temperature details
-
నిప్పుల కుంపటిలా తెలంగాణ
-
రూ.1049 లకే ఐటెల్ ఫోన్ : అధ్బుత ఫీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఐటెల్ సంస్థ అద్భుత ఫీచర్లు, అతి తక్కువ ధరలో కొత్త ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రధానంగా కరోనా సంక్షోభ సమయంలో బాడీ టెంపరేచర్‌ను గుర్తించాల్సిన అవసరాన్ని గుర్తించిన తాము ఈ ఫోన్‌ను తీసుకొచ్చామని కంపెనీ వెల్లడించింది. ఐటీ2192టీ థర్మో ఎడిషన్ పేరుతో ఐటెల్ దీన్ని ఆవిష్కరించింది. దీని ధరను కేవలం . రూ .1,049గా నిర్ణయించింది. ఇన్‌బిల్ట్ టెంపరేచర్ సెన్సర్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను మానిటర్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. కోవిడ్ -19 నుండి సురక్షితంగా ఉండటానికి ముందస్తు చర్యగా యూజర్ల శరీర ఉష్ణోగ్రతను ట్రాక్ చేసేలా ఎంట్రీ లెవల్ విభాగంలో దేశంలోనే తొలి ఫీచర్ ఫోన్‌గా ఇది నిలిచింది. అలాగే టెక్స్ట్-టు-స్పీచ్ ఫీచర్ ఇందులోని మరో విశేషం. తెలుగుతోపాటు ఎనిమిది భాషలకు ఇది సపోర్ట్ చేస్తుంది. యూజర్లు టెంపరేచర్‌ను గుర్తించేలా ఫోన్లో థర్మో సెన్సార్ ను పొందుపర్చింది. థర్మో బటన్‌ను ఎక్కువసేపు నొక్కి ఉంచితే టెంపరేచర్‌ను రీడ్ చేస్తుంది. సెన్సార్‌ను అరచేతిలో ఉంచుకోవడం లేదా సెన్సార్‌పై టచ్ ఫింగర్‌ను ఉంచితే సెల్సియస్‌లో టెంపరేచర్‌ను చూపిస్తుంది. దీన్ని ఫారెన్‌హీట్‌గా కూడా మార్చుకోవచ్చు. అంతేకాదు టెక్స్ట్-టు-స్పీచ్ ఫీచర్ ద్వారా ఇన్కమింగ్ కాల్లు, సందేశాలు, మెనూ వివరాలు మాత్రమే కాకుండా బాడీ టెంపరేచర్ వివరాలను కూడా వినిపిస్తుంది. ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ, గుజరాతీ భాషల్లో దీన్ని వినవచ్చు. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే 4.5 సెం.మీ డిస్ప్లే, 1,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చింది. ఇది సూపర్ బ్యాటరీ మోడ్‌తో 4 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఈ కీప్యాడ్ ఫీచర్ ఫోన్లో వెనుక కెమెరా, రికార్డింగ్ ఆప్షన్‌తో వైర్లెస్ ఎఫ్ఎం, ఆటో కాల్ రికార్డర్, ఎల్ఈడీ టార్చ్, వన్-టచ్ మ్యూట్ , ప్రీ-లోడెడ్ గేమ్స్ఉన్నాయి. వినియోగదారుల ఆరోగ్యం, వినోదం అనే రెండు లక్ష్యాలతో సమాజానికి ఎక్కువ బాధ్యత వహించేలా ఎంట్రీ లెవల్లో అతి తక్కువ ధరలో ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేశామని ఐటెల్ సీఈఓ తలపాత్రా చెప్పారు -
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
అనంతపురం అగ్రికల్చర్ : ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. బత్తలపల్లి మండలంలో శుక్రవారం అత్యధికంగా 36.4 డిగ్రీలు నమోదు కాగా చెన్నేకొత్తపల్లి 36.2 డిగ్రీలు, శింగనమల 35.3 డిగ్రీలు, అనంతపురం 35.3 డిగ్రీలు, పుట్లూరు, తాడిమర్రి, గార్లదిన్నె 35.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా మండలాల్లో 33 నుంచి 35 డిగ్రీలు గరిష్టంగానూ, 24 నుంచి 26 డిగ్రీలు కనిష్టంగా నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 72 నుంచి 92, మధ్యాహ్నం 48 నుంచి 58 శాతం మధ్య రికార్డయ్యింది. గంటకు 8 నుంచి 16 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆకాశం మేఘావృతమై గుంతకల్లు, గుత్తి, బొమ్మనహాల్, కూడేరు తదితర 10 మండలాల్లో తుంపర్లు పడ్డాయి. -
తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు
అనంతపురం అగ్రికల్చర్ : ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఉక్కపోత, వడగాల్పుల తీవ్రత ఇంకా కొనసాగుతోంది. శుక్రవారం తాడిపత్రిలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. యల్లనూరు 41.4 డిగ్రీలు, బుక్కరాయసముద్రం 40.9 డిగ్రీలు, తాడిమర్రి 40.8 డిగ్రీలు, పుట్లూరు 40.7 డిగ్రీలు, యాడికి 40.6 డిగ్రీలు, నార్పల 40.5 డిగ్రీలు, పెద్దవడుగూరు 40 డిగ్రీలు, బెళుగుప్ప 39.7 డిగ్రీలు, తలుపుల 39.6 డిగ్రీలు, బత్తలపల్లి 39.6 డిగ్రీలు, శింగనమల 39 డిగ్రీలు, అనంతపురం 37.5 డిగ్రీలు ఉండగా మిగతా మండలాల్లో 35 నుంచి 37 డిగ్రీల గరిష్టం, 25 నుంచి 27 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 80, మధ్యాహ్నం 30 నుంచి 40 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 8 నుంచి 15 కిలో మీటర్ల వేగంతో వీచాయి. ఆకాశం మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. బుక్కపట్టణం మండలంలో 12 మి.మీ. వర్షం పడింది. తనకల్లు, కనగానపల్లి, శింగనమల, గుమ్మగట్ట, ఓడీ చెరువు, నల్లమాడ, రాప్తాడు, కొత్తచెరువు తదితర మండలాల్లో తుంపర్లు పడ్డాయి. -
