monitor
-
పసికందులు ఎందుకు ఏడుస్తున్నారో ఠక్కున చెప్పేసే డివైజ్!
ఇంకా మాటలు రాని వయసులో కేరింతలు, ఏడుపులు మాత్రమే పసికందుల భాష. పసిపిల్లలు సంతోషంగా ఉన్నప్పుడు బోసినవ్వులొలికిస్తూ కేరింతలు కొడతారు. ఆకలేసినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు ఏడుస్తారు. పసిపిల్లల ఏడుపును అర్థం చేసుకోవడం ఒక్కోసారి కష్టంగా ఉంటుంది. ఆకలితోనే ఏడుస్తున్నారా, మరే కారణం వల్ల ఏడుస్తున్నారా తెలుసుకోవడం అంత సులువు కాదు. గుక్కతిప్పుకోకుండా ఏడ్చే పసిపిల్లలతో తల్లులు నానా తంటాలు పడుతుంటారు. పసిపిల్లలు ఏడ్చేటప్పుడు ఇకపై అంతగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఇదిగో ఈ బుల్లిపరికరం పసికందుల ఏడుపును మనకు బోధపడే భాషలోకి అనువదిస్తుంది. ఇది ఇరవై నాలుగు గంటలూ పసికందులను కంటికి రెప్పలా కనిపెడుతూ ఉంటుంది. వారు ఏడుస్తున్నట్లయితే, ఎందుకు ఏడుస్తున్నారో ఇట్టే తెలియజెబుతుంది. అమెరికన్ కంపెనీ ‘మాక్సికోసీ’ పిల్లల ఏడుపును అనువదించే ఈ బుల్లిరోబోను ఇటీవల రూపొందించింది. దీనికి అనుబంధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే బేబీ మానిటర్ కూడా ఉంటుంది. పిల్లలు ఏడుస్తున్నట్లయితే, వారు ఆకలికి ఏడుస్తున్నారో, నిద్రవస్తున్నందుకు ఏడుస్తున్నారో, భయం వల్ల ఏడుస్తున్నారో, గందరగోళం వల్ల ఏడుస్తున్నారో ఇది ఇట్టే చెప్పేస్తుంది. దీని ధర 61.99 డాలర్లు (రూ.5,154) మాత్రమే!. (చదవండి: కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ గురించి విన్నారా?) -
శాంసంగ్ టీవీల్లో కొత్త మోడ్.. ఆ రంగులు చూడలేని వారి కోసం..
దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం శాంసంగ్ (Samsung).. తన 2023 టీవీ, మానిటర్ లైనప్‌లో సీ కలర్స్ (SeeColors) అనే కొత్త మోడ్‌ను జోడించినట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ వర్ణ అంధత్వం ఉన్నవారికి వివిధ సెట్టింగుల ద్వారా మెరుగైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. సీ కలర్స్ మోడ్ తొమ్మిది పిక్చర్ ప్రీసెట్లను అందిస్తుంది. వీటిలో వినియోగదారులు తమకు అనువైనదాన్ని ఎంచుకోవచ్చు. వీక్షకులు తమ వర్ణ దృష్టి లోపానికి అనుగుణంగా స్క్రీన్‌పై అన్ని రంగులను సులభంగా గుర్తించగలిగేలా ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల స్థాయిలను ఈ ఫీచర్ సర్దుబాటు చేస్తుంది. అందుబాటులో సాఫ్ట్వేర్ అప్డేట్ వాస్తవానికి 2017లోనే ఈ ఫీచర్ ఒక అప్లికేషన్‌గా విడుదలైంది. సీ కలర్స్ మోడ్ వర్ణాంధత్వ బాధితులు తాము చూడలేని రంగులను సైతం స్క్రీన్‌పై ఆస్వాదించేలా దీన్ని రూపొందించారు. రానున్న టీవీ, మానిటర్ యాక్సెసిబిలిటీ మెనూలలో ఈ మోడ్‌ను ఏకీకృతం చేస్తోంది శాంసంగ్ కంపెనీ. ఇప్పటికే 2023 మోడల్ శాంసంగ్ టీవీలు, మానిటర్లు కొనుగోలు చేసిన వారు తమ ఉత్పత్తుల యాక్సెసిబిలిటీ మెనూకి సీ కలర్స్ ఫీచర్‌ను జోడించడానికి సాఫ్ట్వేర్ అప్డేట్ అందుబాటులో ఉంటుంది. సీ కలర్స్ మోడ్‌కు సంబంధించి 'కలర్ విజన్ యాక్సెసిబిలిటీ' సర్టిఫికేషన్‌ను కూడా శాంసంగ్ పొందింది. ఇదీ చదవండి: Smallest Smartphone: ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు మాత్రం అదుర్స్! -
చిన్న క్లిప్పులా ఉంటుంది.. కానీ పనితీరు అమోఘం
పాతకాలం నాటి పాదరసం బీపీ మానిటర్లు ఇప్పటికీ చాలాచోట్ల వాడుకలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన డిజిటల్ బీపీ మానిటర్లు కూడా విరివిగా వాడుకలో ఉన్నాయి. ఇవేవి వాడాలన్నా, చేతికి పట్టీని చుట్టి నానా ప్రయాస పడాల్సి ఉంటుంది. అమెరికాకు చెందిన బయోమెట్రిక్ టెక్నాలజీ కంపెనీ ‘వాలెన్సెల్’ ఇటీవల ఎలాంటి పట్టీలు లేని, అతిచిన్న కఫ్లెస్ బీపీ మానిటర్‌ను రూపొందించింది. ఇది చూడటానికి పల్సాక్సి మీటర్లాగానే చిన్న క్లిప్పులా ఉంటుంది. ఇందులో వేలుపెడితే చాలు. దీని పైభాగంలో ఉన్న మానిటర్ మీద కచ్చితంగా బీపీ ఎంత ఉందో కనిపిస్తుంది. దీనిని ఈ ఏడాది జరిగిన సీఈఎస్–2023 ప్రదర్శనలో ‘వాలెన్సెల్’ ప్రదర్శించింది. త్వరలోనే దీనిని మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇది విరివిగా అందుబాటులోకి వస్తే, బీపీ మానిటర్‌ను ఇంచక్కా జేబులో వేసుకుని వెళ్లొచ్చు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ బీపీని తెలుసుకోవచ్చు. -
Photo Story: భగీరథ.. ఏమిటీ వ్యథ!
కోడేర్ (కొల్లాపూర్): నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఖానాపూర్ శివారులో మిషన్ భగీరథ గేటు వాల్వ్‌కు లీకేజీ ఏర్పడింది. సోమవారం అది పెద్దదై మూడు గంటల పాటు నీళ్లు వృథాగా పోయాయి. పొలాల్లో ఉన్న రైతులు గమనించి వెంటనే ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులు ప్రారంభించారు. మంగళవారంలోగా మరమ్మతు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఇల్లెందు: పనికెళ్లాలంటే వాగు దాటాల్సిందే. సోమవారం పొద్దుటే వ్యవసాయ పనులకు వెళ్లిన గిరిజనులు సాయంత్రం తిరిగి వచ్చే వేళకు కిన్నెరసాని నది పొంగింది. దాన్ని దాటితేనే ఇంటికి చేరేది.. చేసేదేం లేక ఇలా కట్టెల సాయంతో నిచ్చెన మాదిరి ఏర్పాటు