస్తోంది ►ఫ్యాక్టరీని పూర్తిచేసింది. మరో 2వేల మందికి ఉపాధిని కల్పిస్తోంది ►సన్నో ఒప్పోటెక్ సెల్ఫోన్లు కెమెరా లెన్స్‌లు తయారు చేస్తోంది ►ఈ ఫ్యాక్టరీ కూడా పూర్తయ్యింది ►1200 మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది ►నెలరోజులు తిరక్కముందే 6,400 మంది మన కళ్లముందే ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది ►శంకుస్థాపన మూడు ప్రాజెక్టులకు వేశాం ►ఇదే ఈఎంసీలో డిక్సన్ టెక్నాలజీస్ యూనిట్‌కు శంకుస్థాపన చేశాం ►నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఏడాది కాలంలో పూర్తవుతుంది. 850 మందికి ఉద్యోగాలు వస్తాయి ►ఫాక్స్‌లింక్ ఇండియా లిమిటెడ్ కంపెనీ మరో రూ.300 కోట్ల పెట్టుబడి పెడుతుంది ►ఏడాదిలో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తుంది ►ఈ ఈఎంసీకి రాకముందు అపాచీ సంస్థకు సంబంధించిన సంస్థకు రూ.800 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నారు ►15 నెలల్లో పూర్తవుతుంది. 10వేల మందికి ఉద్యోగా అవకాశాలు వస్తాయి ►ఇవాళ అన్నీ కలిపితే మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశాం ►మరో 3 ప్రాజెక్టులనుకూడా ప్రారంభించాం ►వీటి అన్నింటి ద్వారా దాదాపుగా రూ.4వేల కోట్ల పైచిలుకు పెట్టుబడి, దాదాపుగా రూ.20వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ►ఇక్కడ యూనిట్లు పెట్టిన వారందరికీ ఒక్కటి చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం మీతో ఉంది ►ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఒక్క ఫోన్‌కాల్ దూరంలో ఉన్నాం ►కచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించి.. మా రాష్ట్రంలో మీ ప్రయాణం అద్భుతంగా ఉండేలా చూస్తామని హామీ ఇస్తున్నాం. అందరికీ అభినందనలు అంటూ సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. -
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మరోసారి జట్టుకట్టిన టీసీఎల్..!
హైదరాబాద్: మన దేశంలో ఇండియన్ క్రికెట్ ఫీవర్ ఎంతగానో ప్రఖ్యాతి చెందింది. ప్రతీ గ్రాండ్ టోర్నమెంట్ సందర్భంగా అది బయట పడుతూనే ఉంటుంది. క్రికెట్'ను లైవ్'గా చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానులు టికెట్లు కొంటూనే ఉంటారు. వారికి మరెన్నో రెట్ల సంఖ్యలో అభిమానులు హై రిజల్యూషన్'లో ఈ ఆటను చూసేందుకు టీవీలకు అతుక్కుపోతారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా రెండు ప్రముఖ టీవీ బ్రాండ్లలో అగ్రగామి అయిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన టీసీఎల్ వరుసగా మూడోసారి సన్ రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) జట్టుతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ కాంట్రాక్టులో భాగంగా టీసీఎల్ బ్రాండ్ లోగో ఆటగాళ్ల జెర్సీపై కుడివైపున పై భాగంలో కనిపించనుంది. టీసీఎల్ అనేది వేగంగా వృద్ధి చెందుతున్న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్. 2021 మొదటి మూడు త్రైమాసికాల్లో సుమారుగా 30 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. 