స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు
అనంతపురం అగ్రికల్చర్ : పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి, గాలి వేగం కాస్త పెరిగింది. గురువారం తనకల్లులో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మడకశిర 10.3 డిగ్రీలు, అగళి 11.6 , రొద్దం 11.9 , నల్లమాడ 12.1 , కనగానపల్లి 12.4 , కొత్తచెరువు 12.5 , గాండ్లపెంట, లేపాక్షి 12.8 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 13 నుంచి 18 డిగ్రీలు కొనసాగింది. పామిడిలో 37.5 డిగ్రీల గరిష్టం నమోదు కాగా మిగతా మండలాల్లో 30 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం ఉదయం 65 నుంచి 85, మధ్యాహ్నం 22 నుంచి 32 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 7 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీచాయి. -
పగలు ఎండ... రాత్రి చలి
అనంతపురం అగ్రికల్చర్ : వాతావరణం మారింది. కొన్ని మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలో రాత్రిళ్లు చలి కొనసాగుతుండగా మరికొన్ని మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండ తీవ్రత కనిపిస్తోంది. గురువారం అగళి మండలంలో కేవలం 9.5 డిగ్రీలు కనిష్టం నమోదు కాగా కొన్ని మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 36 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. అగళితో పాటు తనకల్లు 10.3 డిగ్రీలు, మడకశిర 10.4, రొద్దం 10.8, అమరాపురం 11.9, గాండ్లపెంట 12, చెన్నేకొత్తపల్లి 12.3, కనగానపల్లి 12.3, గుమ్మగట్ట 12.6, ఎన్పీ కుంట 12.6, తలుపుల 12.9 కనిష్టం నమోదు కాగా మిగతా మండలాల్లో 13 నుంచి 20 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఇక పగటి ఉష్ణోగ్రతల విషయానికి వస్తే పలు మండలాల్లో 35 నుంచి 36 డిగ్రీలు నమోదు కావడంతో ఎండ తీవ్రత పెరిగింది. ఇందులో కొన్ని మండలాల్లో కనిష్టం, గరిష్టం రెండూ నమోదు కావడం విశేషం. గాలిలో తేమ శాతం ఉదయం 67 నుంచి 87 శాతం, మధ్యాహ్న సమయంలో కేవలం 10 నుంచి 20 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మొత్తమ్మీద ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు చురుగ్గా ఉండటంతో మున్ముందు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండతీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
అనంతపురం అగ్రికల్చర్ : రాత్రి ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతుండగా పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. కొన్ని మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా ఎండలకు చలితీవ్రత తగ్గుముఖం పట్టింది. బుధవారం అగళిలో 11.4 డిగ్రీల కనిష్టం నమోదు కాగా, తనకల్లు 11.7 డిగ్రీలు, రొద్దం 13.3 డిగ్రీలు, కనగానపల్లి 13.4 డిగ్రీలు, నల్లమాడ 13.6 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 14 నుంచి 18 డిగ్రీల వరకు కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 36 డిగ్రీల వరకు నమోదు కావడంతో ఎండలు కాస్త పెరిగాయి. -
మడకశిరలో కనిష్ట ఉష్టోగ్రత 13.8 డిగ్రీలు
అనంతపురం అగ్రికల్చర్ : పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతుండగా రాత్రి ఉష్ణోగ్రతలు, గాలి వేగం స్వల్పంగా పెరిగాయి. చలి వాతావరణంం కొనసాగుతోంది. ఆదివారం మడకశిరలో 13.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తనకల్లు 14 డిగ్రీలు, సోమందేపల్లి 14.6 డిగ్రీలు, రొద్దం 14.7 డిగ్రీలు కొనసాగింది. మిగతా మండలాల్లో 15 నుంచి 20 డిగ్రీల వరకు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 33 డిగ్రీల మధ్య ఉన్నాయి. గాలిలో తేమ శాతం ఉదయం 65 నుంచి 85, మధ్యాహ్నం 35 నుంచి 45 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 8 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో వీచాయి. -
రాత్రికి గజగజ..
