సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మరోసారి జట్టుకట్టిన టీసీఎల్..! | TCL Partners With Sunrisers Hyderabad For The Third Time in a Row | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మరోసారి జట్టుకట్టిన టీసీఎల్..!

Published Mon, Mar 21 2022 8:00 PM | Last Updated on Mon, Mar 21 2022 8:00 PM

TCL Partners With Sunrisers Hyderabad For The Third Time in a Row - Sakshi

హైదరాబాద్: మన దేశంలో ఇండియన్ క్రికెట్ ఫీవర్ ఎంతగానో ప్రఖ్యాతి చెందింది. ప్రతీ గ్రాండ్ టోర్నమెంట్ సందర్భంగా అది బయట పడుతూనే ఉంటుంది. క్రికెట్'ను లైవ్'గా చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానులు టికెట్లు కొంటూనే ఉంటారు. వారికి మరెన్నో రెట్ల సంఖ్యలో అభిమానులు హై రిజల్యూషన్'లో ఈ ఆటను చూసేందుకు టీవీలకు అతుక్కుపోతారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా రెండు ప్రముఖ టీవీ బ్రాండ్లలో అగ్రగామి అయిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన టీసీఎల్ వరుసగా మూడోసారి సన్ రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) జట్టుతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. 

ఈ కాంట్రాక్టులో భాగంగా టీసీఎల్ బ్రాండ్ లోగో ఆటగాళ్ల జెర్సీపై కుడివైపున పై భాగంలో కనిపించనుంది. టీసీఎల్ అనేది వేగంగా వృద్ధి చెందుతున్న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్. 2021 మొదటి మూడు త్రైమాసికాల్లో సుమారుగా 30 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. 2022లో ఈ బ్రాండ్ డిస్ ప్లే సాంకేతికతలు, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా తన ఆర్ & డీ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టడాన్ని కొనసాగించనుంది. నూతన ఉత్పాదనలు ఆవిష్కరించడంపై, టీసీఎల్ ఉత్పాదన శ్రేణిని విస్తరించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. 

విస్తరణ వ్యూహంలో భాగంగా, అంతర్జాతీయ వ్యాపారాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడంలో భాగంగా ఈ బ్రాండ్ తన అతిపెద్ద ఓవర్ సీస్ ప్యానెల్ ఫ్యాక్టరీని ప్రకటించింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నెలకొంది. ఈ ఏడాది మే నాటికి ఎల్ఈడీ ప్యానెల్స్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. హై- ఆక్టేన్, లైఫ్ లైక్ క్రికెట్ వాచింగ్ అనుభూతిని అందించడాన్ని ఈ అంతర్జాతీయ టీవీ సంస్థ లక్ష్యంగా చేసుకుంది. దాంతో వీక్షకులు ఆన్ ఫీల్డ్ ఎమోషన్ లేదా బాల్ ఫ్లిక్'లలో ఏ ఒక్క దాన్ని కూడా మిస్ కాకుండా ఉంటారు. ఎస్‌ఆర్‌హెచ్'తో భాగస్వామ్యం కొనసాగింపులో భాగంగా టీసీఎల్ వినియోగదారులతో, క్రికెట్ కమ్యూనిటీతో తన అనుబంధాన్ని పటిష్ఠం చేసుకుంది. క్రీడల్లో తన ప్రగతిశీలక దృక్పథాన్ని సుస్థిరం చేసుకుంది. హైదరాబాద్ అనేది టీసీఎల్'కు భారీ మార్కెట్. టీసీఎల్, ఎస్‌ఆర్‌హెచ్ ఈ అనుబంధం టీసీఎల్ ఈ నగరంలో తన మూలాల్నిమరింత పటిష్ఠం చేసుకునేందుకు తోడ్పడుతుంది. 