2022లో ఈ బ్రాండ్ డిస్ ప్లే సాంకేతికతలు, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా తన ఆర్ & డీ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టడాన్ని కొనసాగించనుంది. నూతన ఉత్పాదనలు ఆవిష్కరించడంపై, టీసీఎల్ ఉత్పాదన శ్రేణిని విస్తరించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. విస్తరణ వ్యూహంలో భాగంగా, అంతర్జాతీయ వ్యాపారాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడంలో భాగంగా ఈ బ్రాండ్ తన అతిపెద్ద ఓవర్ సీస్ ప్యానెల్ ఫ్యాక్టరీని ప్రకటించింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నెలకొంది. ఈ ఏడాది మే నాటికి ఎల్ఈడీ ప్యానెల్స్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. హై- ఆక్టేన్, లైఫ్ లైక్ క్రికెట్ వాచింగ్ అనుభూతిని అందించడాన్ని ఈ అంతర్జాతీయ టీవీ సంస్థ లక్ష్యంగా చేసుకుంది. దాంతో వీక్షకులు ఆన్ ఫీల్డ్ ఎమోషన్ లేదా బాల్ ఫ్లిక్'లలో ఏ ఒక్క దాన్ని కూడా మిస్ కాకుండా ఉంటారు. ఎస్ఆర్హెచ్'తో భాగస్వామ్యం కొనసాగింపులో భాగంగా టీసీఎల్ వినియోగదారులతో, క్రికెట్ కమ్యూనిటీతో తన అనుబంధాన్ని పటిష్ఠం చేసుకుంది. క్రీడల్లో తన ప్రగతిశీలక దృక్పథాన్ని సుస్థిరం చేసుకుంది. హైదరాబాద్ అనేది టీసీఎల్'కు భారీ మార్కెట్. టీసీఎల్, ఎస్ఆర్హెచ్ ఈ అనుబంధం టీసీఎల్ ఈ నగరంలో తన మూలాల్నిమరింత పటిష్ఠం చేసుకునేందుకు తోడ్పడుతుంది. ఈ సందర్భంగా టీసీఎల్ ఇండియా మార్కెటింగ్ హెడ్ విజయ్ కుమార్ మిక్కిలినేని మాట్లాడుతూ.. ‘‘ఎస్ఆర్హెచ్ జట్టు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంలో, శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడంలో, కఠోర పరిశ్రమ చేయడంలో, అత్యుత్తమ ఫలితాలను అందించడంలో కట్టుబాటును ప్రదర్శించడంలో నిలకడను కనబరుస్తోంది. ఈ ఏడాది ఎస్ఆర్హెచ్ భువనేశ్వర్ కుమార్, నికోలస్ పూరన్ వంటి యువ, డైనమిక్ ఆటగాళ్లను కలిగిఉంది. మరో ఐపీఎల్ టైటిల్ గెలుపొందాలన్న దాహార్తిని వారు తీర్చుకోగలుగుతారు. జట్టులో యువరక్తంతో పాటుగా అనుభవం కలిగిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. వారంతా కలసి భారతీయ క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించనున్నారు. ఎస్ఆర్హెచ్తో మా అనుబంధం క్రికెట్ పట్ల మాకు గల మక్కువను కొనసాగించేందుకు, వినియోగ దారులకు అత్యంత అధునాతన టీవీలను అందించేందుకు వీలు కల్పిస్తుంది. దాంతో వారు మ్యాచ్‌లో చోటు చేసుకునే ప్రతీ మూమెంట్'ను కూడా మిస్ కాకుండా ఉంటారు. హైదరాబాద్ మాకెంతో పెద్ద మార్కెట్. ఎస్ఆర్హెచ్ జట్టు ఎంతో బాగా ఆడుతుందని మేం విశ్వసిస్తున్నాం. అది మా పేరుప్రఖ్యాతులను క్రీడాభిమానుల్లో మాత్రమే గాకుండా, యావత్ నగర ప్రజానీకంలోనూ పెంచనుంది’’ అని అన్నారు. ఈ భాగస్వామ్యంపై సన్ రైజర్స్ సీఈఓ శ్రీ.కె.షణ్ముఖం మాట్లాడుతూ.. ‘‘మూడో ఏడాది టీసీఎల్ వంటి అంతర్జాతీయ బ్రాండ్'తో అనుబంధం మాకెంతో ఆనందాన్ని అందిస్తోంది. ఈ అనుబంధం అటు ఆ బ్రాండ్'కు, ఇటు ఎస్ఆర్హెచ్ జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. మేం మా భాగస్వామ్యాన్ని మరింత శక్తివంతం చేయదల్చుకున్నాం. ఒక బ్రాండ్'గా టీసీఎల్ తమ ఉత్పత్తులతో వినియోగదారులకు సంతృప్తిని అందించేందుకు గాను హద్దులు అధిగమించి మరీ ముందుకెళ్తున్నది’’ అని అన్నారు. టీవీ వీక్షణాన్ని మరింత నిజమైందిగా, ఎంగేజింగ్ దిగా చేసేందుకు టీసీఎల్ నిరంతరం