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా చలితీవ్రత కొనసాగుతుండగా గాలి వేగం కూడా పెరగడంతో రాత్రి వేళల్లో శీతల వాతావరణం నెలకొంది. శుక్రవారం మడకశిరలో 11 డిగ్రీలు, అగళి 11.2 డిగ్రీలు, రొద్దం 12.2 డిగ్రీలు, సోమందేపల్లి 12.5 డిగ్రీలు, గుత్తి 12.6 డిగ్రీలు, తనకల్లు 12.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో 13 నుంచి 16 డిగ్రీల వరకు కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా తగ్గాయి. జిల్లా అంతటా 28 నుంచి 31 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
కొనసాగుతున్న చలి తీవ్రత
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలితీవ్రత కొనసాగుతోంది. గురువారం మడకశిరలో 9.7 డిగ్రీలు, అగళి 9.8 , రొద్దం 10.1 , అమరాపురం 10.3 , సోమందేపల్లి 11.1 , లేపాక్షి 11.5 , గుడిబండ 11.6 , బెళుగుప్ప 11.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా మండలాల్లో 12 నుంచి 17 డిగ్రీలు కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 32 డిగ్రీలు నమోదయ్యాయి. గాలిలో తేమ ఉదయం 75 నుంచి 90, మధ్యాహ్నం 25 నుంచి 35 శాతం మధ్య నమోదయింది. గంటకు 6 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. -
మడకశిరలో 8.9 డిగ్రీల కనిష్టం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో చలితీవ్రత పెరిగింది. బుధవారం మడకశిరలో 8.9 డిగ్రీల కనిష్టం నమోదైంది. రొద్దం 9.6 డిగ్రీలు, సోమందేపల్లి 9.8 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. కొత్తచెరువు, గాండ్లపెంట, అగళి, కనగానపల్లి , నల్లమాడ , ఎన్పీ కుంట , హిందూపురంలలో పది డిగ్రీలకు పైగా నమోదు అయింది. చెన్నేకొత్తపల్లి 11 డిగ్రీలు, ఓడీ చెరువు 11.4 , తాడిమర్రి 11.5 , లేపాక్షి 11.7 , తలుపుల 11.8 , పుట్లూరు 11.9 , నల్లచెరువు 11.9 , అమడగూరు 11.9 డిగ్రీల మేర నమోదయ్యాయి. మిగతా మండలాల్లో 12 నుంచి 16 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగాయి. -
తగ్గిన రాత్రి ఉష్ణోగ్రతలు
కొనసాగుతోన్న చలి తీవ్రత అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. మంగళవారం చాలా మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే చలి తీవ్రత కొనసాగుతోంది. దీంతో జనం వణికిపోతున్నారు. తనకల్లులో 10.2 డిగ్రీలు కనిష్టంగా నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు జిల్లా అంతటా 29 నుంచి 32 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గిపోవడంతో చలి పులి వణికిస్తోంది. గాలిలో తేమ ఉదయం 70 నుంచి 88, మధ్యాహ్నం 20 నుంచి 32 శాతం మధ్య రికార్డైంది. గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మండలాల వారీగా నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే... ------------------------------------------------------- మండలం ఉష్ణోగ్రతలు డిగ్రీలలో.. ------------------------------------------------------ అగళి 10.5 నల్లమాడ 11.3 రొద్దం 11.3 సోమందేపల్లి 11.5 మడకశిర 12 నంబులపూలకుంట 12.3 గుమ్మగట్ట 12.5 అమడగూరు 12.7 అమరాపురం 12.8 హిందూపురం 12.9 గాండ్లపెంట 12.9 చెన్నేకొత్తపల్లి 13 కుందుర్పి 13.1 కనగానపల్లి 13.1 శెట్టూరు 13.3 ఓబుళదేవరచెరువు 13.3 నల్లచెరువు 13.3 కొత్తచెరువు 13.4 తాడిమర్రి 13.5 పుట్లూరు 13.5 ఽతలుపుల 13.5 కళ్యాణదుర్గం 13.7 కూడేరు 13.7 గుడిబండ 13.7 కంబదూరు 13.9 --------------------------------------------------------------------------- మిగతా మండలాల్లో 14 నుంచి 17 డిగ్రీల వరకు కొనసాగాయి -------------------------------------------------------------------------- -
