extra work
-
ఇక ఎక్కువ సేపు పని చేయాలంటే.. జరిమానా కట్టాల్సిందే!
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని సంస్థలు ఉద్యోగుల పని సమయం దాటిన తర్వాత కూడా ఎక్కువ సేపు పని చేయాలని ఒత్తిడి చేస్తుంటాయి. మరోకోన్ని సంస్థలు ఆఫీసు సమయం ముగిసిన తర్వాత కాల్ చేసి మరి పని చేయాలని ఉద్యోగులకు చిరాకు తెప్పిస్తాయి. ఇలాంటి, కష్టాలు మీకు కలిగితే పోర్చుగల్ దేశానికి వెళ్ళండి. ఎందుకంటే, ఉద్యోగులకు ఇటువంటి వాటి నుంచి ఉపశమనం పొందేలా పోర్చుగీస్ పార్లమెంట్ కొత్త కార్మిక చట్టాన్ని ఆమోదించింది. పోర్చుగల్ సోషలిస్ట్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఆఫీసు పని అయిపోయిన తర్వాత ఉద్యోగులను పనిచేయాలనే కోరితే ఆ యజమానులకు జరిమానా విధించవచ్చు. వర్క్ ఫ్రమ్ హెం చేసిన సమయంలో కూడా సమయం దాటిన తర్వాత పని చేయించుకోకూడదు. ఇంటి నుంచి పనిచేసేటప్పుడు అయ్యే గ్యాస్, ఇంటర్నెట్, విద్యుత్ బిల్లులు వంటి పెరిగిన ఖర్చులను తమ సిబ్బందికి యజమానులు చెల్లించాల్సి ఉంటుంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఇంటి నుంచి పనిచేసే కొత్త సంస్కృతి కారణంగా అనేక ఇళ్లు తాత్కాలిక కార్యాలయాలుగా మారాయి. ఇంకా పిల్లలతో ఉన్న ఉద్యోగులకు వారి పిల్లలు 8 ఏళ్లు వచ్చే వరకు ఇంటి నుంచి పని చేయడానికి చట్టపరమైన రక్షణలు ఇచ్చింది. మెరుగైన పని-జీవిత సమతుల్యతను నెలకొల్పడానికి ఈ చట్టం తీసుకొచ్చామని కార్మిక, సామాజిక భద్రత మంత్రి అనా మెండెస్ గోడిన్హో పేర్కొన్నారు. పది మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. (చదవండి: మార్క్ జుకర్‌బర్గ్‌పై తీవ్ర విమర్శలు.. ఇన్స్టాగ్రామ్.. టేక్ ఏ బ్రేక్!) -
వర్క్ ఫ్రం హోం: ఎక్స్ ట్రా వర్క్‌కి చెక్ పెట్టేలా కొత్త చట్టం
పోర్చుగల్: ఈ కరోనా మహమ్మారి కారణంగా అందరూ వర్క్ ఫ్రం హోంకి పరిమితమయ్యారు. దీంతో కాన్ఫరెన్స్‌లు వంటివి వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత పెట్టేవారు. అందువల్ల చాలామంది ఉద్యోగులు ఒత్తిడికి గురయ్యేవారు. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీస్‌కి దూరంగా పనిచేయడంతో వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో పనిచేశారు. కానీ ఇప్పుడూ అలాంటి పనులు చేస్తే జరిమాను విధిస్తాను అంటోంది పోర్చుగల్ ప్రభుత్వం. (చదవండి: టీ అమ్మే వ్యక్తి.. నేడు రైలు ఇంజిన్ తయారు చేసే స్థాయికి!) అసుల విషయంలోకెళ్లితే...కోవిడ్ -19 దృష్ట్యా 18 నెలలుగా ప్రజలు ఇంటి నుండి పని చేయడం ప్రారంభించారు. దీంతో ఆఫీస్ కాల్లు, గ్రూప్ కాల్లు, జూమ్ మీటింగ్‌లు, కాన్ఫరెన్స్ కాల్లు వంటివి ఇటీవలకాలంలో ఎక్కువయ్యాయి. సహోద్యోగులతో మాట్లాడాలంటే ఆఫీస్‌కి రాలేరు కాబట్టి డిజిటల్ కమ్యూనికేషన్ ఒక్కటే పరిష్కారం. దీంతో తాము మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామంటూ పోర్చుగల్ ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో కొత్త కార్మిక చట్టాలను ఆమోదించింది. దీంతో బాస్‌లు, టీమ్ లీడర్లు పని గంటలు అయిపోయిన తర్వాత సిబ్బందికి కాల్ చేసి ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. ఒకరకరంగా చెప్పాలంటే పనిగంటలు అయిపోయిన తర్వాత బాస్‌లు ఎటువంటి సందేశాలు గానీ, పోన్‌లుగానీ చేయకూడదు, అలాగే ఎక్స్ట్రా వర్క్ చేయమని బలవంతం చేయకూడదు అంటూ పోర్చుగల్ ప్రభుత్వం కొత్త లేబర్ చట్టాలను తీసుకువచ్చింది. ఒక వేళ నియమాలను ఉల్లంఘిస్తే జరిమానాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించింది. (చదవండి: పువ్వుల్లొ దాగున్న ఇల్లు... కానీ అవి మొక్కలకు పూయని పూలు!) -