వినూత్నతలను ఆవిష్క రిస్తూ, తన ఉత్పాదన శ్రేణిని బలోపేతం చేస్తోంది. టీసీఎల్ ఇటీవలే యాన్యువల్ కన్య్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్) లో పాల్గొంది. అత్యంత పలుచటి 8కె మినీఎల్ఈడీ టీవీ ప్రొటొటైప్ తో పాటుగా ఇతర క్యూఎల్ఈఢీ టీవీ లు, మొబైల్ ఉపకరణాలు, స్మార్ట్ హోమ్ అప్లియెన్సెస్ ను ప్రదర్శించింది. టీసీఎల్ టీవీ వీక్షణాన్ని మరీ ము ఖ్యంగా వేగంగా జరిగే క్రీడలు, మూవీలు చూడడాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. టీసీఎల్ టీవీలు వినియోగదారుల టీవీ వీక్షణ అనుభూతులను మెరుగుపరిచేందుకు సంచలనాత్మక వినూత్నతలను అందిస్తు న్నాయి. టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ గురించి: టీసీఎల్ ఎలక్ట్రానిక్స్(1070.HK) అనేది వేగంగా వృద్ధి చెందుతున్నఎలక్ట్రానిక్స్ కంపెనీ. ప్రపంచ టీవీ పరిశ్రమలో అగ్రగామి సంస్థ. 1981లో ప్రారంభించబడిన ఈ సంస్థ ఇప్పుడు అంతర్జాతీయంగా 160 మార్కెట్లలో కార్యకలాపా లు కొనసాగిస్తున్నది. ఒఎండిఐఏ ప్రకారం 2020 ఎల్ సిడి టీవీ షిప్ మెంట్'లో టీసీఎల్ రెండో స్థానం పొందింది. టీవీలు, ఆడియో, స్మార్ట్ హోమ్ అప్లియెన్సెస్ వంటి వినియోగదారు ఎలక్ట్రానిక్స్ ఉత్పాదనల పరిశోధన, అభివృద్ధి, తయారీలో టీసీఎల్ నైపుణ్యం సాధించింది. (చదవండి: అంబానీ మనవడా మజాకా.. 15 నెలలకే బడి బాట పట్టిన పృథ్వీ అంబానీ!) -
వీడియోకాలింగ్ ఫీచర్‌తో సరికొత్త టీవీలు: ధర ఎంతో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ టీసీఎల్ ఇండియాలో తొలి ఆండ్రాయిడ్ 11 టెలివిజన్ (టీవీ)ను విడుదల చేసింది. పీ725 హైఎండ్ టీవీ మోడల్లో వీడియో కాలింగ్ కెమెరా ఉండటం దీని ప్రత్యేకత. 43/50//55/65 ఇంచుల టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.41,990–89,990 మధ్య ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో టీసీఎల్ టీవీలు, ఏసీ ఉత్పత్తులు మాత్రమే లభ్యమవుతున్నాయి. వేసవికాలం నేపథ్యంలో సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్తగా బీ.ఐ.జీ కేర్ అండ్ యూవీసీ స్టెరిలైజేషన్ ప్రొ ఏసీ ‘ఒకారినా’ను కూడా విడుదల చేసింది. 1/1.5/2 టన్ల అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.33,990గా ఉంది. పీ725 టీవీని ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా ఇండియాలోనే విడుదల చేశామని, ఇందులో 65 ఇంచుల టీవీని కేవలం అమెజాన్‌లో విక్రయించనున్నట్లు టీసీఎల్ ఇండియా జీఎం మైక్ చెన్ తెలిపారు. అమెజాన్ఇండియా టెలివిజన్, కేటగిరీ లీడర్ గారిమా గుప్తా మాట్లాడుతూ తమ కస్టమర్ల కోసం వీడియో కాల్ కెమెరాతో టీసీఎల్ తొలి 4 కేహెచ్‌డీఆర్ టివిని తీసుకురావడం సంతోసంగాఉందన్నారు. కస్టమర్లకు ఉత్తమమైన నాణ్యమైన ఉత్పత్తులను నిరంతరం అందిస్తున్న టీసీఎల్‌తో భాగస్వామ్యంతో టెలివిజన్ విభాగంలో బలమైన పోర్ట్‌ఫోలియో తమసొంతమన్నారు. ఆండ్రాయిడ్ టీవీలు కొత్త శ్రేణి అధునాతన లక్షణాలతో కొత్త, టీవీ అనుభవాన్ని అందిస్తాయన్నారు. టీవీల ధరలు 43 అంగుళాలు టీవీ రూ. 41,990 50 అంగుళాల టీవీ ధర రూ. 56,990 55 అంగుళాల టీవీ రూ. 62,990 65 అంగుళాల టీవీ రూ. 89,990 -
టీసీఎల్ సూపర్ స్మార్ట్ టీవీలు : ధర