చేసుకుని ప్రవాహాన్ని దాటడానికి సాహసం చేశారు. ఇదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మొదుగులగూడెం గిరిజనుల పరిస్థితి. మొదుగులగూడెం – నడిమిగూడెం మధ్య కిన్నెరసానిపై ఎలాంటి వారధి లేకపోవడంతో ఏటా వర్షాకాలంలో ఇలాంటి కష్టాలు షరామామూలయ్యాయి. ఉడుము.. పట్టు మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని అటవీ గ్రామాలైన కనుకునూర్, రెడ్డిపల్లి, సింగంపల్లి, రేగులగూడెం, సింగారం తదితర గ్రామాల్లోని గిరిజనులు అడవుల్లో దొరికే ఉడుములను అమ్మడం ద్వారానే జీవనోపాధి పొందుతున్నారు. దీని మాంసం నడుము, కీళ్లనొప్పుల్లాంటి వ్యాధులకు బాగా పనిచేస్తుందనే నమ్మకం ఉంది. ఈ క్రమంలో కేజీ మాంసం రూ.800 వరకు పలుకుతోంది. దీనిపై పెగడపల్లి ఫారెస్ట్ రేంజర్ సుష్మారావు మాట్లాడుతూ ఉడుములను పట్టడం నేరమని, అటువంటి వారిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు. -
రూ.1049 లకే ఐటెల్ ఫోన్ : అధ్బుత ఫీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఐటెల్ సంస్థ అద్భుత ఫీచర్లు, అతి తక్కువ ధరలో కొత్త ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రధానంగా కరోనా సంక్షోభ సమయంలో బాడీ టెంపరేచర్‌ను గుర్తించాల్సిన అవసరాన్ని గుర్తించిన తాము ఈ ఫోన్‌ను తీసుకొచ్చామని కంపెనీ వెల్లడించింది. ఐటీ2192టీ థర్మో ఎడిషన్ పేరుతో ఐటెల్ దీన్ని ఆవిష్కరించింది. దీని ధరను కేవలం . రూ .1,049గా నిర్ణయించింది. ఇన్‌బిల్ట్ టెంపరేచర్ సెన్సర్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను మానిటర్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. కోవిడ్ -19 నుండి సురక్షితంగా ఉండటానికి ముందస్తు చర్యగా యూజర్ల శరీర ఉష్ణోగ్రతను ట్రాక్ చేసేలా ఎంట్రీ లెవల్ విభాగంలో దేశంలోనే తొలి ఫీచర్ ఫోన్‌గా ఇది నిలిచింది. అలాగే టెక్స్ట్-టు-స్పీచ్ ఫీచర్ ఇందులోని మరో విశేషం. తెలుగుతోపాటు ఎనిమిది భాషలకు ఇది సపోర్ట్ చేస్తుంది. యూజర్లు టెంపరేచర్‌ను గుర్తించేలా ఫోన్లో థర్మో సెన్సార్ ను పొందుపర్చింది. థర్మో బటన్‌ను ఎక్కువసేపు నొక్కి ఉంచితే టెంపరేచర్‌ను రీడ్ చేస్తుంది. సెన్సార్‌ను అరచేతిలో ఉంచుకోవడం లేదా సెన్సార్‌పై టచ్ ఫింగర్‌ను ఉంచితే సెల్సియస్‌లో టెంపరేచర్‌ను చూపిస్తుంది. దీన్ని ఫారెన్‌హీట్‌గా కూడా మార్చుకోవచ్చు. అంతేకాదు టెక్స్ట్-టు-స్పీచ్ ఫీచర్ ద్వారా ఇన్కమింగ్ కాల్లు, సందేశాలు, మెనూ వివరాలు మాత్రమే కాకుండా బాడీ టెంపరేచర్ వివరాలను కూడా వినిపిస్తుంది. ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ, గుజరాతీ భాషల్లో దీన్ని వినవచ్చు. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే 4.5 సెం.మీ డిస్ప్లే, 1,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చింది. ఇది సూపర్ బ్యాటరీ మోడ్‌తో 4 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఈ కీప్యాడ్ ఫీచర్ ఫోన్లో వెనుక కెమెరా, రికార్డింగ్ ఆప్షన్‌తో వైర్లెస్ ఎఫ్ఎం, ఆటో కాల్ రికార్డర్, ఎల్ఈడీ టార్చ్, వన్-టచ్ మ్యూట్ , ప్రీ-లోడెడ్ గేమ్స్ఉన్నాయి. వినియోగదారుల ఆరోగ్యం, వినోదం అనే రెండు లక్ష్యాలతో సమాజానికి ఎక్కువ బాధ్యత వహించేలా ఎంట్రీ లెవల్లో అతి తక్కువ ధరలో ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేశామని ఐటెల్ సీఈఓ తలపాత్రా చెప్పారు -
ముద్రా రుణాలను జాగ్రత్తగా పరిశీలించాలి
ముద్ర రుణాల్లో పెరుగుతున్న మొండిబకాయిలపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై) కింద అనధికారిక రుణాలను విస్తరిస్తున్న బ్యాంకులు ఈ రుణాలను మరింత అప్రమత్తంగా పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం.కె.జైన్ సూచించారు. ముద్రా పథకం కింద ఇచ్చిన రుణాలను ప్రస్తావిస్తూ బ్యాంకులు మదింపు దశలో రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యంపై దృష్టి పెట్టాలి, జాగ్రత్తగా పర్యవేక్షించాలన్నారు. ముద్ర రుణాల ద్వారా చాలా కుటుంబాలను పేదరికంనుంచి బయటకు తెచ్చేందుకు చేసిన ప్రయత్నం. కానీ మొండిబకాయిలు పెరిగిపోతున్నాయని జైన్ వ్యాఖ్యానించారు. వీరికి రుణాలు ఇచ్చేసమయంలోనే బ్యాంకులు రీపేమెంట్‌కు సంబంధించి సరైన అంచనాలు వేసుకోవాలన్నారు. కాగా కార్పొరేట్యేతర, వ్యవసాయేతర చిన్న,సూక్ష్మ సంస్థలకు రూ .10 లక్షల వరకు రుణాలు అందించడానికి పిఎంఎంవై 2015, ఏప్రిల్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఈ పథకం కింద ఎస్సీలు, ఎస్టీలు సహా 3.27 కోట్ల మంది స్వల్ప, చిన్న పారిశ్రామికవేత్తలకు రూ .7.28 లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు డేటా ద్వారా తెలుస్తోంది. -
'స్మార్ట్ టి-షర్టు..ఏం చేస్తుందో తెలుసా?
టొరంటో: శాస్త్రవేత్తలు వినూత్నమైన టీ షర్ట్‌ను రూపొందించారు. ధరించిన వారి శ్వాసను మానిటర్ చేసే స్మార్ట్ టి-షర్టును పరిశోధకులు సృష్టించారు. ఎలాంటి వైర్లు లేదా సెన్సర్ల అవసరం లేకుండానే రియల్ టైంలో ధరించిన వారి శ్వాస రేటును ఇది పర్యవేక్షిస్తుందట. శ్వాసకోశ వ్యాధులను నిర్ధారించడానికి లేదా ఉబ్బసం, స్లీప్ అప్నియా లేదా దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి బాధపడుతున్న వ్యక్తులను పర్యవేక్షించడానికి ఉపయోగపడేలా దీన్ని ఆవిష్కరించారు. కెనడాలోని లావాల్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ 'స్మార్ట్ టీ షర్టును రూపొందించారు. దీని అంతర్గత ఉపరితలంపై పలుచటి వెండి పొరతో కప్పబడిన బోలుగా ఉండే ఆప్టికల్ ఫైబర్‌తో తయారు చేసిన యాంటెన్నాను షర్ట్ కాత్లో ఛాతీ స్థాయిలో అమర్చారు. ఇలా ప్రత్యేకంగా అమర్చిన ఈ యాంటెన్నా ధరించిన వ్యక్తి శ్వాస సంకేతాలను ప్రసారం చేస్తుంది. ఇలా పంపిన డేటా యూజర్ యొక్క స్మార్ట్‌ఫోన్ లేదా సమీప కంప్యూటర్ చేరుతుంది. శ్వాసకోశ రేటు కొలిచే ఇతర పద్ధతుల మాదిరిగా కాకుండా, ఎలాంటి తీగలు, ఎలక్ట్రోడ్లు, లేదా సెన్సార్లతో సంబంధం లేకుండా పనిచేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. బాహ్య పరిస్థితులకు తట్టుకునేలా ఈ ఫైబర్‌ను పాలిమర్ తో కవర్ చేసినట్టు యూనివర్శిటీ ప్రొఫెసర్, పరిశోధకుల్లో ఒకరు యునెస్ మెస్సడేక్ చెప్పారు. దీన్ని ధరించిన వ్యక్తి కూర్చున్నా, పడుకున్నా, నిలబడినా సెన్సింగ్ అండ్ ట్రాన్సిమిటింగ్ అనే రెండు విధులును ఇది విజయవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు. అలాగే ఈ స్మార్ట్ టీ షర్టు అందించే డేటా విశ్వసనీయమైనదిగా తేలిందని చెప్పారు. అంతేకాదు 20 ఉతుకుల తరువాత కూడా ఈ యాంటెన్నా నీరు, డిటర్జెంట్‌ను తట్టుకోగలిగి, మంచి పని పరిస్థితిలో ఉందని ప్రొఫెసర్ చెప్పారు. ఈ అధ్యయనం సెన్సర్స్ జర్నల్ లో ప్రచురించబడింది. -
మీ టీవీ ని ఎలా శుభ్రం చేస్తున్నారు?
ముందు మానిటర్ని ఆఫ్ చేయండి. దీంతో మురికి ఎక్కడ ఉందో కనిపిస్తుంది. ♦ పొడిగా ఉండే మెత్తటి క్లాత్‌ను (కళ్లద్దాలను తుడిచేలాంటి క్లాత్) తీసుకొని, ముందు దుమ్ము పోయేలా తుడవండి. ఎక్కువ ఒత్తిడి లేకుండా పై నుంచి కిందకు తుడవాలి. ♦ వెనిగర్, నీళ్లు సమభాగాలు తీసుకొని దీంట్లో మెత్తటి క్లాత్ ముంచి, పిండి దాంతో స్క్రీన్‌ను తుడవాలి. ఆ తర్వాత పొడి క్లాత్‌తో తుడవాలి. ♦ పేపర్ టవల్స్, టాయిలెట్ పేపర్స్, షర్ట్ క్లాత్స్‌ను స్క్రీన్ తుడవడానికి ఉపయోగించకూడదు. ♦ అమ్మోనియా, ఇథైల్ ఆల్కహాల్, ఎసిటోన్ వంటి రసాయనాలతో స్క్రీన్ తుడిస్తే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. ♦ లిక్విడ్స్ ఏ మాత్రం డెరైక్ట్‌గా స్క్రీన్ మీద స్ప్రే చేయకూడదు. స్ప్రే మానిటర్ లోపలికి వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీంతో త్వరగా స్క్రీన్ పాడవ్వచ్చు. -
'ప్రయివేట్ మెసేజ్ లను కూడా చూడొచ్చు...'
