అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో చలితీవ్రత పెరిగింది. బుధవారం మడకశిరలో 8.9 డిగ్రీల కనిష్టం నమోదైంది. రొద్దం 9.6 డిగ్రీలు, సోమందేపల్లి 9.8 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. కొత్తచెరువు, గాండ్లపెంట, అగళి, కనగానపల్లి , నల్లమాడ , ఎన్‌పీ కుంట , హిందూపురంలలో పది డిగ్రీలకు పైగా నమోదు అయింది.
చెన్నేకొత్తపల్లి 11 డిగ్రీలు, ఓడీ చెరువు 11.4 , తాడిమర్రి 11.5 , లేపాక్షి 11.7 , తలుపుల 11.8 , పుట్లూరు 11.9 , నల్లచెరువు 11.9 , అమడగూరు 11.9 డిగ్రీల మేర నమోదయ్యాయి. మిగతా మండలాల్లో 12 నుంచి 16 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగాయి.
మడకశిరలో 8.9 డిగ్రీల కనిష్టం
Published Wed, Jan 18 2017 10:10 PM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM
Advertisement
Advertisement