సాక్షి, ముంబై : చైనాకు చెందిన టెలివిజన్ తయారీదారు టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. 8 కే క్యూఎల్ఈడీ టీవీ 4 కే క్యూఎల్ఈడీ టీవీలను భారతదేశంలో ప్రవేశపెట్టింది. 8 కే క్యూఎల్ఈడీ 75 అంగుళాల ప్యానల్‌ను కలిగి ఉండగా, 4 కె క్యూఎల్ఈడీ టివి శ్రేణి ప్రీమియం, ఎంట్రీ లెవల్ కేటగిరీలో పలు స్క్రీన్ పరిమాణాలలోతీసుకొచ్చింది. వీటి ధరలు రూ .45,990 నుండి మొదలై 2,99,990 రూపాయల వరకు ఉన్నాయి. కొత్త టీవీలు హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ ఫీచర్ తో రావడం విశేషం. ఈ తాజా చేర్పులతో, ప్రీమియం స్మార్ట్ టీవీ విభాగంలో కొత్త మైలురాళ్లను సృష్టించనున్నామని టీసీఎల్ ఇండియా జనరల్ మేనేజర్ మైక్ చెన్ తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటి 8 కె క్యూఎల్ఈడీ టీవీని తొలిసారిగా తామే లాంచ్ చేస్తున్నామన్నారు. 75 అంగుళాల ఎక్స్915 8 కె క్యూఎల్డి ఆండ్రాయిడ్ టీవీలో ఐమాక్స్ పాప్-అప్ కెమెరా, డాల్బీ విజన్ అల్ట్రా-వివిడ్ ఇమేజింగ్, డాల్బీ అట్మోస్ ఆడియో, ఏఐ ఆధారిత 8కే ప్రాసెసర్ లాంటి మెరుగైన ఫీచర్లను ఈ టీవీలలో అందిస్తామని తెలిపారు. 8 కె క్యూఎల్ఈడీ 75 ఎక్స్ 915 ధర 2,99,990 రూపాయలు. 4 కె క్యూఎల్ఈడీ టీవీ : సీ 815, సీ 715 క్వాంటం డాట్ డిస్ ప్లే టెక్నాలజీ ప్రధాన ఆకర్షణ. సీ 815 4 కె క్యూఎల్టీవీ ప్రారంభ ధర 69,990 రూపాయలు. ఇవి 55, 65, 75 అంగుళాలల్లో లభ్యం సీ 715 ఎంట్రీ లెవల్ 4 కె క్యూఎల్ఈడీ టీవీ ధర 45,990 రూపాయలు. 50, 55 65 అంగుళాలలో లభిస్తుంది. 'మేక్ ఇన్ ఇండియా' చొరవలో భాగంగా ఎలక్ట్రానిక్స్ తిరుపతిలో 2,400 కోట్ల రూపాయల విలువైన తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ సంవత్సరానికి 8 మిలియన్ల 22-55 అంగుళాల టీవీ స్క్రీన్లను, 30 మిలియన్ల 3.5-8 అంగుళాల మొబైల్ స్క్రీన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉందనీ, ఇదే అతిపెద్ద ఉత్పాదక యూనిట్ అని పేర్కొంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 8వేల మందికి పైగా ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారని టీసీఎల్ వెల్లడించింది. -
త్వరలో పెళ్లి.. ఇంతలో చైనాకు వెళ్లి
బండిఆత్మకూరు/కోవెలకుంట్ల/మహానంది: కర్నూలు జిల్లాకు చెందిన అన్నెం జ్యోతి చైనాలోని వుహాన్‌లో చిక్కుకుపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో పాటు వచ్చే నెలలో ఆమె వివాహం ఉండడంతో వారి ఆందోళన రెట్టింపవుతోంది. కోవెలకుంట్ల మండలం బిజినవేములకు చెందిన జ్యోతి తల్లి ప్రమీల, తండ్రి అన్నెం మహేశ్వరరెడ్డి. తండ్రి నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో మృతిచెందారు. బీటెక్ పూర్తిచేసిన జ్యోతి టీసీఎల్‌లో ఉద్యోగం సాధించి శిక్షణ నిమిత్తం గత ఆగస్టు 23న 58 మంది కంపెనీ ఉద్యోగులతో కలిసి వుహాన్‌కు వెళ్లారు. అక్కడ ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభించడంతో.. అక్కడి భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జ్యోతి, ఆమె సహచరులు వుహాన్‌లోని విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. జ్యోతితో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో యువకుడికి జ్వరం కొంత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఈ కారణంగా వారిని ఇండియాకు