కంపెనీలకు తమ కార్మికుల ఆన్లైన్ ప్రైవేట్ మెజేస్ లను మానిటర్ చేసే హక్కును యూరోపియన్ న్యాయస్థానం కల్పించింది. ఓ ఇంజనీర్ తన వృత్తిపరమైన విషయాలను మాత్రమే సంభాషించాల్సిన యాహూ మెసెంజర్ లో తన సోదరుడు, కాబోయే భార్యతో మాట్లాడి, తర్వాత తొలగించడాన్ని యూరోపియన్ మానవ హక్కుల న్యాయస్థానం తప్పుపట్టింది. బొగ్డన్ మిహై బార్బులెస్కు తన ఖాతాదారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు యాహూ మెసెంజర్ అవసరమని, తన ఖాతాను ఓపెన్ చేయమని యాజమాన్యాన్ని కోరాడు. దీంతో కంపెనీ అతనికి కొత్త ఖాతా ఓపెన్ చేసి ఇచ్చింది. అనంతరం 2007 లో తన ఛాట్స్ కొంతకాలంగా ఎవరో పర్యవేక్షిస్తున్నట్లు అతడు యాజమాన్యాన్ని కలిసి ఫిర్యాదు చేశాడు. అయితే కంపెనీ నిబంధనల ప్రకారం అతడి సేవలను కంపెనీకి మాత్రమే వినియోగించాల్సి ఉంది. దీంతో యాజమాన్యం అతని ఫిర్యాదును స్వీకరించకపోగా, అతడు చేసిన తప్పును ఎత్తి చూపింది. దీంతో కోర్టుకెక్కిన సదరు ఇంజనీర్ తన కాబోయే భార్యకు సహా ఇతరులకు పంపిన మెజేస్ లతో పాటు 45 పేజీల ట్రాన్స్ స్క్రిప్ట్ ను కోర్టు ముందుంచాడు. విషయాన్ని పరిశీలించిన స్ట్రాస్బోర్గ్ కోర్ట్ యాజమానివైపు నిలిచింది. ఉద్యోగి పని గంటల సమయంలో వృత్తి పరమైన పనులు పూర్తి చేశాడా లేదా అన్న విషయాన్ని గమనించే హక్కు యాజమాన్యానికి ఉంటుందని తీర్పునిచ్చింది. కార్మికుల పనిని పరిశీలించడంలో భాగంగా ప్రైవేట్ మెజేజ్ లను కూడా పర్యవేక్షించే అధికారం యాజమాన్యానికి ఉంటుందని కోర్టు.. తేల్చి చెప్పింది. కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిన బార్బులెస్కు దావాను న్యాయమూర్తి కొట్టివేశారు. ఈ నిర్ణయం యూరోపిన్ దేశాలన్నింటికి వర్తిస్తుందని, ఉద్యోగి పని విషయంలో యాజమాన్యాలకు చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయని, లండన్ సంస్థ లెవిస్ సిల్కిన్ ఉపాధి హెడ్ బ్లూమ్ బర్గ్, న్యాయవాది మైఖేల్ బర్డ్ లు చెప్పారు. అయితే ఈ కేసులో యాహూను స్వవిషయాలకు వినియోగించినట్లు ఉన్నా ఇది ఒక్క యాహూకే కాక ఏ ఇతర మెసేజింగ్ సర్వీసుల విషయంలోనైనా వర్తిస్తుందని వారు చెప్తున్నారు. -
'పోర్న్'పై నిషేధంకాదు.. పర్యవేక్షణే!
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ మాదిరి స్వచ్ఛ ఇంటర్నెట్ సాధనకు నడుంకట్టిన మోదీ సర్కారుకు.. ఆ దిశగా తీసుకున్న 857 అశ్లీల వెబ్ సైట్ల నిశేధం నిర్ణయాంపై సమాజంలోని అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పోర్న్ వెబ్సైట్లకు అడ్డుకట్టవేస్తే అది వైద్య, విజ్ఞాన రంగాలకు సంబంధించిన కీలక సమాచారం గల్లంతుకు కూడా కారణమవుతుందనే వాదన వినవస్తుండటంతో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాలనుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్ లో పోర్న్ ను పూర్తిగా నిషేధించకుండా కేవలం పర్యవేక్షించాలని మాత్రమే భావిస్తున్నది. దీనికోసం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అంబుడ్స్‌మన్ వ్యవస్థను త్వరలో ఏర్పాటుచేయనుంది. 