రోజూ అదనంగా పనిచేస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం కావడానికి అధిక సమయం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని టీఎన్జీవోలు ప్రకటించారు. సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ అధ్యక్షతన మంగళవారం టీఎన్జీవో భవన్లో కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశం వివరాలను టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కె.రవీందర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. అందులోని ముఖ్యాంశాలు.. తెలంగాణ ఏర్పాటు కేవలం ఉద్యోగులకు కాదు. అన్ని వర్గాల ప్రజల కోసం. తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రోజూ అదనంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర సాధనలో ముందుండి పోరాడిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రాన్ని అమరవీరులకు అంకితం చేయాలి. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేయాలి. రాజకీయ జేఏసీ చైర్మన్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలి. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, వారి పిల్లలకు ఉచిత విద్య అందించాలి. సీమాంధ్ర ఉద్యోగుల పట్ల ఘర్షణ వాతావరణం ఉంది. వారి మీద వ్యతిరేకత లేదు. మా ఉద్యోగాలు, ప్రమోషన్లను కొల్లగొట్టడం వల్లే 1969 నుంచి తెలంగాణ ఉద్యోగుల్లో ఆవేదన ఉంది, అందుకే ఉద్యమించారు. హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందంటూ కొన్ని పార్టీలు చేసిన ప్రచారంలో వాస్తవం లేదు. అందరూ స్వేచ్ఛగా ఉండవచ్చు. అయితే ఇతరుల స్వేచ్ఛ, హక్కులకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానికత ఆధారంగా ఉద్యోగుల, పెన్షనర్ల విభజన జరగాలి. మొత్తం ఉద్యోగాల్లో 42 శాతం తెలంగాణకు, 58 శాతం సీమాంధ్రకు పంచాలి. మా వాటా 42 శాతంలో పూర్తిగా తెలంగాణ ఉద్యోగులే ఉండాలి. ఇప్పటికే మా ఉద్యోగాలు కొల్లగొట్టడం వల్ల తీవ్రమైన అన్యాయాన్ని భరించాం, పెన్షనర్ల భారాన్ని కూడా తెలంగాణ మీద నెడితే అంగీకరించం. సీమాంధ్ర పెన్షనర్లకు మేం వ్యతిరేకం కాదు. స్థానికత ఆధారంగానే పెన్షనర్ల విభజన జరగాలి. ప్రైవేటు ఉద్యోగుల్లో 80-90 శాతం మంది తెలంగాణేతరులే ఉన్నారు. ఇక మీదట ప్రైవేటు రంగంలో 80 శాతం ఉద్యోగాలు తెలంగాణవారికే ఇవ్వాలి. మార్చి 31 నాటికి కొత్త పీఆర్సీ అమలుచేయాలి. హెల్త్‌కార్డుల స్టీరింగ్ కమిటీ ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. రెండు రాష్ట్రాలకు రెండు స్టీరింగ్ కమిటీలు ఏర్పాటు చేసి, వెంటనే పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలి. సీఎం రాజీనామా తర్వాత కూడా ఉద్యోగుల సర్వీసులకు సంబంధించిన జీవోలు వచ్చాయి. ఈ నెల 19 తర్వాత వెలువడిన జీవోలను రద్దు చేయాలి. మార్చి 15 నుంచి 30 వరకు తెలంగాణవ్యాప్తంగా తెలంగాణ పునర్నిర్మాణ సభలు నిర్వహిస్తాం. ఏప్రిల్ తొలివారంలో హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి సదస్సు, మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో సదస్సు ఏర్పాటుచేస్తాం.