
పోర్చుగల్: ఈ కరోనా మహమ్మారి కారణంగా అందరూ వర్క్ ఫ్రం హోంకి పరిమితమయ్యారు. దీంతో కాన్ఫరెన్స్‌లు వంటివి వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత పెట్టేవారు. అందువల్ల చాలామంది ఉద్యోగులు ఒత్తిడికి గురయ్యేవారు. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీస్‌కి దూరంగా పనిచేయడంతో వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో పనిచేశారు. కానీ ఇప్పుడూ అలాంటి పనులు చేస్తే జరిమాను విధిస్తాను అంటోంది పోర్చుగల్ ప్రభుత్వం.
(చదవండి: టీ అమ్మే వ్యక్తి.. నేడు రైలు ఇంజిన్ తయారు చేసే స్థాయికి!)
అసుల విషయంలోకెళ్లితే...కోవిడ్ -19 దృష్ట్యా 18 నెలలుగా ప్రజలు ఇంటి నుండి పని చేయడం ప్రారంభించారు. దీంతో ఆఫీస్ కాల్‌లు, గ్రూప్ కాల్‌లు, జూమ్ మీటింగ్‌లు, కాన్ఫరెన్స్ కాల్‌లు వంటివి ఇటీవలకాలంలో ఎక్కువయ్యాయి. సహోద్యోగులతో మాట్లాడాలంటే ఆఫీస్‌కి రాలేరు కాబట్టి డిజిటల్ కమ్యూనికేషన్ ఒక్కటే పరిష్కారం. దీంతో తాము మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామంటూ పోర్చుగల్ ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో కొత్త కార్మిక చట్టాలను ఆమోదించింది.
దీంతో బాస్‌లు, టీమ్ లీడర్‌లు పని గంటలు అయిపోయిన తర్వాత సిబ్బందికి కాల్ చేసి ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. ఒకరకరంగా చెప్పాలంటే పనిగంటలు అయిపోయిన తర్వాత బాస్‌లు ఎటువంటి సందేశాలు గానీ, పోన్‌లుగానీ చేయకూడదు, అలాగే ఎక్స్‌ట్రా వర్క్ చేయమని బలవంతం చేయకూడదు అంటూ పోర్చుగల్ ప్రభుత్వం కొత్త లేబర్ చట్టాలను తీసుకువచ్చింది. ఒక వేళ నియమాలను ఉల్లంఘిస్తే జరిమానాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించింది.
(చదవండి: పువ్వుల్లొ దాగున్న ఇల్లు... కానీ అవి మొక్కలకు పూయని పూలు!)
Comments
Please login to add a commentAdd a comment