'ప్రజలపై మోరల్ పోలిసింగ్ చేసే ఉద్దేశం మాకు లేదు, విపరీత పరిణామాలు తలెత్తకముందే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం' అని కేంద్ర టెలికాం, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించడం కూడా దిద్దుబాటు చర్యల్లో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. నిషేదం వద్దనేది ఎందుకంటే.. ఒకవేళ ప్రభుత్వ సర్వీసు ప్రొవైడర్ల మేరకైనా అడ్డుకోవాలంటే పోర్న్ వెబ్సైట్లతోపాటు వైద్య, విజ్ఞాన రంగాలకు సంబంధించిన కీలక సమాచారం గల్లంతవుతుంది. వెబ్ ఫిల్టర్లు కేవలం ‘కీ పదాల’ ఆధారంగా పని చేస్తాయిగనుక ఎయిడ్స్‌కు సంబంధించిన సమాచారం గల్లంతుకావచ్చు. సెక్స్ సమస్యలకు సంబంధించిన వైద్య విజ్ఞానానికి సంబంధించిన సమాచారమూ గల్లంతుకావచ్చు. ‘సెక్స్’ అనే కీ పదాన్ని వెబ్ ఫిల్టర్లు అడ్డుకున్నా వినియోగదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉండకపోవు. సన్నీ లియోన్ లాంటి స్టార్ల పేర్ల ద్వారా కూడా ఇలాంటి సైట్లకు వెళ్లే మార్గాలు ఉంటాయి. పోర్న్ వెబ్సైట్లను చూసే దేశాల్లో భారత్ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉందని 2013 సెప్టెంబర్ నెల నుంచి 2014 సెప్టెంబర్ వరకు జరిపిన సర్వేలో తేలిందని అలెగ్జా తెలియజేసింది. ఈ సైట్లను చూసే ప్రపంచ ప్రజల సరాసరి సగటు 7.6 శాతం ఉండగా, భారత్ ప్రజల సగటు 7.32 శాతం ఉంది. -
కారు, లారీ ఢీ.. ఒకరి మృతి
నూజివీడులో ప్రమాదం మరో ఐదుగురికి గాయాలు మృతుడు గుడివాడ వాసి నూజివీడు, న్యూస్‌లైన్ : పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా, ఐదుగురికి గాయాల య్యాయి. వివరాలిలా ఉన్నాయి. గుడివాడలోని నాగవరప్పాడుకు చెందిన కొత్త సుందరరావు(27) కారులో నూజివీడులోని బంధువుల ఇంటికి వచ్చాడు. బంధువైన ఎలికే శ్రవణ్‌కుమార్, అతడి మిత్రులతో కలిసి మైలవరం రోడ్డులోని ఇంజినీరింగ్ కళాశాల వరకు వెళ్లాడు. కొంతసేపటి తరువాత పట్టణంలోకి తిరుగుముఖం పట్టారు. ఆర్ఆర్సీ క్లబ్ ఎదురుగా వీరు ప్రయాణిస్తున్న కారు, మైలవరం వైపు వెళుతున్న లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో సుందరరావు తలకు బల మైన గాయాలయ్యాయి. కారులో ఉన్న గుజ్జర్లమూడి యోహాను(42), గుజ్జర్లమూడి భాస్కర్(20), ఎలికే శ్రవణ్‌కుమార్(25), కొలుసు రాంబాబు(24), బోట్ల రాజశేఖర్(20) కూడా గాయపడ్డారు. వారిని ఆ ప్రాంతంలో ఉన్నవారు హుటాహుటిన స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుందరరావు మృతి చెందాడు. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. టాప్ కూడా లేచిపోయింది. ఈ ఘటనపై ఎస్సై బి.ఆదిప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు వెంట వాహనాలు నిలపడం వల్లే.. ఆర్ఆర్సీ క్లబ్ వద్ద రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలిపి ఉంచడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్య క్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఇక్కడ కొద్దిపాటి మలు పు ఉంది. ఆ మలుపులోనే బ్రేక్ ఇన్స్పెక్టర్ కార్యాల యానికి రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం వచ్చే ట్రాక్టర్లు, లారీలు తదితర వాహనాలు రోడ్డుకు ఇరువైపులా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలిపి ఉం చుతున్నారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాల చోదకులకు మలుపు దగ్గరకు వచ్చే వరకు ఎదురుగా వస్తున్న వాహనం కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కారు, లారీ ఢీకొన్నాయని స్థానికులు భావిస్తున్నారు.