సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ టీసీఎల్ ఇండియాలో తొలి ఆండ్రాయిడ్ 11 టెలివిజన్ (టీవీ)ను విడుదల చేసింది. పీ725 హైఎండ్ టీవీ మోడల్‌లో వీడియో కాలింగ్ కెమెరా ఉండటం దీని ప్రత్యేకత. 43/50//55/65 ఇంచుల టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.41,990–89,990 మధ్య ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో టీసీఎల్ టీవీలు, ఏసీ ఉత్పత్తులు మాత్రమే లభ్యమవుతున్నాయి. వేసవికాలం నేపథ్యంలో సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్తగా బీ.ఐ.జీ కేర్ అండ్ యూవీసీ స్టెరిలైజేషన్ ప్రొ ఏసీ ‘ఒకారినా’ను కూడా విడుదల చేసింది. 1/1.5/2 టన్‌ల అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.33,990గా ఉంది.
పీ725 టీవీని ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా ఇండియాలోనే విడుదల చేశామని, ఇందులో 65 ఇంచుల టీవీని కేవలం అమెజాన్‌లో విక్రయించనున్నట్లు టీసీఎల్ ఇండియా జీఎం మైక్ చెన్ తెలిపారు. అమెజాన్ఇండియా టెలివిజన్, కేటగిరీ లీడర్ గారిమా గుప్తా మాట్లాడుతూ తమ కస్టమర్ల కోసం వీడియో కాల్ కెమెరాతో టీసీఎల్ తొలి 4 కేహెచ్‌డీఆర్ టివిని తీసుకురావడం సంతోసంగాఉందన్నారు. కస్టమర్లకు ఉత్తమమైన నాణ్యమైన ఉత్పత్తులను నిరంతరం అందిస్తున్న టీసీఎల్‌తో భాగస్వామ్యంతో టెలివిజన్ విభాగంలో బలమైన పోర్ట్‌ఫోలియో తమసొంతమన్నారు. ఆండ్రాయిడ్ టీవీలు కొత్త శ్రేణి అధునాతన లక్షణాలతో కొత్త, టీవీ అనుభవాన్ని అందిస్తాయన్నారు.
టీవీల ధరలు
43 అంగుళాలు టీవీ రూ. 41,990
50 అంగుళాల టీవీ ధర రూ. 56,990
55 అంగుళాల టీవీ రూ. 62,990
65 అంగుళాల టీవీ రూ. 89,990
Comments
Please login to add a commentAdd a comment