పంపేందుకు నిరాకరించారు. తాను పడుతున్న అవస్థలను జ్యోతి వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఇప్పటికే జ్యోతి కుటుంబ సభ్యులు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డిలను కలిసి సమస్యను వివరించారు. వారు ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆదివారం ప్రమీలకు ఫోన్ చేసి.. త్వరలోనే దేశానికి వస్తుందని ధైర్యం చెప్పారు. జ్యోతికి మహానంది మండలం తమడపల్లెకు చెందిన అమర్నాథరెడ్డితో ఇటీవల వివాహ నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెలలో వివాహం. జ్యోతిని త్వరగా దేశానికి రప్పించాలని ప్రమీల, అమర్నాథరెడ్డి మీడియా ద్వారా అధికారులకు విజ్ఞప్తి చేశారు. (చదవండి: కరోనా డేంజర్ బెల్స్) -
14న పెళ్లి, వుహాన్‌లో చిక్కుకున్న కర్నూలు యువతి
వుహాన్ : కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈర్లపాడుకు చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ అన్నెం శృతి వుహాన్ నగరంలో చిక్కుకుంది. టీసీఎల్ ఉద్యోగి అయిన ఆమె మూడు నెలల శిక్షణ కోసం సహచరులు 58 మందితో కలిసి చైనా వెళ్లింది. ప్రస్తుతం ఆమె జ్వరంతో బాధపడుతుండటంతో అక్కడి అధికారులు కూడా శృతిని పంపేందుకు ఒప్పుకోవడం లేదు. ఇటీవలే ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఆమె వివాహం ఈ నెల 14న నంద్యాలలో జరగాల్సి ఉంది. శిక్షణ కోసం వూహాన్‌కు వెళ్లిన 58 మందిలో ఇద్దరు అక్కడే నిలిచిపోయారు. కరోనా ముందు ఏ ప్రేమైనా భారమే.. రోడ్లపైకి తోసేస్తున్నారు..!) అయితే తనకు కరోనా వైరస్ లక్షణాలు లేవని, అధికారులు తనను విమానం ఎక్కేందుకు అనుమతి ఇవ్వలేదంటూ తల్లికి పంపిన వీడియో క్లిప్‌లో శృతి తన బాధను వ్యక్తం చేసింది. ఈ వీడియో చూసిన శృతి తల్లి ప్రమీలా దేవి తన కూతురును ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు తమ కుమార్తెను వూహాన్ నుంచి రప్పించేందుకు చొరవ చూపించాలని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని శృతి తల్లిదండ్రులు కలవనున్నారు. నంద్యాలలో ఈ నెల 14న తమ కుమార్తె వివాహం జరగనుందని, ఆమెను వూహాస్ నుంచి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించాలని విజ్ఞప్తి చేయనున్నారు. (జీజీహెచ్‌లో కరోనా కలకలం) ఇక ఇప్పటికే చైనాలో కరోనా వైరస్‌తో 400 మందికి పైగా చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా చైనాలో ఉన్న 324 మంది భారతీయులను శనివారం ఉదయం విమానంలో దేశానికి రప్పించిన సంగతి తెలిసిందే. వీరిలో 96 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. దీంతో మిగతావారిని చైనా నుంచి స్వదేశంకు తీసుకువచ్చేందుకు వెళ్లిన మరో విమానంలో శృతిని అధికారులు అనుమతించలేదు. అలాగే ఆదివారం ఉదయం రెండో విమానం ద్వారా 323మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు.స్వదేశానికి తిరిగివచ్చిన భారతీయులను రెండు వారాల పాటు వైద్య పర్యవేక్షణలో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. (వుహాన్ నుంచి భారత్‌కు..) -
వదంతులు నమ్మవద్దు: తెలుగు ఇంజనీర్లు
-
వదంతులు నమ్మవద్దు: తెలుగు ఇంజనీర్లు
