పాతకాలం నాటి పాదరసం బీపీ మానిటర్లు ఇప్పటికీ చాలాచోట్ల వాడుకలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన డిజిటల్ బీపీ మానిటర్లు కూడా విరివిగా వాడుకలో ఉన్నాయి. ఇవేవి వాడాలన్నా, చేతికి పట్టీని చుట్టి నానా ప్రయాస పడాల్సి ఉంటుంది.
అమెరికాకు చెందిన బయోమెట్రిక్ టెక్నాలజీ కంపెనీ ‘వాలెన్‌సెల్’ ఇటీవల ఎలాంటి పట్టీలు లేని, అతిచిన్న కఫ్‌లెస్ బీపీ మానిటర్‌ను రూపొందించింది. ఇది చూడటానికి పల్సాక్సి మీటర్‌లాగానే చిన్న క్లిప్పులా ఉంటుంది. ఇందులో వేలుపెడితే చాలు. దీని పైభాగంలో ఉన్న మానిటర్ మీద కచ్చితంగా బీపీ ఎంత ఉందో కనిపిస్తుంది. దీనిని ఈ ఏడాది జరిగిన సీఈఎస్–2023 ప్రదర్శనలో ‘వాలెన్‌సెల్’ ప్రదర్శించింది.
త్వరలోనే దీనిని మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఇది విరివిగా అందుబాటులోకి వస్తే, బీపీ మానిటర్‌ను ఇంచక్కా జేబులో వేసుకుని వెళ్లొచ్చు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ బీపీని తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment