అనంతపురం అగ్రికల్చర్ : ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. బత్తలపల్లి మండలంలో శుక్రవారం అత్యధికంగా 36.4 డిగ్రీలు నమోదు కాగా చెన్నేకొత్తపల్లి 36.2 డిగ్రీలు, శింగనమల 35.3 డిగ్రీలు, అనంతపురం 35.3 డిగ్రీలు, పుట్లూరు, తాడిమర్రి, గార్లదిన్నె 35.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా మండలాల్లో 33 నుంచి 35 డిగ్రీలు గరిష్టంగానూ, 24 నుంచి 26 డిగ్రీలు కనిష్టంగా నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 72 నుంచి 92, మధ్యాహ్నం 48 నుంచి 58 శాతం మధ్య రికార్డయ్యింది. గంటకు 8 నుంచి 16 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆకాశం మేఘావృతమై గుంతకల్లు, గుత్తి, బొమ్మనహాల్, కూడేరు తదితర 10 మండలాల్లో తుంపర్లు పడ్డాయి.