సాక్షి, చిత్తూరు : ప్రాణాంతక కరోనా వైరస్ చైనాలో విజృంభిస్తున్న వేళ వుహాన్‌లో చిక్కుకున్న 58 మంది తెలుగు ఇంజనీర్ల పరిస్థితిపై సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. తమ పిల్లల ఎలా ఉన్నారో అని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చైనాలో చిక్కుకున్న తెలుగు ఇంజనీర్లు క్షేమంగానే ఉన్నట్టు టీసీఎల్ హెచ్ఆర్ ఆపరేషన్స్ ప్రతినిధి రఘు తెలిపారు. ఇంజనీర్ల తల్లిదండ్రులు ఆందోలన చెందాల్సిన అవసరం లేదన్నారు. వుహాన్‌లో చైనా ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు వారిని అక్కడి నుంచి వెంటనే భారత్‌కు తీసుకురాలేకపోతున్నామని చెప్పారు. బీజింగ్‌లోని భారత ఎంబసీ అధికారులతో మాట్లాడామని వీలైనంత త్వరగా వారిని ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మరోవైపు తాము క్షేమంగానే ఉన్నామని.. వదంతులు నమ్మవద్దని చైనాలో చిక్కుకున్న ఇంజనీర్లు కోరారు. గురువారం రఘు మీడియాతో మాట్లాడుతూ.. ‘టీసీఎల్ తరఫున చైనాలో 89 మంది పనిచేస్తున్నారు. వారిలో 58 మంది వుహాన్‌లో, 17 మంది షెన్జెన్లో ఉంటున్నారు. 14 మంది గతేడాది నవంబర్లోనే ఇండియాకు తిరిగివచ్చారు. షెన్జెన్లో ఉంటున్న 17 మంది ప్రస్తుతం ఇండియాకు బయలుదేరారు. తెలుగు ఇంజనీర్లను ఇండియాకు తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. కంపెనీ తరఫున వారికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశాం. వారిని హౌస్ అరెస్ట్ చేశామనడం అవాస్తవం. బయటకు వస్తే వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో రూమ్‌ల్లో ఉంచి షిఫ్టులవారీగా టెంపరెచర్ చెక్ చేస్తున్నాం. ఇంజనీర్లను తరలించేందుకు ఎంబసీ అధికారులతో మా కంపెనీ ప్రతినిధులు మాట్లాడారు. బీజింగ్‌లోని ఎంబసీ అధికారులు అనికేత్ అనే వ్యక్తిని మాకు అపాయింట్ చేశారు. రేపు వుహాన్‌లో ఉన్న ఇంజనీర్లకు టోకెన్లు కేటాయిస్తారు. ఆ తర్వాత వారి ప్రయాణానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తారు. ఇంజనీర్ల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కంపెనీ తరఫున వారికి పూర్తి సాకారం అందజేస్తున్నామ’ని తెలిపారు.(చదవండి : భారత్‌లోకి ప్రవేశించిన ‘కరోనా’) వుహాన్‌లో చిక్కుకున్న తెలుగు ఇంజనీర్లు మాట్లాడుతూ..‘తాము చైనాలో క్షేమంగానే ఉన్నాం. మేము పనిచేస్తున్న కంపెనీ బాగానే చూసుకుంటోంది. రోజు వైద్య పరీక్షలు చేయడంతోపాటు.. మూడు పూటలు ఆహారం అందజేస్తున్నారు. మేము గృహ నిర్భందంలో ఉన్నామనేది అవాస్తవం. వదంతులు నమ్మవద్దు. బీజింగ్‌లోని భారత ఎంబసీతో మాట్లాడాం. త్వరలోనే భారత్‌కు వస్తాం’ అని చెప్పారు. (చదవండి: హైదరాబాద్‌లో ‘కరోనా’ కలకలం..) -
రూ.30 వేల కోట్లతో ఉక్కు ఫ్యాక్టరీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ కంపెనీలు ముందుకొస్తున్నాయి. అంతర్జాతీయంగా పేరుపొందిన కొరియాకు చెందిన పోస్కో స్టీల్ కంపెనీ, జపాన్‌కు చెందిన ఏటీజీ టైర్ల కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. సుమారు రూ.30,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఐఎన్ఎల్ (విశాఖ స్టీల్)తో కలిపి ఏర్పాటు చేయడానికి పోస్కో ఆసక్తి చూపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం ఆయన నివాసంలో కలిసిన పోస్కో కంపెనీ ప్రతినిధులు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను తెలియచేశారు. పోస్కో ఇండియా చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గిల్హో బాంగ్, పోస్కో మహారాష్ట్ర సీఎఫ్‌వో గూ యంగ్ అన్లతో పాటు పోస్కో సీనియర్ ప్రతినిధులు సీఎంను కలసిన వారిలో ఉన్నారు. ఇప్పటికే విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉన్నందున వైఎస్సార్ జిల్లాలో కర్మాగారం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని కోరారు. దీనికి అంగీకరించిన పోస్కో ప్రతినిధులు కడపలో కర్మాగారం ఏర్పాటు సాధాసాధ్యాలపై మూడు నెలల్లో నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా సుమారు 6,000 మందికి ఉపాధి లభించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వివరించారు. సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ, పరిశ్రమల శాఖ కమిషనర్ సిదార్థ జైన్ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో ఏటీజీ టైర్ల కంపెనీ! విశాఖ జిల్లా అచ్యుతాపురం సమీపంలో సుమారు రూ.1,600 కోట్లతో భారీ టైర్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు జపాన్‌కు చెందిన అలయన్స్ టైర్ గ్రూపు (ఏటీజీ) ఆసక్తి కనపరుస్తోంది. సుమారు 100–125 ఎకరాల్లో అచ్యుతాపురం సెజ్‌లో దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందచేసింది. వ్యవసాయ, నిర్మాణ రంగ యంత్రాలకు వినియోగించే భారీ టైర్లను ఏటీజీ తయారు చేస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఒక యూనిట్ ఉండగా విశాఖ వద్ద మరో యూనిట్ ఏర్పాటు చేయడానికి కంపెనీ ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనలు పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. టీసీఎల్ సమస్యలను తక్షణం పరిష్కరించాలి: సీఎం చిత్తూరు జిల్లాలో టీవీ ప్యానల్ యూనిట్ ఏర్పాటు చేసిన చైనాకు చెందిన ఎలక్ట్రానికి సంస్థ టీసీఎల్ కంపెనీ ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. సుమారు రూ.2,200 కోట్లతో 153 ఎకరాల్లో డిస్ప్లే ప్యానల్ యూనిట్‌కు గత డిసెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అయితే భూమి, నీటి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయినట్లు టీసీఎల్ ఇండస్ట్రియల్ హోల్డింగ్స్ సీఈవో కెవిన్ వాంగ్, టీటీఈ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ అలెన్ చెన్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సూపర్ ప్రోయాక్టివ్ క్లియరెన్స్ కింద అన్ని ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేయాలని, టీసీఎల్ సమస్యలను పరిష్కరించి త్వరగా పనులు మొదలయ్యేలా చూడాలని పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ శాఖల అధికారులను ఆదేశించారు. కంపెనీలకు అనుమతుల మంజూరులో అవినీతికి తావు ఉండకూడదని, ఉద్దేశపూర్వకంగా అనుమతులు ఆపినట్లు తెలిస్తే ఎంత స్థాయి రాజకీయ నాయకుడైనా, అధికారి అయినా క్షమించే ప్రశ్నే లేదని సీఎం స్పష్టం చేశారు. ఎంత మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి? రాష్ట్రానికి ఆర్థికంగా ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందనే అంశాల ఆధారంగా ఆయా కంపెనీలకు రాయితీలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. -
ఫలితాలు, గణాంకాలు కీలకం!
