కారు, లారీ ఢీ.. ఒకరి మృతి
- నూజివీడులో ప్రమాదం
- మరో ఐదుగురికి గాయాలు
- మృతుడు గుడివాడ వాసి
నూజివీడు, న్యూస్‌లైన్ : పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా, ఐదుగురికి గాయాల య్యాయి. వివరాలిలా ఉన్నాయి. గుడివాడలోని నాగవరప్పాడుకు చెందిన కొత్త సుందరరావు(27) కారులో నూజివీడులోని బంధువుల ఇంటికి వచ్చాడు. బంధువైన ఎలికే శ్రవణ్‌కుమార్, అతడి మిత్రులతో కలిసి మైలవరం రోడ్డులోని ఇంజినీరింగ్ కళాశాల వరకు వెళ్లాడు. కొంతసేపటి తరువాత పట్టణంలోకి తిరుగుముఖం పట్టారు.
ఆర్‌ఆర్‌సీ క్లబ్ ఎదురుగా వీరు ప్రయాణిస్తున్న కారు, మైలవరం వైపు వెళుతున్న లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో సుందరరావు తలకు బల మైన గాయాలయ్యాయి. కారులో ఉన్న గుజ్జర్లమూడి యోహాను(42), గుజ్జర్లమూడి భాస్కర్(20), ఎలికే శ్రవణ్‌కుమార్(25), కొలుసు రాంబాబు(24), బోట్ల రాజశేఖర్(20) కూడా గాయపడ్డారు. వారిని ఆ ప్రాంతంలో ఉన్నవారు హుటాహుటిన స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ సుందరరావు మృతి చెందాడు. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. టాప్ కూడా లేచిపోయింది. ఈ ఘటనపై ఎస్సై బి.ఆదిప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రోడ్డు వెంట వాహనాలు నిలపడం వల్లే..
ఆర్‌ఆర్‌సీ క్లబ్ వద్ద రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలిపి ఉంచడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్య క్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఇక్కడ కొద్దిపాటి మలు పు ఉంది. ఆ మలుపులోనే బ్రేక్ ఇన్‌స్పెక్టర్ కార్యాల యానికి రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం వచ్చే ట్రాక్టర్లు, లారీలు తదితర వాహనాలు రోడ్డుకు ఇరువైపులా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలిపి ఉం చుతున్నారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాల చోదకులకు మలుపు దగ్గరకు వచ్చే వరకు ఎదురుగా వస్తున్న వాహనం కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కారు, లారీ ఢీకొన్నాయని స్థానికులు భావిస్తున్నారు.