Bosses
-
వర్క్ ఫ్రం హోం: ఎక్స్ ట్రా వర్క్‌కి చెక్ పెట్టేలా కొత్త చట్టం
పోర్చుగల్: ఈ కరోనా మహమ్మారి కారణంగా అందరూ వర్క్ ఫ్రం హోంకి పరిమితమయ్యారు. దీంతో కాన్ఫరెన్స్‌లు వంటివి వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత పెట్టేవారు. అందువల్ల చాలామంది ఉద్యోగులు ఒత్తిడికి గురయ్యేవారు. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీస్‌కి దూరంగా పనిచేయడంతో వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో పనిచేశారు. కానీ ఇప్పుడూ అలాంటి పనులు చేస్తే జరిమాను విధిస్తాను అంటోంది పోర్చుగల్ ప్రభుత్వం. (చదవండి: టీ అమ్మే వ్యక్తి.. నేడు రైలు ఇంజిన్ తయారు చేసే స్థాయికి!) అసుల విషయంలోకెళ్లితే...కోవిడ్ -19 దృష్ట్యా 18 నెలలుగా ప్రజలు ఇంటి నుండి పని చేయడం ప్రారంభించారు. దీంతో ఆఫీస్ కాల్లు, గ్రూప్ కాల్లు, జూమ్ మీటింగ్‌లు, కాన్ఫరెన్స్ కాల్లు వంటివి ఇటీవలకాలంలో ఎక్కువయ్యాయి. సహోద్యోగులతో మాట్లాడాలంటే ఆఫీస్‌కి రాలేరు కాబట్టి డిజిటల్ కమ్యూనికేషన్ ఒక్కటే పరిష్కారం. దీంతో తాము మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామంటూ పోర్చుగల్ ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో కొత్త కార్మిక చట్టాలను ఆమోదించింది. దీంతో బాస్‌లు, టీమ్ లీడర్లు పని గంటలు అయిపోయిన తర్వాత సిబ్బందికి కాల్ చేసి ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. ఒకరకరంగా చెప్పాలంటే పనిగంటలు అయిపోయిన తర్వాత బాస్‌లు ఎటువంటి సందేశాలు గానీ, పోన్‌లుగానీ చేయకూడదు, అలాగే ఎక్స్ట్రా వర్క్ చేయమని బలవంతం చేయకూడదు అంటూ పోర్చుగల్ ప్రభుత్వం కొత్త లేబర్ చట్టాలను తీసుకువచ్చింది. ఒక వేళ నియమాలను ఉల్లంఘిస్తే జరిమానాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించింది. (చదవండి: పువ్వుల్లొ దాగున్న ఇల్లు... కానీ అవి మొక్కలకు పూయని పూలు!) -
ఇసుకాసురులకు బకాసురుల పోటు
* బాస్ కన్నుగప్పి అనుచరులు ఇసుక అక్రమ రవాణా * శివారు ప్రాంతాల్లో రహస్యంగా డంపింగ్ * బిల్డర్ వాహనాల ద్వారా చెన్నై, బెంగళూరుకు.. * రీచ్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఫలితం శూన్యం దోచుకున్నోళ్లకు దోచుకున్నంత అన్నట్లుగా కృష్ణాతీరం వెంట ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. బాస్ ఇసుక దోపిడీలో మేము ఓ రూపాయి తింటే తప్పేముందిలే అనుకుంటున్న అనుచరులు ఇసుక రీచ్‌ల్లో సొంత దందాకు తెరలేపారు. బాస్ పంపే వాహనాల్లో తమ అద్దె వాహనాలను కలిపేసి.. ఇసుకతో నింపేసి సొంత వ్యాపారం చేసుకుంటున్నారు. విషయం తెలుసుకుని బాస్‌లు అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారు. కొన్నిచోట్ల రీచ్‌ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అనుచరుల కదలికలపై డేగకన్ను వేశారు. ఈ నేపథ్యంలో బాస్‌లు.. అనుచరుల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది. సాక్షి, అమరావతి బ్యూరో/ తుళ్లూరు రూరల్ : కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని కృష్ణానదీ తీరంలో విచ్చలవిడిగా తోడేస్తున్న ఇసుకను అధికార పార్టీ నేతలు కొందరు ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్న విషయం తెలిసిందే. రీచ్‌లలో అనుచరులను ఉంచి.. బాస్‌లు బయట వ్యాపార లావాదేవీలు నడుపుతూ పెద్ద మనుషులుగా చెలామణి అవుతుంటే... అనుచరులు సొంత ఆర్థిక ప్రయోజనాలను వెతుక్కున్నారు. రీచ్‌ల్లో నుంచే కొన్ని లారీల ద్వారా ఇసుకను రహస్య ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా వ్యాపారుల వాహనాలకు డంప్ చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అదెలా అంటారా? కృష్ణా నదిలో అక్రమంగా తోడుతున్న ఇసుక కోసం అధికార పార్టీ పెద్దలు వారి సొంత వాహనాలు, మరికొన్ని తెలిసిన వారి లారీలు, టిప్పర్లను రీచ్ వద్దకు పంపుతారు. రీచ్‌ల వద్ద ఉన్న అనుచరులకు బాస్ ఫోన్ చేస్తాడు. ‘అరే.. వంద లారీలు, టిప్పర్లు పంపాను. వాటికి ఇసుక నింపి డబ్బులు తీసుకుని పంపేయ్’ అని చెబుతాడు. ‘అలాగేనన్నా’ అని ఫోన్‌పెట్టేసి.. వచ్చిన లారీలకు ఇసుక నింపి పంపేస్తాడు. ఆ వాహనాల మాటున అనుచరుల అద్దె వాహనాలు .. బాస్ వంద వాహనాలు పంపితే.. అనుచరుడు 25 నుంచి 50 వాహనాలు అద్దెకు తీసుకుని వాటికీ ఇసుకను నింపుతాడు. బాస్ వాహనాల మధ్య వీటి ద్వారా పట్టణాలకు దూరంగా రహస్య ప్రాంతాలకు ఇసుకను చేరవేస్తారు. అక్కడ అనుచరులు నేరుగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని బిల్డర్‌తో మాట్లాడతారు. ‘మీరు లారీ ఇసుక రూ.40 వేలకు కొనుగోలు చేస్తున్నారంటగా.. నేను రూ.30 వేలకే నాణ్యమైన ఇసుకను ఇస్తాను. అయితే వాహనాన్ని మీరే పంపాలి. మేము లారీకి ఇసుకను నింపి పంపుతాం’ అని చెబుతారు. రూ.10 వేలు తగ్గినా మంచిదే కదా? అని బిల్డర్ నేరుగా లారీని పంపి ఇసుకను కొనుగోలు చేసుకుంటున్నాడు. ఇలా కృష్ణా తీరం పొడవునా ఉన్న రీచ్‌లలో అనుచరులకు చెందిన వాహనాలు 25 శాతం నుంచి 50 శాతం మధ్యలో ఉంటున్నాయి. అనుచరులు చేస్తున్న మోసాన్ని గమనించిన బాస్‌లు రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. అయినా రోజులో ఒక రీచ్ నుంచి కనీసం వందకుపైగా లారీల ద్వారా అనుచరులు ఇసుకను తరలిస్తున్నారు. ఇటీవల ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాల్లో బారులు తీరిన వాహనాల ఫొటోలను చూసిన బాస్‌లు.. ముక్కున వేలేసుకున్నట్లు తెలిసింది. మన లెక్క ప్రకారం ఒక రీచ్ నుంచి 750 లారీల ఇసుకు డబ్బు వస్తుంటే.. అక్కడ వెయ్యి లారీలకుపైనే ఉన్నాయని గుర్తించిన అధికార పార్టీ నేతలు ఏం చేయాలని పునరాలోచనలో పడినట్లు సమాచారం. -
'ప్రయివేట్ మెసేజ్ లను కూడా చూడొచ్చు...'
