![Reliance JioBharat 4G phone available on Amazon check price specifications - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/29/JioBharat4g.jpg.webp?itok=b5YEMkNn)
JioBharat 4G ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఇటీవల లాంచ్ చేసిన JioBharat 4G ఫోన్ అమెజాన్‌లో కొనుగోలుకు అందు బాటులో ఉంది. రూ.999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఇప్పటికీ 2G ఫోన్‌లను ఉపయోగిస్తున్న వారికి సరసమైన ధరలో, ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో జియోభారత్ 4G ఫోన్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 23 భాషలకు మద్దతు ఇస్తుందని విడుదల సందర్బంగా జియో ప్రకటించింది. కార్బన్‌తో కలిసి తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 1000mAh బ్యాటరీ , మైక్రో SD కార్డ్ వంటి ఫీచర్లతోపాటు స్విఫ్ట్ 4G ఇంటర్నెట్ కనెక్ట్ సామర్థ్యంతో వచ్చింది.
JioBharat 4G ఫీచర్లు
1.77-అంగుళాల TFT డిస్‌ప్లే
3.5mm హెడ్‌ఫోన్ జాక్
0.3MP కెమెరా విత్ LED ఫ్లాష్
1000mAh బ్యాటరీ
ఎక్స్‌టర్నల్ మైక్రో SD కార్డ్ సపోర్ట్ ద్వారా వినియోగదారులు 128GB వరకు స్టోరేజీని విస్తరించుకోవచ్చు. "భారత్" , వెనుక కార్బన్ లోగోను డ్యూయల్ బ్రాండింగ్‌తో వస్తుంది. (టాలీవుడ్ మన్మధుడి కళ్లు చెదిరే నెట్‌వర్త్, కార్లు, ఇల్లు ఈ విషయాలు తెలుసా?)
రూ. 123 ప్లాన్
అంతేకాదు ఈఫోన్ లాంచింగ్ సందర్బంగా స్పెషల్‌గా రూ. 123 ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ. అపరిమిత వాయిస్ కాల్‌లు, 14 GB డేటా అందిస్తుంది. డియో స్ట్రీమింగ్‌ను ప్రారంభించే Jio యాప్‌లకు యాక్సెస్‌ని అందిస్తుంది. అయితే, భవిష్యత్తులో ఇతర రిటైల్ అవుట్‌లెట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. (ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్)
Comments
Please login to add a commentAdd a comment