'ప్రయివేట్ మెసేజ్ లను కూడా చూడొచ్చు...'
కంపెనీలకు తమ కార్మికుల ఆన్లైన్ ప్రైవేట్ మెజేస్ లను మానిటర్ చేసే హక్కును యూరోపియన్ న్యాయస్థానం కల్పించింది. ఓ ఇంజనీర్ తన వృత్తిపరమైన విషయాలను మాత్రమే సంభాషించాల్సిన యాహూ మెసెంజర్ లో తన సోదరుడు, కాబోయే భార్యతో మాట్లాడి, తర్వాత తొలగించడాన్ని యూరోపియన్ మానవ హక్కుల న్యాయస్థానం తప్పుపట్టింది.
బొగ్డన్ మిహై బార్బులెస్కు తన ఖాతాదారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు యాహూ మెసెంజర్ అవసరమని, తన ఖాతాను ఓపెన్ చేయమని యాజమాన్యాన్ని కోరాడు. దీంతో కంపెనీ అతనికి కొత్త ఖాతా ఓపెన్ చేసి ఇచ్చింది. అనంతరం 2007 లో తన ఛాట్స్ కొంతకాలంగా ఎవరో పర్యవేక్షిస్తున్నట్లు అతడు యాజమాన్యాన్ని కలిసి ఫిర్యాదు చేశాడు. అయితే కంపెనీ నిబంధనల ప్రకారం అతడి సేవలను కంపెనీకి మాత్రమే వినియోగించాల్సి ఉంది. దీంతో యాజమాన్యం అతని ఫిర్యాదును స్వీకరించకపోగా, అతడు చేసిన తప్పును ఎత్తి చూపింది. దీంతో కోర్టుకెక్కిన సదరు ఇంజనీర్ తన కాబోయే భార్యకు సహా ఇతరులకు పంపిన మెజేస్ లతో పాటు 45 పేజీల ట్రాన్స్ స్క్రిప్ట్ ను కోర్టు ముందుంచాడు. విషయాన్ని పరిశీలించిన స్ట్రాస్బోర్గ్ కోర్ట్ యాజమానివైపు నిలిచింది. ఉద్యోగి పని గంటల సమయంలో వృత్తి పరమైన పనులు పూర్తి చేశాడా లేదా అన్న విషయాన్ని గమనించే హక్కు యాజమాన్యానికి ఉంటుందని తీర్పునిచ్చింది. కార్మికుల పనిని పరిశీలించడంలో భాగంగా ప్రైవేట్ మెజేజ్ లను కూడా పర్యవేక్షించే అధికారం యాజమాన్యానికి ఉంటుందని కోర్టు.. తేల్చి చెప్పింది.
కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిన బార్బులెస్కు దావాను న్యాయమూర్తి కొట్టివేశారు. ఈ నిర్ణయం యూరోపిన్ దేశాలన్నింటికి వర్తిస్తుందని, ఉద్యోగి పని విషయంలో యాజమాన్యాలకు చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయని, లండన్ సంస్థ లెవిస్ సిల్కిన్ ఉపాధి హెడ్ బ్లూమ్ బర్గ్, న్యాయవాది మైఖేల్ బర్డ్ లు చెప్పారు. అయితే ఈ కేసులో యాహూను స్వవిషయాలకు వినియోగించినట్లు ఉన్నా ఇది ఒక్క యాహూకే కాక ఏ ఇతర మెసేజింగ్ సర్వీసుల విషయంలోనైనా వర్తిస్తుందని వారు చెప్తున్నారు.