కంపెనీలకు తమ కార్మికుల ఆన్లైన్ ప్రైవేట్ మెజేస్ లను మానిటర్ చేసే హక్కును యూరోపియన్ న్యాయస్థానం కల్పించింది. ఓ ఇంజనీర్ తన వృత్తిపరమైన విషయాలను మాత్రమే సంభాషించాల్సిన యాహూ మెసెంజర్ లో తన సోదరుడు, కాబోయే భార్యతో మాట్లాడి, తర్వాత తొలగించడాన్ని యూరోపియన్ మానవ హక్కుల న్యాయస్థానం తప్పుపట్టింది. బొగ్డన్ మిహై బార్బులెస్కు తన ఖాతాదారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు యాహూ మెసెంజర్ అవసరమని, తన ఖాతాను ఓపెన్ చేయమని యాజమాన్యాన్ని కోరాడు. దీంతో కంపెనీ అతనికి కొత్త ఖాతా ఓపెన్ చేసి ఇచ్చింది. అనంతరం 2007 లో తన ఛాట్స్ కొంతకాలంగా ఎవరో పర్యవేక్షిస్తున్నట్లు అతడు యాజమాన్యాన్ని కలిసి ఫిర్యాదు చేశాడు. అయితే కంపెనీ నిబంధనల ప్రకారం అతడి సేవలను కంపెనీకి మాత్రమే వినియోగించాల్సి ఉంది. దీంతో యాజమాన్యం అతని ఫిర్యాదును స్వీకరించకపోగా, అతడు చేసిన తప్పును ఎత్తి చూపింది. దీంతో కోర్టుకెక్కిన సదరు ఇంజనీర్ తన కాబోయే భార్యకు సహా ఇతరులకు పంపిన మెజేస్ లతో పాటు 45 పేజీల ట్రాన్స్ స్క్రిప్ట్ ను కోర్టు ముందుంచాడు. విషయాన్ని పరిశీలించిన స్ట్రాస్బోర్గ్ కోర్ట్ యాజమానివైపు నిలిచింది. ఉద్యోగి పని గంటల సమయంలో వృత్తి పరమైన పనులు పూర్తి చేశాడా లేదా అన్న విషయాన్ని గమనించే హక్కు యాజమాన్యానికి ఉంటుందని తీర్పునిచ్చింది. కార్మికుల పనిని పరిశీలించడంలో భాగంగా ప్రైవేట్ మెజేజ్ లను కూడా పర్యవేక్షించే అధికారం యాజమాన్యానికి ఉంటుందని కోర్టు.. తేల్చి చెప్పింది. కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిన బార్బులెస్కు దావాను న్యాయమూర్తి కొట్టివేశారు. ఈ నిర్ణయం యూరోపిన్ దేశాలన్నింటికి వర్తిస్తుందని, ఉద్యోగి పని విషయంలో యాజమాన్యాలకు చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయని, లండన్ సంస్థ లెవిస్ సిల్కిన్ ఉపాధి హెడ్ బ్లూమ్ బర్గ్, న్యాయవాది మైఖేల్ బర్డ్ లు చెప్పారు. అయితే ఈ కేసులో యాహూను స్వవిషయాలకు వినియోగించినట్లు ఉన్నా ఇది ఒక్క యాహూకే కాక ఏ ఇతర మెసేజింగ్ సర్వీసుల విషయంలోనైనా వర్తిస్తుందని వారు చెప్తున్నారు. -
బాసులే ఎక్కువగా ఇరగదీస్తున్నారట!
లండన్: ఇంటర్నెట్ యుగంలో సోషల్ మీడియా ఓ వ్యసనంలా అందర్ని చుట్టేసిందంటే ఆశ్చర్య పడాల్సిన విషయమేమి కాదు. ఇల్లైనా, ఆఫీసైనా, కనీసం మొబైల్ తోకాని సోషల్ మీడియాతో కనెక్ట్ అయి చాటింగ్ చేయడం, ఫోటోలను షేర్ చేసుకోవడం అన్నివర్గాల వయస్సుల వారికి ఓ అలవాటుగా మారింది. అయితే పనివేళల్లో సాధారణ ఉద్యోగుల కంటే బాసులే ఎక్కువగా ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నట్టు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. నార్వేలోని యూనివర్సిటీ ఆఫ్ బెర్ జెన్ ఓ సర్వేను నిర్వహించింది. ఆఫీసుల్లో పని వదిలేసి.. వ్యక్తిగత పనులకు సోషల్ మీడియాను టాప్ మేనేజర్లు విరివిగా వినియోగిస్తున్నారని సర్వేలో స్పష్టమైంది. టాప్ ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్లు సోషల్ మీడియా మోజులో పడటం వలన ఉత్పత్తి తగ్గడమే కాకుండా, ఆర్ధికంగా కంపెనీలు నష్లాలకు లోనవుతున్నట్టు సర్వేలో కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. ఈ సర్వేలలో సుమారు 11 వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. సీనియర్ ఉద్యోగుల కంటే యువ ఉద్యోగులే సోషల్ మీడియాను ఉపమోగించుకుంటున్నారని పరిశోధనలో తెలిసింది. ఆఫీస్ సమయంలో మహిళా ఉద్యోగుల కంటే పురుషులే వ్యక్తిగత పనులకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారట. కార్యాలయాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాను ఉపయోగిస్తే ఉద్యోగం పోతుందనే భయం కూడా ఉద్యోగుల్లో కనిపించడం లేదని తాజా సర్వే వెల్లడించింది.