సాక్షి, న్యూఢిల్లీ: ఐటెల్ సంస్థ అద్భుత ఫీచర్లు, అతి తక్కువ ధరలో కొత్త ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రధానంగా కరోనా సంక్షోభ సమయంలో బాడీ టెంపరేచర్‌ను గుర్తించాల్సిన అవసరాన్ని గుర్తించిన తాము ఈ ఫోన్‌ను తీసుకొచ్చామని కంపెనీ వెల్లడించింది. ఐటీ2192టీ థర్మో ఎడిషన్ పేరుతో ఐటెల్ దీన్ని ఆవిష్కరించింది. దీని ధరను కేవలం . రూ .1,049గా నిర్ణయించింది. ఇన్‌బిల్ట్ టెంపరేచర్ సెన్సర్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను మానిటర్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. కోవిడ్ -19 నుండి సురక్షితంగా ఉండటానికి ముందస్తు చర్యగా యూజర్ల శరీర ఉష్ణోగ్రతను ట్రాక్ చేసేలా ఎంట్రీ లెవల్ విభాగంలో దేశంలోనే తొలి ఫీచర్ ఫోన్‌గా ఇది నిలిచింది. అలాగే టెక్స్ట్-టు-స్పీచ్ ఫీచర్ ఇందులోని మరో విశేషం. తెలుగుతోపాటు ఎనిమిది భాషలకు ఇది సపోర్ట్ చేస్తుంది.
యూజర్లు టెంపరేచర్‌ను గుర్తించేలా ఫోన్‌లో థర్మో సెన్సార్ ను పొందుపర్చింది. థర్మో బటన్‌ను ఎక్కువసేపు నొక్కి ఉంచితే టెంపరేచర్‌ను రీడ్ చేస్తుంది. సెన్సార్‌ను అరచేతిలో ఉంచుకోవడం లేదా సెన్సార్‌పై టచ్ ఫింగర్‌ను ఉంచితే సెల్సియస్‌లో టెంపరేచర్‌ను చూపిస్తుంది. దీన్ని ఫారెన్‌హీట్‌గా కూడా మార్చుకోవచ్చు. అంతేకాదు టెక్స్ట్-టు-స్పీచ్ ఫీచర్ ద్వారా ఇన్‌కమింగ్ కాల్‌లు, సందేశాలు, మెనూ వివరాలు మాత్రమే కాకుండా బాడీ టెంపరేచర్ వివరాలను కూడా వినిపిస్తుంది. ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ, గుజరాతీ భాషల్లో దీన్ని వినవచ్చు.
ఇతర ఫీచర్లను పరిశీలిస్తే
4.5 సెం.మీ డిస్‌ప్లే, 1,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చింది. ఇది సూపర్ బ్యాటరీ మోడ్‌తో 4 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఈ కీప్యాడ్ ఫీచర్ ఫోన్‌లో వెనుక కెమెరా, రికార్డింగ్ ఆప్షన్‌తో వైర్‌లెస్ ఎఫ్‌ఎం, ఆటో కాల్ రికార్డర్, ఎల్‌ఈడీ టార్చ్, వన్-టచ్ మ్యూట్ , ప్రీ-లోడెడ్ గేమ్స్ఉన్నాయి. వినియోగదారుల ఆరోగ్యం, వినోదం అనే రెండు లక్ష్యాలతో సమాజానికి ఎక్కువ బాధ్యత వహించేలా ఎంట్రీ లెవల్‌లో అతి తక్కువ ధరలో ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేశామని ఐటెల్ సీఈఓ తలపాత్రా చెప్పారు
Comments
Please login to add a commentAdd a comment