అగళిలో 12 డిగ్రీల కనిష్టం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా అంతటా రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా అగళిలో మాత్రం గురువారం కూడా 12 డిగ్రీల కనిష్టం నమోదైంది. తనకల్లు 13.2, మడకశిర, రొద్దం 13.3, సోమందేపల్లి 13.9 డిగ్రీలు నమోదు కాగా తక్కిన మండలాల్లో 14 నుంచి 20 డిగ్రీల వరకు కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీలు నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం ఉదయం 65 నుంచి 85, మధ్యాహ్నం 25 నుంచి 35 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీచాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కొంత వరకు పెరిగినా చాలా మండలాల్లో చలితీవ్రత ఇంకా కొనసాగుతోంది. -
స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రతలు
– అగళిలో 11.9 డిగ్రీలు కనిష్టం, -కనగానపల్లిలో 35.2 డిగ్రీలు గరిష్టం అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. ఈ సీజన్లో మొదటిసారిగా రాత్రి, పగటి ఉష్ణోగ్రతల్లో కొంత మార్పు కనిపించింది. బుధవారం అగళి మండలంలో 11.9 డిగ్రీలు కనిష్టం నమోదు కాగా కనగానపల్లి మండలంలో 35.2 గరిష్టం నమోదైంది. అగళి మినహా తక్కిన మండలాల్లో 14 నుంచి 21 డిగ్రీల వరకు రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగలు 30 నుంచి 35 డిగ్రీలు కొనసాగాయి. ఎండ తీవ్రత కాస్తంత పెరిగింది. చలితీవ్రత కొన్ని ప్రాంతాల్లో తగ్గుదల కనిపించింది. గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 80, మధ్యాహ్నం 20 నుంచి 35 శాతం మధ్య ఉంది. గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. -
అగళిలో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రత
అనంతపురం అగ్రికల్చర్ : అగళిలో మంగళవారం 12.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తనకల్లు 13.8 డిగ్రీలు, రొద్దం 13.9 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 14 నుంచి 18 డిగ్రీల వరకు కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 33 డిగ్రీలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినా జిల్లా అంతటా చలితీవ్రత కొనసాగుతోంది. రాగల నాలుగు రోజులు కూడా వాతావరణ పరిస్థితిలో మార్పు ఉండదని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం వాతావరణ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి తెలిపారు. -
అగళిలో 10.9 డిగ్రీలు కనిష్టం
అనంతపురం అగ్రికల్చర్ : అగళిలో శనివారం 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తనకల్లు 11.4 డిగ్రీలు, మడకశిర 11.4 డిగ్రీలు, రొద్దం 11.8 డిగ్రీలు, పుట్లూరు 12.6 డిగ్రీలు, తాడిమర్రి 12.8 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 13 నుంచి 17 డిగ్రీల వరకు కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీలు నమోదయ్యాయి. -
మడకశిరలో కనిష్టం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా మారాయి. కొన్ని మండలాల్లో స్వల్పంగా పెరిగినట్లు కనిపించినా చలితీవత్ర మాత్రం తగ్గలేదు. పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతుండగా గాలివేగం స్వల్పంగా పెరిగింది. గురువారం మడకశిర మండలంలో 11.1 డిగ్రీల కనిష్టం నమోదు కాగా, రొద్దం, తనకల్లులో 11.7 డిగ్రీలు, అగళిలో 11.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మిగతా మండలాల్లో 13 నుంచి 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు జిల్లా అంతటా 29 నుంచి 33 డిగ్రీలుగా నమోదయ్యాయి.