ముంబై: ఐటీ కంపెనీల బోణీతో ఈ ఏడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్) ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. టీసీఎల్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ కార్పొరేషన్ వంటి ప్రధాన సంస్థల ఫలితాలకు తోడు.. పలు జాతీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక అంశాలు ఈవారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ గురువారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుండగా.. ఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా జరిగిన 31వ సమావేశంలో పలు వస్తు, సేవలపై జీఎస్టీ రేటును కౌన్సిల్ తగ్గించిన నేపథ్యంలో ఈసారి సమావేశంపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. ఇక శుక్రవారం వెలువడే పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలపై కూడా ఇన్వెస్టర్లు కన్నేసివుంచారు. వీటితో పాటు ముడిచమురు, రూపాయి కదలికలు మార్కెట్ ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నాయని భావిస్తున్నారు. ఒడిదుడుకులకు అవకాశం.. ‘కార్పొరేట్ ఫలితాల అంశం కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగేందుకు అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనుండగా.. ఇక్కడ నుంచి అందే సంకేతాలు, క్రూడ్ ధరల కదలికలు, రూపాయి మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయి.’ అని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అన్నారు. ‘ప్రీమియం వాల్యుయేషన్, దేశీయ ఆర్థిక వ్యవస్థలో మందగమనం.. పట్టణ, గ్రామీణ మార్కెట్లలో కొనసాగుతున్న ద్రవ్య లభ్యత కారణంగా వచ్చే త్రైమాసికాల్లో కంపెనీల ఆదాయంలో వృద్ధి నెమ్మదించే అవకాశం ఉంది. ఇక సాధారణ ఎన్నికలు సమీస్తున్నాయి. ఈ అంశాలను బేరీజు వేసుకుని చూస్తే ఇంకొంతకాలం మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని అంచనావేస్తున్నాం.’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. ఎపిక్ రీసెర్చ్ సీఈవో ముస్తఫా నదీమ్ సైతం ఒడిదుడుకులు కొనసాగేందుకే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సమాచారం అనంతరం ఇందుకు ఆస్కారం అధికంగా ఉండగా.. ఈ డేటా వెల్లడి తరువాత మార్కెట్‌కు ఒక దిశా నిర్దేశం కానుందన్నారు. దేశీ ఆర్థిక అంశాల్లో ఐఐపీ ఈవారంలో కీలకంగా ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషకులు వీ కే శర్మ అన్నారు. అమెరికా–చైనాల చర్చ.. ఈనెల 7–8 తేదీల్లో ఇరు దేశాల ప్రతినిధులు బీజింగ్‌లో సమావేశంకానున్నారు. గతేడాదిలో చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్నులు పెంచడం వల్ల ఆర్థిక వ్యవస్థలో వాణిజ్య యుద్ధం మొదలుకాగా, ఆ తరువాత ఇరు దేశాలు రాజీ ధోరణి ప్రదర్శించినప్పటికీ.. ఏ క్షణంలో ఎటువంటి వార్తలు వెలువడుతాయో అనే ఆందోళన మార్కెట్ వర్గాల్లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే యూఎస్–చైనా ప్రతినిధుల చర్చ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈవారంలో మార్కెట్‌ను ప్రభావితం చేయదగిన అంతర్జాతీయ అంశాల్లో.. డిసెంబర్ అమెరికా పేరోల్ రిపోర్ట్, ఆ దేశం ద్రవ్యోల్బణం, తయారీయేతర పీఎంఐ డేటాలు ఉన్నాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ.83,000 కోట్లు గతేడాదిలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) దేశీ మార్కెట్ నుంచి రూ.83,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. రూ.33,553 కోట్లను ఈక్విటీ మార్కెట్ నుంచి.. రూ.49,593 కోట్లను డెట్ మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. వడ్డీ రేట్ల పెంపు, క్రూడ్ ధరల పెరుగుదల, రూపాయి పతనంతో 2018లో ఈస్థాయి పెట్టుబడుల ఉపసంహరణ జరిగిందని ఫండ్స్ఇండియా డాట్ కామ్ మ్యూచువల్ ఫండ్ రీసెర్చ్ హెడ్ విద్యా బాల అన్నారు. -
టీసీఎల్ ఐరిస్ స్కానర్ మొబైల్ @రూ.7,999
న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉన్న చైనాకు చెందిన టీసీఎల్ భారత స్మార్ట్‌ఫోన్ విపణిలోకి ప్రవేశించింది. ముందుగా టీసీఎల్-560 మోడల్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఐరిస్ స్కానర్ ఫీచర్ దీని ప్రత్యేకత. ధర రూ.7,999. అమెజాన్ ద్వారా మాత్రమే కంపెనీ ఈ మోడల్‌ను భారత్‌లో విక్రయిస్తోంది. 5.5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1.1 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగెన్ 210 ప్రాసెసర్, ఆన్‌డ్రాయిడ్ 6.0 ఓఎస్‌తో రూపొందించారు. ఎల్ఈడీ ఫ్లాష్‌తో 8 ఎంపీ ఆటోఫోకస్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ తదితర సదుపాయాలు ఉన్నాయి. 4జీ స్మార్ట్‌ఫోన్ విభాగంలో 2018 నాటికి 10 శాతం వాటాను కైవసం చేసుకుంటామని కంపెనీ ఇండియా డెరైక్టర్ ప్రవీణ్ వలేచా మొబైల్ ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించారు. టీసీఎల్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఆల్కటెల్ వన్‌టచ్ ఇప్పటికే భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. టీసీఎల్ బ్రాండ్ నుంచి కేవలం 4జీ స్మార్ట్ఫోన్లు ప్రవేశపెడతామని ఆయన అన్నారు.