ఈ సందర్భంగా టీసీఎల్ ఇండియా మార్కెటింగ్ హెడ్ విజయ్ కుమార్ మిక్కిలినేని మాట్లాడుతూ.. ‘‘ఎస్‌ఆర్‌హెచ్ జట్టు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంలో, శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడంలో, కఠోర పరిశ్రమ చేయడంలో, అత్యుత్తమ ఫలితాలను అందించడంలో కట్టుబాటును ప్రదర్శించడంలో నిలకడను కనబరుస్తోంది. ఈ ఏడాది ఎస్‌ఆర్‌హెచ్ భువనేశ్వర్ కుమార్, నికోలస్ పూరన్ వంటి యువ, డైనమిక్ ఆటగాళ్లను కలిగిఉంది. మరో ఐపీఎల్ టైటిల్ గెలుపొందాలన్న దాహార్తిని వారు తీర్చుకోగలుగుతారు. జట్టులో యువరక్తంతో పాటుగా అనుభవం కలిగిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. వారంతా కలసి భారతీయ క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించనున్నారు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మా అనుబంధం క్రికెట్ పట్ల మాకు గల మక్కువను కొనసాగించేందుకు, వినియోగ దారులకు అత్యంత అధునాతన టీవీలను అందించేందుకు వీలు కల్పిస్తుంది. దాంతో వారు మ్యాచ్‌లో చోటు చేసుకునే ప్రతీ మూమెంట్'ను కూడా మిస్ కాకుండా ఉంటారు. హైదరాబాద్ మాకెంతో పెద్ద మార్కెట్. ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు ఎంతో బాగా ఆడుతుందని మేం విశ్వసిస్తున్నాం. అది మా పేరుప్రఖ్యాతులను క్రీడాభిమానుల్లో మాత్రమే గాకుండా, యావత్ నగర ప్రజానీకంలోనూ పెంచనుంది’’ అని అన్నారు. 

ఈ భాగస్వామ్యంపై సన్ రైజర్స్ సీఈఓ శ్రీ.కె.షణ్ముఖం మాట్లాడుతూ.. ‘‘మూడో ఏడాది టీసీఎల్ వంటి అంతర్జాతీయ బ్రాండ్'తో అనుబంధం మాకెంతో ఆనందాన్ని అందిస్తోంది. ఈ అనుబంధం అటు ఆ బ్రాండ్'కు, ఇటు ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. మేం మా భాగస్వామ్యాన్ని మరింత శక్తివంతం చేయదల్చుకున్నాం. ఒక బ్రాండ్'గా టీసీఎల్ తమ ఉత్పత్తులతో వినియోగదారులకు సంతృప్తిని అందించేందుకు గాను హద్దులు అధిగమించి మరీ ముందుకెళ్తున్నది’’ అని అన్నారు.

టీవీ వీక్షణాన్ని మరింత నిజమైందిగా, ఎంగేజింగ్ దిగా చేసేందుకు టీసీఎల్ నిరంతరం వినూత్నతలను ఆవిష్క రిస్తూ, తన ఉత్పాదన శ్రేణిని బలోపేతం చేస్తోంది. టీసీఎల్ ఇటీవలే యాన్యువల్ కన్య్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్) లో పాల్గొంది. అత్యంత పలుచటి 8కె మినీఎల్ఈడీ టీవీ ప్రొటొటైప్ తో పాటుగా ఇతర క్యూఎల్ఈఢీ టీవీ లు, మొబైల్ ఉపకరణాలు, స్మార్ట్ హోమ్ అప్లియెన్సెస్ ను ప్రదర్శించింది. టీసీఎల్ టీవీ వీక్షణాన్ని మరీ ము ఖ్యంగా వేగంగా జరిగే క్రీడలు, మూవీలు చూడడాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. టీసీఎల్ టీవీలు వినియోగదారుల టీవీ వీక్షణ అనుభూతులను మెరుగుపరిచేందుకు సంచలనాత్మక వినూత్నతలను అందిస్తు న్నాయి. 

టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ గురించి: 
టీసీఎల్ ఎలక్ట్రానిక్స్(1070.HK) అనేది వేగంగా వృద్ధి చెందుతున్నఎలక్ట్రానిక్స్ కంపెనీ. ప్రపంచ టీవీ పరిశ్రమలో అగ్రగామి సంస్థ. 1981లో ప్రారంభించబడిన ఈ సంస్థ ఇప్పుడు అంతర్జాతీయంగా 160 మార్కెట్లలో కార్యకలాపా లు కొనసాగిస్తున్నది. ఒఎండిఐఏ ప్రకారం 2020 ఎల్ సిడి టీవీ షిప్ మెంట్'లో టీసీఎల్ రెండో స్థానం పొందింది. టీవీలు, ఆడియో, స్మార్ట్ హోమ్ అప్లియెన్సెస్ వంటి వినియోగదారు ఎలక్ట్రానిక్స్ ఉత్పాదనల పరిశోధన, అభివృద్ధి, తయారీలో టీసీఎల్ నైపుణ్యం సాధించింది.

(చదవండి: అంబానీ మనవడా మజాకా.. 15 నెలలకే బడి బాట పట్టిన పృథ్వీ అంబానీ!)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement