ఆ ఏడు స్మార్ట్‌ఫోన్లపై ధర తగ్గింపు | Asus ZenFone Smartphones Price Cut in India  | Sakshi
Sakshi News home page

ఆ ఏడు స్మార్ట్‌ఫోన్లపై ధర తగ్గింపు

Published Fri, Jan 5 2018 9:00 AM | Last Updated on Fri, Jan 5 2018 12:34 PM

Asus ZenFone Smartphones Price Cut in India  - Sakshi

ఆసుస్‌ ఇండియా జెన్‌ఫోన్‌ సిరీస్‌లో ఏడు స్మార్ట్‌ఫోన్లపై శాశ్వతంగా ధర తగ్గిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. జెన్‌ఫోన్‌ 3(5.2), జెన్‌ఫోన్‌ 3(5.5), జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌, జెన్‌ఫోన్‌ 3 మ్యాక్స్‌(5.2), జెన్‌ఫోన్‌ 3 మ్యాక్స్‌(5.5), జెన్‌ఫోన్‌ గో(5.0), జెన్‌ఫోన్‌ గో(5.5)లపై ధర తగ్గింపు వర్తిస్తున్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా  ఉన్న అన్ని ఆసుస్‌ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పార్టనర్ల వద్ద ఈ కొత్త ధరలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

  • ఆసుస్‌ ఇండియా ప్రకటన అనంతరం, జెన్‌ఫోన్ 3‌(జడ్‌ఈ552కేఎల్‌) ధర రూ.16,999 నుంచి రూ.14,999కు తగ్గింది. 
  • జెన్‌ఫోన్‌ 3 మ్యాక్స్‌(జడ్‌సీ520టీఎల్‌) అంతకముందు రూ.9999కు లభ్యమవుతుండగా.. ప్రస్తుతం రూ.8,499కే అందుబాటులోకి వచ్చింది.
  • ఆసుస్‌ జెన్‌ఫోన్‌ (జడ్‌ఈ520కేఎల్‌) స్మార్ట్‌ఫోన్‌ లేటెస్ట్‌ ధర తగ్గింపుతో రూ.11,999కే అందుబాటు
  • జెన్‌ఫోన్‌ 3 మ్యాక్స్‌(జడ్‌సీ553కేఎల్‌) ధర రూ.12,999 నుంచి రూ.9,999కు తగ్గింది.
  • జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌(జడ్‌సీ550కేఎల్‌) ధర రూ.7,499కే అందుబాటు
     

ఇతర బడ్జెట్‌ ఆసుస్‌ జెన్‌ఫోన్‌ గో సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లపై కూడా ధర తగ్గింది.

  • జెన్‌ఫోన్‌ గో 5.0 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.7,999 నుంచి రూ.6,499కి తగ్గింది
  • జెన్‌ఫోన్‌ గో 5.5 స్మార్ట్‌ఫోన్‌ను రూ.6,999కే విక్రయించనున్నట్టు పేర్కొంది

దేశీయ కస్టమర్లను ఆకట్టుకోవడంలో జెన్‌ఫోన్లు చాలా విజయవంతమైనవి అని, భవిష్యత్తులో కూడా మరింత మంది కస్టమర్లను ఆకట్టుకుంటాయని ఆకాంక్షిస్తున్నామని ఆసుస్‌ ఇండియా సౌతాషియా అండ్‌ కంట్రీ మేనేజర్‌, రీజనల్‌ హెడ్‌ పీటర్‌ ఛాంగ్‌ చెప్పారు. ఈ కొత్త ఏడాదిలో తమ వ్యూహం రెండు పిల్లర్లపై ఉందని, ఒకటి  మంచి టెక్నాలజీ అందించడం కాగ, రెండోది ధరతో ఆకట్టుకోవడమని ఆయన పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement